చేగువేరా పుట్టిన రోజు సందర్భంగా...ఏర్నెస్టో "చే" గువేరా (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967)

చేగువేరా పుట్టిన రోజు సందర్భంగా...ఏర్నెస్టో "చే" గువేరా (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967)

SHYAMPRASAD +91 8099099083
0
పుట్టిన రెండు సంవత్సరములకు గాని తెలియలేదు ఆతల్లిదండ్రులకు తమబిడ్డకు ఉపశమనం తప్ప శాశ్విత చికిత్స లేని ఆస్మా వుందని.అందువల్ల చల్లని ప్రాంతాలనుండి కొంచెం వేడిమి వెతుక్కుంటూ అల్డా గ్రానియా లో స్థిరపడ్డారు.తన ఆస్మా అనే వైకల్యం నుండి బయటపడుటకు ఈత,రగ్బీ ,చెస్ ,టెన్నిస్ ,గుర్రపుస్వారీ ,షూటింగ్ లాంటి ఆటలలో ప్రావీణ్యత సాధించాడు ఆ కుర్రాడు. తండ్రి స్థిరాస్థి వ్యాపారంలో మంచి స్థితివంతుడు కావడంతో డబ్బుకు కొదవలేక పోవడంతో ఒక గదినే గ్రంధాలయంగా మార్చేసుకొన్నాడా యువకుడు.ప్రపంచప్రసిద్ధిగాంచిన తత్వవేత్తల రచనలతో పాటు అన్ని రకాల పుస్తకాలు కలిపి 3000 పుస్తకాలు సేకరించి వాటిని విశ్లేషణాత్మకంగా నోట్ రాసిపెట్టుకొన్నాడు. బుద్ద ,అరిస్టాటిల్ ,సిగ్మిండ్ ఫ్రాయిడ్ ,గాంధీ,నెహ్రూ,ఎంగిల్స్ ,లెనిన్ ,రస్కిన్ లాంటి వారి గ్రంధాలను ఔపోసనపట్టాడు.
  అన్నింటా చురుకుగా వుండే ఆ కుర్రాడు మెడిసిన్ చదువుతూ 1951 డిశంబర్ 29తన 22 యేట తనస్నేహితునితో కలిసి మోటార్ సైకిల్ పై లాటిన్ అమెరికాదేశాల పర్యటనకు బయలుదేరేడు. ఆ పర్యటనే అతని జీవితాన్ని మలుపుతిప్పి ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంధి పలికింది.నిరంతరం పడిలేస్తూ,చస్తూ బ్రతుకుతున్నఅభాగ్యజీవులకు వెలుగునిచ్చే కాంతి పుంజమైనాడు..అతడే *చేగువేరా*.. మేధావిగా ,వైద్యుడిగా,కవిగా,గెరిల్లా వ్యూహకర్తగా,విప్లవవీరునిగా,ఓ మంచి స్నేహితునిగా,మంచికొడుకుకు ఉదాహరణలుగా నిలిచిపోయాడు *చేగువేరా*.
  చాలామంది వీరులు కేవలం తమదేశంకోసమో,తమజాతి కోసమో,తమ ప్రాంతంకోసమో పోరాడుతారు. కాని చేగువేరా పోరాటినికి సరిహద్దులు లేవు,తనపోరాటం ఆక్రమణలమీద ..దౌర్జన్యం మీద సామ్యాజ్యవాద దోపిడీ మీద.అర్జంటైనాలో పుట్టి క్యూబా,గ్యాటిమాలా,మెక్సికో .కాంగో,బొలీవియా లోని నియంతపాలకులను, వారిని ఆడిస్తున్న అమెరికా,బ్రిటన్ పెట్టుబడిదారుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన విప్లవవీరుడు. రౌల్ కాస్ట్రో ,ఫిడేల్ కాస్ట్రో లతో కలిసి క్యూబా విప్లవంలో పాల్గొని బాటిస్టా నియంత పాలనను కూలదోసి కమ్యూనిష్ట్ పాలన తీసుకొచ్చిన మొనగాడు. అమెరికా సామ్రాజ్యవాదంను వివిధ వేదికలపై తూర్పరా పట్టిన మొనగాడు.ప్రపంచంలో పేదిరికానికి పెట్టుబడిదారీ, దళారీవ్యవస్థే కారణమని ,సోషలిజమే పేదరికానికి విరుగుడని భావించి తన చివరి శ్వాసవరకు అభాగ్యుల విముక్తికోసమే పోరాడిన యోధుడు.చివరికి 1967లో బొలివీయా  నియంతపాలకుల నుండి విముక్తి కొరకు పోరాడుతూ అమెరికాకమెండోలకు చిక్కి అత్యంత కిరాతంగా చంపబడ్డాడు. కమ్యూనిజం ప్రాబల్యం తగ్గుతుండ వచ్చేమో గాని చేగువేరా జ్ఞాపకం వున్నంత వరకు కమ్యునిజ భావజాలం నిలిచి వుంటుంది. ఈ రోజుకీ చే గువేరా బొమ్మలున్న టీ షర్ట్స్ విపరీతంగా అమ్ముడవుతుండటం చేగువేరా మీద యువతకు ఇప్పటికీ వున్న అభిమానమే నిదర్శనం. 14 జూన్ చేగువేరా పుట్టిన రోజు సందర్భంగా అతని జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న వ్యాసం.చరిత్రలో చేగువేరా ఒక విప్లవజ్యోతి అనుటలో ఎటువంటి సందేహం లేదు.

ఎర్నెస్టో రఫేల గువేరా డే లా సెర్న్ పేరు చే గువేరా గా ఎలా మరిదో చూద్దాము....

మెక్సికోలో ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956-1959) లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా, మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు.గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు చే గువేర గా స్థిర పడిపోయింది.

ఏర్నెస్టో "చే" గువేరా (జూన్ 14,[1] 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.
💐🚩💐🚩💐

💐🚩💐🚩💐🚩💐

సేకరణ......

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!