ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి...

ఆడది ఏమి చేసినా తప్పే ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి...
●నవ్వితే అమ్మో ఆపిల్ల చూడండి బుద్ది లేకుండా ఎలా నువ్వుతుంది అంటారు!!!
●ఏడిస్తే దరిద్రం ఎడవకూడదు అంటారు!!!
●నలుగురిలో కలిసిపోతే సిగ్గు ఎగ్గూ లేకుండా చూడండి ఎలా వుందో నలుగురిలో అంటారు!!!!
●నలుగురితో కలవకపోతే ముచ్చు మొహంది అస్సలు కలవదు అంటారు!!!
●బయటకు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో..అసాద్యురాలు అంటారు!!!
●బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చేతకానిది అసమర్థురాలు అంటారు!!!
●ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు!!!
●ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి అంటారు!!!
●లక్షణంగా తయారయితే సోకులాడి అంటారు!!!
●చింపిరిగా ఉంటే మోటు మనిషి,,మొరటు మనిషి అంటారు!!!
●భర్తను ప్రపంచంగా భావిస్తే..రెండో పని లేదు మొగుడే ప్రపంచం అంటారు!!!
●భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుంది అంటారు!!!
●పిల్లల్ని త్వరగా కంటే ముసలిదయ్యింది అంటారు !!!
●లేటుగా కంటే..ఈలోపు కొన్ని నోర్లు గొడ్రాలు అంటారు!!!
●భర్త బయటకు వెళ్లెప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనే తిరిగి వస్తారా అంటారు!!!
●భర్త బయటకు వెళ్లెప్పుడు రాకపోతే ఎప్పుడు పని పని,,దీనికి ఇంటి పని తప్ప మొగుడు ధ్యాస ఉండదు పాపం పొద్దునే వెళ్తే ఎప్పుడో రాత్రికి కదా వచ్చేది అంటారు!!!
●భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా...అంటారు!!!
●ఎదురుచూడకపోతే వాడి జీతం మీద వున్న శ్రద్ధ మనిషి మీద ఉండదు అంటారు!!!
●పిల్లలకి భయం చెప్తే వామ్మో...అది తల్లి కాదు రాక్షసి అంటారు!!!
●ముద్దుగా గారాబంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు!!!
●ఒక రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు !!!
●దాచిపెడితే పీనాసి అంటారు !!!
●ఓపెన్ గా మాట్లాడితే ఏది దాచుకోలేదు అంటారు!!
●మౌనంగా ఉంటే కుళ్లు ఎక్కువ వ్యసన పడుతుంది!అంటారు !!!

ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ ఏదో సమయంలో ఎదుర్కొంటూనే_ఉంటుంది కాని తానెక్కడకృంగిపోదు ఎందుకంటే స్త్రీ కాబట్టి మాతృమూర్తి కాబట్టి
గౌరవించక పోయినా పర్వాలేదు బాధపెట్టద్దు👏👏👏

Post a Comment

0 Comments