Current Affairs in Telugu 1

Current Affairs in Telugu 1

SHYAMPRASAD +91 8099099083
0
Current Affairs in Telugu

1. ప్రజాస్వామ్య సూచీలో భారత్‌ 42వ స్థానంలో నిలిచింది.
2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసాగుతోంది.
ఈ జాబితాలో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి.
మొత్తం 10 మార్కులకు గాను భారత్‌ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కింది.
టాప్‌ 10 దేశాలు
ర్యాంక్‌    దేశం
1    నార్వే
2    ఐస్‌లాండ్‌
3    స్వీడన్‌
4    న్యూజిలాండ్‌
5    డెన్మార్క్‌
6    ఐర్లాండ్‌
7    కెనడా
8    ఆస్ట్రేలియా
9    ఫిన్లాండ్‌
10    స్విట్జర్లాండ్‌
165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) జాబితా రూపొందించింది.

2. మొబైల్‌ నెంబరు మారకుండా, నెట్‌వర్క్‌ను మార్చుకునేందుకు వినియోగదారుకు అవకాశం కల్పించే మొబైల్‌ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ఛార్జీని రూ.4కు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తగ్గించింది. ఇప్పటివరకు రూ.19 వసూలు చేస్తుండగా, 79 శాతం తగ్గించి, గరిష్టంగా రూ.4 చేశారు. 

3. నూతన జలాంతర్గామి ‘కరంజ్‌’ను నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా సతీమణి రీనా లాంబా 2018 జనవరి 31న ముంబైలో ప్రారంభించారు. అత్యాధునిక స్కార్పేన్‌ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామిని మజగావ్‌ డాక్‌లో నిర్మించారు. 

4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి శైలేంద్రకుమార్‌ జోషి నియమితులయ్యారు.

5. హోంగార్డుల దినసరి భత్యం రూ.675కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం 2018 జనవరి 31న నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 20 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.
ముఖ్యాంశాలు
ప్రస్తుతం రూ.400 ఉన్న దినసరి భత్యం రూ.675కి పెంపు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1న వారి నెల జీతం రూ.1000 పెరిగేలా పెంపు ఉంటుంది.

6. ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడిగా సౌలీ నినిస్టో రెండోసారి ఎన్నికయ్యారు. 2018 జనవరి 28న జరిగిన ఎన్నికల్లో సౌలీ నినిస్టో విజయం సాధించాడు.

7. వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ తాజా నివేదిక ప్రకారం భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో నిలిచింది.
వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ను 1967 జులైలో ప్రారంభించారు.
వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యాయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది.
జాబితా
ర్యాంక్‌    దేశం
1    చైనా
2    జపాన్‌
3    ఇండియా
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి : బీరేందర్‌సింగ్‌

8. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ యొక్క ఇసాన్‌ డోగ్రామసి ఫ్యామిలీ హెల్త్‌ ఫౌండేషన్‌ ప్రైజ్‌ను నీతిఆయోగ్‌ సభ్యుడు డా॥ వినోద్‌పాల్‌ అందుకోనున్నారు. దీంతో ఈ అవార్డు అందుకోనున్న మొదటి భారతీయుడిగా వినోద్‌పాల్‌ ఘనత సాధించారు.

9. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌ 2.8 పెటాఫ్లాప్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిహిర్‌ను నోయిడాలో ప్రారంభించారు. 

10. మొదటి ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను ప్రధాని నరేంద్రమోడి 2018 జనవరి 31న న్యూడిల్లీలో ప్రారంభించారు. ఈ క్రీడలు 2018 ఫిబ్రవరి 8 వరకు జరగనున్నాయి.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల  శాఖ మంత్రి : రాజ్యవర్థన్‌ రాథోడ్

1 దేశంలోని గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ,రహదార్ల అభివృద్దికి గాను ,కేంద్ర ప్రభుత్వం 2001 అక్టోబర్ 2 న ప్రారంభించిన పధకం పేరేమిటి?
Answer : ప్రధాని రహదారి పధకం
2 'షేర్ల డీలిస్టింగ్' పై సిఫారసులు చేసేందుకు సెబి నియమించిన కమిటీ ఏది?
Answer : ఇందర్ రాజ్ కమిటీ
3 ఈ క్రమం తప్పకుండా భారత్ లో జనాభా లెక్కలను ఎప్పటి నుంచి తీసుకొంటున్నారు ?
Answer : 1881
4 ఏ పన్నులలో ఆరంభ ,అంతిమ భారాన్ని ఇతరులకు బదిలీ చేయలేము ?
Answer : ప్రత్యక్ష పన్ను
5 వాహనాలపై పన్ను విధించేది ఎవరు?
Answer : రాష్ట్ర ప్రభుత్వం
6 బ్యాంకు ల ఆస్తి ,ఖర్చు పట్టికలో ఫిక్సెడ్ డిపాజిట్లను ఏ పద్దులుగా పరిగణించవచ్చు ?
Answer : ఆస్తి కాని పద్దు
7 ఎటువంటి పన్నులలో ప్రాతిపదిక పెరిగినా,పన్ను రేటు మారదు ?
Answer : అనుపాతపు పన్ను
8 వస్తువుల విలువలను బట్టి విధించే పన్నును ఏమంటారు ?
Answer : అడ్వలోరమ్ పన్ను
9 ప్రచ్చన్న నిరుద్యోగ ఆర్ధిక వ్యవస్థ లో శ్రామికుని ఉపాంత ఉత్పతకత ఏ విధంగా ఉంటుంది ?
Answer : సున్నాకు సమానం
10 డ్రెయిన్ సిద్దాంతంను చెప్పింది ఎవరు?
Answer : దాదాబాయి నౌరోజీ
11 ధరలు తగ్గి డబ్బు విలువ పెరిగితే దానిని ఏమంటారు ?
Answer : ప్రతి ద్రవ్యోల్బణం
12 జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎవరు ?
Answer : ప్రధాన మంత్రి
13 ప్రపంచ ఆర్ధిక మాంద్య ఏర్పడిన సంవత్సరం?
Answer : 1929-33
14 ఎన్ని సం||లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తారు ?
Answer : 10సం||
15 ఏ ముఖ్య పధకాలను విలీనం చేసి ,జవహార్ రోజ్ గారి యోజనను రూపొందించారు ?
Answer : HYVP, RLEGP
16 మద్దతు ధరలను ఏ సంస్థ ప్రకటిస్తుంది ?
Answer : వ్యవసాయ వ్యయాలు -ధరల కమీషన్
17 ఒక దేశ ఆర్ధిక వ్యవస్థలో వాస్తవిక వస్తుసేవల ఉత్పత్తిలో ఉండే పెరుగుదలను ఏమని పిలుస్తారు ?
Answer : ఆర్ధికాభివృద్ది
18 ఈ క్రింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ ను ఏ విధి నిర్వహణ చేయడం కోసం ఏర్పరిచారు ?
Answer : GATT
19 ప్రపంచ వర్తకానికి MAIN WATCH DOG గా ఉండే సంస్థ ?
Answer : IMF
20 క్రింది వాటిలో ప్రధమంగా సహకార ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడింది ?
Answer : వ్యవసాయ పరపతి

1) వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ?
జ: సంస్కృతం
2) డ్యురాండ్ రేఖ – పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ?
జ: ఆఫ్గనిస్తాన్
3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ?
జ: సుబాబుల్
4) ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ?
జ: మాండరిన్ (చైనాలో )
5) భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ?
జ: పాలు
6) SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ?
జ: మారిషస్
7) విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ?
జ: గోవా
8) ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ?
జ: సుభాష్ చంద్రబోస్
9) ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ?
జ: పశువులు
10) హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ?
జ: రాష్ట్రపతి
11) రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారు ?
జ: ఏ సభలోనైనా
12) ఫిన్ లాండ్ రాజధాని ఏది ?
జ: హెల్సింకి
13) స్వర్ణ్ జయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఏప్రిల్ 1999
14) ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ లో కొత్తగా చేరిన సభ్య దేశం ఏది ?
జ: వియత్నాం
15) చెకోరీ పౌడర్ మొక్కలోని ఏ భాగంలో లభిస్తుంది ?
జ: వేళ్ళల్లో
16) దాద్రా నగర్ హవేలీకి రాజధాని ఏది ?
జ: సిల్వాసా
17) అక్బర్ కు సమకాలికులైన భారతీయ పాలకురాలు ఎవరు ?
జ: రాణి దుర్గావతి
18) అవధ్ స్వతంత్ర్య రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ?
జ: సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్
19) మహేంద్ర సింగ్ ధోనీ మొదటి అంతర్జాతీయ వన్డేని ఎక్కడ ఆడాడు ?
జ: చిట్టగాంగ్
20) గురుముఖి రాతను పరిచయం చేసిన సిక్కుల గురువు ఎవరు ?
జ: గురు అంగద్

1. ఒక బావి నుండి నీరు నిండిన బకెట్ ను తీస్తున్నపుడు బకెట్ గురించి మనం అనుకునే విధానం??
A. నీటి ఫై భాగంలో బకెట్ తేలికగా ఉన్నట్లు
B. నీటి ఫై భాగంలో బకెట్ బరువుగా ఉన్నట్లు
C. నీటి నుండి బైటకు వస్తున్నపుడు సాంద్రత తగ్గినట్లు
D. నీటి నుండి బైటకు వస్తున్నపుడు ద్రవ్య రాసి పెరిగిన్నట్లు
Answer : నీటి ఫై భాగంలో బకెట్ బరువుగా ఉన్నట్లు
2. గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ??
A. మొదటి సూత్రం
B. రెండవ సూత్రం
C. మూడవ సూత్రం
D. రెండవ,మూడవ సూత్రం
Answer : మూడవ సూత్రం
3. ఆటో మొబైల్స్ లో హైడ్రాలిక్ బ్రేకులు వేయు విధానము దేని ప్రత్యక్ష్య అమలు?
A. బెర్నులీ సిద్దాంతం
B. టారి సేల్లియన్ సిద్దాంతం
C. పాస్కల్ సూత్రం
D. అర్కి మేడిస్ సూత్రం
Answer : పాస్కల్ సూత్రం
4. సోనోగ్రఫిలో వాడబడు తరంగాలు ఏవి??
A. మైక్రో వేవ్
B. ఇన్-ఫ్రా రెడ్ కిరణాలు
C. శబ్ద తరంగాలు
D. అల్ట్రా సోనిక్ తరంగాలు
Answer : అల్ట్రా సోనిక్ తరంగాలు
5. డాక్టర్ స్టెతస్కోప్ లో శబ్దం పెద్దగా వినబాడటానికి కారణం ?
A. అనువాద శబ్దం
B. సోపోషక వ్యతికరణం
C. తరంగాల అద్యా రోపణ సిద్దాంతం
D. శబ్ద పరావర్తనం
Answer : శబ్ద పరావర్తనం
6. ఒక ఎరుపు అద్దంలో నుండి ఒక పుస్తకం అత్తను చూసినపుడు అది ఎరుపుగా కనిపిస్తే ,వాస్తవానికి ఆ పుస్తకం అత్తా రంగు ?
A. ఎరుపు రంగు
B. తెలుపు రంగు
C. ఆకుపచ్చ రంగు
D. ఎరుపు లేదా తెలుపు రంగు
Answer : ఎరుపు లేదా తెలుపు రంగు
7. ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేడు.అతడు ఏ వ్యాధి తో బాధ పడుతున్నాడు ?
A. హైపెర్ మైట్రోపిక్
B. మయోపియ
C. ఆస్టిగ్ మేటిజమ్
D. డిస్టార్షన్
Answer : హైపెర్ మైట్రోపిక్
8. భూమి ఎప్పుడు రవి నీచ స్థానానికి చేరుకుంటుంది ?
A. చంద్రుని దగ్గరగా ఉన్నపుడు
B. సూర్యునికి దగ్గరగా ఉన్నపుడు
C. ఫ్లూటోకి దగ్గరగా ఉన్నపుడు
D. సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు
Answer : సూర్యునికి దగ్గరగా ఉన్నపుడు
9. 35 సంవత్సరాల నేతం మార్టిన్ కూపర్ కనుగొన్నది ఏమిటి??
A. కంప్యూటర్
B. మొబైల్ ఫోన్
C. ఇంటర్ నెట్
D. ఏది కాదు
Answer : మొబైల్ ఫోన్
10. ఈ కింది వానిలో పరమాణు సంఖ్యా పరమాణు బరువు ఒకే రకంగా ఉండు మూలకం ?
A. హైడ్రోజన్
B. హీలియం
C. ఆక్సిజన్
D. నైట్రోజన్
Answer : హైడ్రోజన్
11. పెట్రోలియం సాధారణంగా ఉండునది ?
A. అగ్ని శీల
B. అవక్షేప శిలలు
C. రూపాంతర ప్రాప్తిశిలలు
D. బురద నేలలు
Answer : అవక్షేప శిలలు
12. క్రింది ఏ రసాయానలలో ఏ రసాయనం రిఫ్రిజ్రేటర్ లో చల్లదనాన్ని కలిగించే ప్రక్రియలో వాడబడుతుంది?
A. రాడాన్
B. ఫ్రియన్
C. సోడియం
D. ఫ్లోరైన్
Answer : ఫ్రియన్
13. పాలు క్రింది వానిలో దేనికి ఉదాహరణ?
A. విలంబనం
B. జెల్
C. రసాయనం
D. నురుగు
Answer : రసాయనం
14. వెనిగర్ దేని సజల ద్రావణం?
A. ఆక్సాలిక్ ఆమ్లము
B. సిట్రిక్ ఆమ్లం
C. అసిటిక్ ఆమ్లం
D. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
Answer : అసిటిక్ ఆమ్లం
15. క్రింది వానిలో ఒకటి తప్ప మిగిలినవన్ని వైరస్ వలన సంభవించును?
A. కామెర్లు
B. ఇన్ ఫ్లూ యోంజ
C. టైఫాయిడ్
D. మంప్స్
Answer : టైఫాయిడ్
16. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్దం?
A. జెంతోఫిల్
B. రెబో ఫ్లోవిన్
C. రిబ్యులోజ్
D. కరోల్టిన్
Answer : రెబో ఫ్లోవిన్
17. క్రింది వానిలో ఒక ఎముక మనుషులలో ఉండదు?
A. హ్యూమెరాస్
B. కార్పెల్
C. ఆస్ట్రాగెలస్
D. అట్లాస్
Answer : ఆస్ట్రాగెలస్
18. ఎయిడ్స్ దాడి చేయునది?
A. మానవ శరీరంలోని రక్తకణాల
B. మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ
C. మానవ శరీర ఎదుగుదల
D. ఫై వన్ని
Answer : మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ
19. చీమలు సామాజిక కీటకాలు ఎందుకనగా ?
A. అవి గుంపులుగా జీవిస్తాయి
B. ఉపరితలం ఫై జీవిస్తాయి
C. అవి పొరలలో జీవిస్తాయి
D. ఆహారాన్ని అవి పంచుకుంటాయి
Answer : అవి గుంపులుగా జీవిస్తాయి
20. మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది??
A. క్లాడోఫోర
B. నిటెల్ల
C. క్లోరెల్ల
D. ఫైవన్ని
Answer : ఫైవన్ని
21. వృద్ధి చెందిన మానవ ఆస్థి పంజరంలో ఉండునవి?
A. 204 ఎముకలు
B. 206 ఎముకలు
C. 208 ఎముకలు
D. 214 ఎముకలు
Answer : 206 ఎముకలు
22. మానవ మస్తిష్కంలోని అతి పెద్ద భాగం?
A. సెరిబెల్లం
B. మద్య మెదడు
C. సెరిబ్రమ్
D. మెడ్యుల్లె ఒబ్లంగాత్
Answer : సెరిబ్రమ్
23. క్రింది వానిలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు కొవ్వు పదార్దాలు మూడు సంవృద్దిగా కలిగిన పదార్ధము?
A. బియ్యపు ధాన్యం
B. సోయాబీన్ విత్తనాలు
C. మామిడి పండు
D. కాలేజి ఆకులు
Answer : సోయాబీన్ విత్తనాలు
24. రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లము ఉన్న వ్యాధి లక్షణాలు ?
A. ఆర్థెరైటిస్
B. గౌట్
C. రుమెటిజం
D. రుమెటిక్ గుండె
Answer : గౌట్
25. చికెన్ ఫాక్స్ వచ్చునది?
A. వెర్సిల్ల వైరస్
B. అడనో వైరస్
C. బాక్టీరియో ఫెర్జి t2
D. యస్.వి.40 వైరస్
Answer : వెర్సిల్ల వైరస్
26. టైఫాయిడ్ ను నిర్ధారించడానికి వాడబడు పరీక్ష?
A. ఇ.ఎస్.ఆర్.
B. ఎలిసా పరీక్ష
C. వైడల్ పరీక్ష
D. డియలసి్
Answer : వైడల్ పరీక్ష

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!