లాలా లజపత్ రాయ్ (జనవరి 28, 1865 - నవంబరు 17, 1928)

*చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి*

*లాలా లజపత్ రాయ్*
 (జనవరి 28, 1865 - నవంబరు 17, 1928)

*భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28, 1865, మరణం నవంబరు 17, 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.*

*లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో ల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.*

*1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంగము (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకించుతూ ఉద్యమం చేపట్టినారు.*

*లాలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడిన తీవ్రజాతీయవాదులలో లాలా లజపతిరాయి ప్రముఖుడు. 1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములు ప్రచురించెను తద్వార కాంగ్రెస్సు వారు తమ తరఫున హిందు మహాసభకు ప్రతినిధిగా నియమించవలసినదని ప్రతిపాదించాడు.*

Post a Comment

0 Comments