మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.

మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.
.................................................

పరాక్రమం చేత
దానం చేత
ఔదార్యం చేత
సౌశీల్యం చేత
ప్రేమచేత
కరుణచేత
శోభిస్తూ కుమారగిరిరెడ్డి
కీర్తి దశదిశలా వ్యాపించింది అని శ్లాఘించారు కదా! కవులు. ఆ  దశదిశలంటే ఏమిటో తెలుసా ?

అవేమిటంటే మొదటివి అష్టదిక్కులు.అంటే ఎనిమిది దిక్కులు.
మరో రెండు - (1)ఊర్ద్వదిక్కు (2) అధోదిక్కు.

(1) తూర్పు - అధిపతి - ఇంద్రుడు, రాజధాని - అమరావతి,ఆయుధం - వజ్రం, భార్య - శచీదేవి, వాహనం - ఐరావతం.

(2) అగ్నేయం - అధిపతి -అగ్ని, తేజోవతి పట్టణం, భార్య - స్వాహాదేవి, ఆయుధం - శక్తి, వాహనం - తగరు (మేక).

(3) దక్షిణం - అధిపతి - యముడు, సంయమని నగరం, శ్యామలాదేవి, మహిషం, దండం.

(4) నైబుుతి - అధిపతి - నైరుతి, కృష్ణాంగన పట్టణం, ఆయుధం - కుంతం, భార్య దీర్ఘాదేవి, వాహనం - గుర్రం.

(5) పడమర - అధిపతి - వరుణుడు, శ్రద్ధావతి నగరం, ఆయుధం - పాశం, కాళికాదేవి, వాహనం - మొసలి.

(6) వాయువ్యం - అధిపతి - వాయువు,రాజధాని - గంధవతి , భార్య - అంజనాదేవి , వాహనం - జింక,
ఆయుధం - ధ్వజం.

(7) ఉత్తరం - అధిపతి - కుబేరుడు,రాజధాని - అలకాపురి,-భార్య - దీర్ఘాదేవి, వాహనం - నరుడు.

(8) ఈశాన్యం - అధిపతి - శివుడు (ఈశానుడు) యశోవతి పట్టణం, - భార్య - పార్వతి , వాహనం - వృషభం, ఆయుధం - త్రిశూలం.

(9) ఉర్ద్వలోకం - పైన (ఆకాశం) బ్రహ్మ, సత్యలోకం, సరస్వతి, జపమాల, కమండలం, పద్మం, వేదాలు కలిగి వుంటాడు.

(10) అధోదిక్కు - విష్ణువు, వైకుంఠం, లక్ష్మి, గరుడ, శంఖుచక్రగదఖడ్గధారి.
..............................................................................................

Post a Comment

0 Comments