విలువ ఏమిటి?

విలువ ఏమిటి?

ShyamPrasad +91 8099099083
0

ఒకసారి సామ్రాట్ అశోకుడు, తన మంత్రితో కలిసి ఓ వీధిలో పర్యటిస్తున్నారు, ఇంతలో ఒక బౌద్ధసన్యాసి ఆయనకు ఎదురుగా వచ్చారు.
అశోకుడు, తన తలను ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు, ఇది చూస్తున్న మంత్రి, ఒక సామాన్య సన్యాసికి, చక్రవర్తి అంత గౌరవం ఇవ్వడం అనవసరమని భావించాడు.
ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు, తరువాత ఆ మంత్రిని పిలిచి ఒక గొర్రె తల, ఒక ఎద్దు తల, ఒక మనిషి తల తెమ్మ ని చెప్పాడు, మంత్రి తెచ్చాడు.
వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రికి చెప్పాడు. మంత్రి మేక తలను, ఎద్దు తలను అమ్మ గలిగాడు, మనిషి తలను ఎవరు కొనలేదు, ఇదే విషయం రాజుకు చెప్పాడు. అశోకుడు మనిషి తలను ఉచితముగా అయినా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు, కానీ ఎవరూ మనిషి తలను తీసుకోవడానికి ఇష్ట పడలేదు.
మంత్రి సభకు తిరిగి వచ్చిన తరువాత అశోకుడు ఇలా చెప్పాడు .
"బ్రతికి ఉంటేనే మనిషి తలకు విలువ, చనిపోయిన తరువాత జంతువుల తలకైనా విలువ ఉంటుంది, కానీ మనిషి తలను చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడరు, ఇంకా దానికి విలువ ఏమిటి? అందుచేత అనవసర గర్వము పెంచుకోకూడదు. పెద్దలు, గురువుల పాదాల మీద మన తలను వినయంగా వంచడంలో తప్పులేదు''..

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!