నిజాయితీ!
అది ఒక చిన్నగ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు, ఆ గ్రామానికి సర్వే చేయటానికి ఒక ఇంజీనీర్ వచ్చి, తన పని పూర్తిచేసుకుని, రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజినీర్ తన బ్యాగ్ నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులను ఆర్పీ, మరో రెండు కొవ్వొత్తులను బ్యాగ్ నుండి తీసి వెలిగించి పుస్తకం చదవ సాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా! ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా! దాన్ని ఆర్పీ వేరే వాటిని ఎందుకు వెలిగించారు అని అడిగాడు.
అందుకు ఆ ఇంజినీరు, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి, దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేసాను, ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులను వెలిగించి చదువుతున్నాను అన్నాడు.
ఈ రోజుల్లో ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు, కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజినీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద.
ఇంతకీ ఆ ఇంజినీరు ఎవరో తెలుసా
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
🙏💐🙏💐🙏
Hi Please, Do not Spam in Comments