తెలుగు భాషా చమత్కారాలు - A to Z 2512

HIGHLIGHTS

😃 *తెలుగు భాషా చమత్కారాలు*😃
*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు. 
"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.
మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప 
మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.
ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. 
ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని 
బదులిచ్చాడు శ్రీశ్రీ.
ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి 
ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.
ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే 
ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.
ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె 
వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక 
కంటకుడు" అని సరి చేశాడు.
"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను" అనేది తప్పు. జమాల్ భాషాతో 
కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.
ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి 
సహకరించమని అడిగాడు. 
"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా" అనన్నాడు శాస్త్రి. 
"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి" అనన్నాడా హరిదాసు. 
"మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే" అనన్నాడు శాస్త్రి.*
"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన 
పద్యం :
మ. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్
నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా
వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా
పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా

No comments