ప్రపంచానికి భారత్అందించిన ఏడు అద్భుతాలు ఇవే..

ప్రపంచానికి భారత్అందించిన ఏడు అద్భుతాలు ఇవే..

SHYAMPRASAD +91 8099099083
0
ప్రపంచానికి భారత్అందించిన ఏడు అద్భుతాలు ఇవే..
.............................................................

1.యోగా

శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతోంది. దీని మూలాల‌న్నీ భార‌త్‌లోనే ఉన్నాయి. వేద‌కాలం నుంచే భార‌త‌దేశంలో యోగా ఉంది. ఐక్యరాజ్యసమితి కూడా జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది. స్వామి వివేకానంద (1863-1902) పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు.

2.రేడియో ప్రసారాలు

రేడియోను ఎవరు కనుగొన్నారు? అని అడిగితే గుగ్లిల్మో మార్కొనీ అని చెప్తారు. కానీ అంతకన్నా ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను ఉపయోగించారు. అప్పట్లో ఆ మైక్రోవేవ్‌ల‌ను మందుగుండును పేల్చేందుకు, గంట కొట్టేందుకు వాడేవారు. నాలుగేళ్ల తర్వాత దానిని టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో తెచ్చారు. ఆ తరువాత వైర్‌లెస్‌ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వ‌చ్చాయి.

3.ఫైబర్ ఆప్టిక్స్

ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించగలరా? ఫేస్‌బుక్, ఈ-మెయిళ్లను నిత్యం చెక్ చేసుకుంటూ ఉండే ఈ కాలంలో ఇంటర్నెట్ కనీస అవసరంగా మారింది. ఇంటర్నెట్ ఇంతగా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. ఈ టెక్నాలజీ రావడంతో వెబ్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పంజాబ్‌కు చెందిన నరీందర్‌సింగ్ కపాని పేరున్నభౌతిక శాస్త్రవేత్త. ఆయ‌న్ను 'ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడి'గా పిలుస్తారు. 1955-65 మధ్య ఆయన సాంకేతిక అంశాలపై చాలా వ్యాసాలు రాశారు. అందులో ఒకటి 1960లో సైంటిఫిక్ అనే అమెరికా పత్రికలో ప్రచురిత‌మైంది. అది ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీకి పునాది వేసింది.

4.వైకుంఠపాళి

గేమింగ్ రంగం ఇప్పుడు జోరు మీదుంది. పబ్‌జీ వంటి కంప్యూటర్, మొబైల్ గేమ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆటలన్నింటికీ ప్రేరణ మన వైకుంఠపాళేనని అంటారు. భారత్‌లో పుట్టిన ఈ ఆటకు విదేశాల్లో విపరీతమైన ఆద‌ర‌ణ ఉంది. అప్పట్లో దీన్ని పిల్లలకు జీవిత విలువలను బోధించేందుకే తీసుకొచ్చారని చెప్తారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇదో వ్యక్తిత్వ వికాస ఆట‌. ఇందులో ఉండే నిచ్చెనను మంచి అలవాట్లకు నిదర్శనంగా, పామును చెడు అలవాట్లకు ప్రతిబింబంగా అభివర్ణిస్తారు.

5.యూఎస్‌బీ పోర్టు

యూనివర్సల్ సీరియల్ బస్ అంటే అంద‌రికీ అర్థం కాదేమో కానీ.. యూఎస్‌బీ అంటే వెంట‌నే అర్ధమైపోతుంది. యూఎస్‌బీ విధానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానిని మరొకదానితో కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు కంప్యూట‌ర్లు, మొబైల్ యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నిటికీ యూఎస్‌బీ పోర్టులు ఉంటున్నాయి. వైర్‌లెస్ సాంకేతికత‌ ఎంత వేగంగా విస్తరిస్తున్నా యూఎస్‌బీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు.
ఈ యూఎస్‌బీ సాంకేతిక‌త‌ను ప్రపంచానికి అందించింది అజయ్ భట్. 1990లలో భట్, అతడి బృందం దీన్ని అభి‌వృ‌ద్ధి చేసింది. తరువాత 2000 నాటికి కంప్యూటర్ కనెక్టివిటీలో ఇది అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా మారిపోయింది. 2009 నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు వచ్చింది. ఆ ఏడాది ఇంటెల్ సంస్థ విడుదల చేసిన ఓ టెలివిజన్ ప్రకటనతో భట్ పేరు ప్రపంచానికి తెలిసింది. 2013లో భట్ యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డును అందుకున్నారు.

6.ఫ్లష్ టాయిలెట్లు

సింధు నాగరికత కాలంలోనే ఫ్లష్ టాయిలెట్లు ఉపయోగించినట్లు పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి. ఆ కాలంనుంచే ఇక్కడ రిజర్వాయర్లు, క్రమబద్ధమైన మురుగు నీటి వ్యవస్థ ఉండేవి.

7.షాంపూ

శుభ్రతతో పాటు మెరిసే జుట్టు కోసం వందల ఏళ్ల కిందటే భారతీయులు షాంపూలను వినియోగించేవారు. 15వ శతాబ్దంలో మొక్కల ఆకులు, పండ్ల విత్తనాలతో వీటిని తయారుచేసేవారు. బ్రిటిష్ పాలనా కాలంలో వ్యాపారులు ఇక్కడి నుంచి ఐరోపా దేశాలకు షాంపూలు తీసుకెళ్లేవారు.
............................................................................
...........Collected ...GB VISWANATH..94412 45857 Anantapuram

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!