ఉపనిషత్తులు

ఉపనిషత్తులు

SHYAMPRASAD +91 8099099083
0

ఉపనిషత్తులు

ఉపనిషత్తులంటే తెలియకపోయినా వేదాంతం అనే మాట ఉపయోగించని తెలుగువారంటూ ఎవరూ ఉండరు. వేదాలను మధించాగ్గా వాటి సారాంశంగా చివరగా పుట్టినవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతాలుగా పేరుపడ్డాయి. ఇవి వైదిక సాహిత్యంలోని చివరి భాగాలు. అన్ని ధర్మాలకూ వేదమే మూలం. వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్ నే పదానికి సమీపంలో ఉండడం అని అర్థం. సత్యాలను తెలుసుకునేందుకు గురువు దగ్గర ఉండడం లేదా ఆత్మ (పరమాత్మ) కు సమీపంలో ఉండడం అనేవి ఈ శబ్దార్ధం వెనుక ఉన్న ఆంతరిక అర్థాలు. ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను సునిశితంగా చర్చిచడం జరిగింది. ఈ చర్చ ఫలితంగా జీవాత్మ-పరమాత్మలు అభిన్నులు అనే అద్వైతం, జీవుడు-బ్రహ్మము వేరువేరు అనే ద్వైత భావాలకు ఆస్కారం కలిగింది. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే ప్రస్తుతం హైందవం అని పిలువబడే ధార్మికభావనలోని అనేక దార్శనిక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. అనేకమంది ఆచార్యులు ఉపనిషత్తుల ఆధారంగానే తమ సిద్ధాంతాలను రూపొందించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. శంకరాచార్యుల అద్వైతవాదం, రామానుజుల విశిష్టాద్వైతం, నింబార్కాచార్యుల ద్వైతాద్వైతవాదం, వల్లభును శుద్ధాద్వైతవాదం ఇలా అన్నీ ఉపనిషత్ మూలాలున్నవే.
ఉపనిషత్తుల సంఖ్య
వేదాలలాగే ఉపనిషత్తుల సంఖ్య కూడా అసంఖ్యాకం అని కొందరి వాదన. మొదట 1008 ఉపనిషత్తులు ఉన్నట్లూ భావించగా వాటిలో 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలోనూ కలిపి పది ఉపనిషత్తులు ముఖమైనవిగా అధ్యయనం చేస్తారు. ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయ భాష్యంలో పది ఉపనిషత్తులనే చెప్పారు.
ఈశ కేన కఠ ప్రశ్న ముండా మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగయం బృహదారణ్యకం తథా
అనే నామసూచికా శ్లోకాధారంగా దశోపనిషత్తుల పేర్లు ఇవి.
1. ఈశోపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠొపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
ఉపనిషత్తుల కర్తలు
ఉపనిషత్తులు ఏ ఒక్కరి రచనలో కాదు. ఎందరో ఋషులు వీటి రచనాకార్యాన్ని నిర్వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు, అరుణి, శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాడ, సనత్కుమార, గార్గి, మైత్రేయ లాంటి ఎందరెందరో ఉపనిషత్తుల ఆవిర్భావానికి కారణమయ్యారు.
శైవవైష్ణవ ఉపనిషత్తులు
ఈ ఉపనిషత్తులలో కొన్నింటిని శైవులు సొంతం చేసుకోగా, మరికొన్ని ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిశాట్టులుగా ప్రసిద్ధికెక్కాయి. అక్షమాలికోపనిషత్తు, అథర్వశిరోపనిషత్తు, అథర్వశిఖోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాబాలోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, భస్మజాబాలోపనిషత్తు, రుద్రహృదాయోపనిషత్తు, రుద్రాక్షజాబాలోపనిషత్తు, శరభోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు అనే పదిహేను ఉపనిషత్తులు శైవ ఉపనిషత్తులు.
వైష్ణవులకు సంబంధించిన ఉపనిషత్తులుగా చెప్పుకునే పద్నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి. అవ్యక్తోపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపసోపనిషత్తు, తారసోపనిషత్తు, త్రిపాద్విభూతి ఉపనిషత్తు, దత్తత్రేయాపనిషత్తు, రామతాపన ఉపనిషత్తు, రామరహస్యొపనిషత్తు, వాసుదెవ ఉపనిషత్తు, హయగ్రీవ ఉపనిషత్తు. శైవ వైష్ణవ విభాగాలే కాకుండా ఉపనిషత్తులలో మరెన్నో విభాగాలు కనిపిస్తాయి.
ఏ వేదానికి ఎన్ని?
ఉపనిషత్తుల వేదాల సారమైన వేదాంతాలు అనుకున్నప్పుడు ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి 108 ఉపనిషత్తుల వర్గీకరణ కొంతవరకూ సమాధానంగా కనిపిస్తుంది. ఈ నూటఎనిమిది ఉపనిషత్తులలో వేదాల వారీ విభజన ఇలా ఉంది. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19 ఉపనిషత్తులు లభిస్తున్నాయి. సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31 గా ఉపనిషత్తులు ఉన్నట్లూ కనిపిస్తుంది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి ముఖ్యమైన పది ఉపనిషత్తులను ప్రధానంగా ఎంచుకున్నారు. వాటికే దశోపనిషత్తులు అని పేరు.

చతుర్వేదాలు…
విశ్వ సంస్కృతి భవనానికి నాలుగు వేదాలు నాలుగు స్తంభాల వంటివి. వేదాలు అపౌరుషేయాలు. మానవ నిర్మితమైనవి కావు. వేదాలకంటే ప్రాచీనమైన సాహిత్యం లేదు. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నలుగురు ఋషులకు నాలుగు వేదాలు ఆవేశింపచేశాడు. తత్ఫలితంగా ‘అగ్ని’ అనే పేరుగల ఋషి హృదయంలో ఋగ్వేదం ప్రకాశించింది. వాయువు హృదయంలో యజుర్వేదం. ఆదిత్యునిలో సామవేదం ప్రకాశించాయి. అథర్వవేద శాఖకు ‘అంగీరసుడు’ ఆద్యుడయ్యాడు. ఈ నలుగురు ఋషులే తరువాతి కాలంలో వేదాలను వ్యాప్తి చేశారు.
వేద విభాగం
‘వేదం’ అంటే ఈశ్వరీయమైన జ్ఞానం. ఈశ్వరునికి అంతం లేనట్లే వేదానికి కూడా అంతులేదు. నాల్గువేదాలనూ కలిపి వేదం అని ఏకవచనంలో వ్యవహరిస్తారు. అయితే విషయభేదాన్ని బట్టి వేదాన్ని నాలుగు పేర్లతో పిలుస్తారు. ఛందోబద్ధమైన వేదాన్ని ‘ఋక్కులు’ అంటారు. అదే ఋగ్వేదం అయ్యింది. గద్యాత్మకమైన వేదాన్ని యజస్సు అంటారు. ఇది యజుర్వేద పాఠం. గీతాత్మకమైన వేదం సామం గనుక సామవేదం. ఇక అథర్వం పద్యగాద్యాత్మకమైన వేదంగా కనిపిస్తుంది. నాల్గు వేదాలు ఏకకాలంలో ప్రకాశింపబడినాయి. ఒకటి ప్రాచీనం, మరోటి ఆర్వాచీనం అనేమాటలు పాశ్చాత్యుల నుంచి వచ్చినవే కానీ వాటిలో సత్యం లేదు. అన్ని వేదాలలోనూ మిగిలిన వేదాల ప్రస్తావన కనిపిస్తుంది. రుగ్వేదంలో యజుస్సామాథరవ వేదనామాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన వేదాలలో కూడా. నాలుగు వేదాలు ఏకకాలంలో వచ్చాయి కనుకనే ‘చరుర్వేదమ్’ అనేపేరు వినిపిస్తుంది. వేదాన్ని ‘త్రయీ’ అనే పేరుతో పిలుస్తారు. దాని అర్థం వేదాలు మూడు అని కాదు. అన్నివేదాల్లోనూ మూడు అంశాలు ప్రధానంగా కనిపించడం వల్ల ఆ పేరు వచ్చింది. జ్ఞాన, కర్మ, ఉపాసనలకు పుట్టినిల్లు వేదం కనుక ఆ మూడింటినీ దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు వేదాన్ని ‘త్రయీ’ అని పిలిచారు.
వేద ప్రమాణం
వేదం సార్వజనీనమైనది. అది ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందింది కాదు. అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో అందరికీ సమానంగా ఉపయోగపడే విషయాలు వేదంలో ఉన్నాయి. లోకాలన్నీ కలిపి విశ్వం అని పిలిచినట్లుగానే మనం అందరం అలవర్చుకోవలసిన విజ్ఞానాన్ని వేదం అనేపేరుతోనే పిలవడం సముచితమనాలి. వేదం విశ్వవిజ్ఞానకోశమే కాదు, మానవ ధర్మాన్ని ప్రతిపాదించే ఉత్తమోత్తమ వాజ్మయం.
“ఓం యథేమాం వాచం కల్యాణీమావదాని జనేభ్యః!
బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచార్యాయచస్వాయ చారణాయ!!”
(యజుః 26.2)
వేదమే విశ్వానికి అక్షరబిక్ష పెట్టింది. వేదమే లేకుంటే మానవునికి జ్ఞానం లేదు, ధర్మంలేదు, కర్తవ్య కర్మ లేదు. వేదం సర్వమానవాళికి కళ్యాణకారమైంది. ఈ విషయం యజుర్వేడంలోని ఇరవై ఆరో అద్యాయంలోని రెండోమంత్రం ద్వారా నిరూపితమైంది. ఈశ్వరీయ జ్ఞానమైన వేదానికి శృతి అనిపేరు. ఒకరి నుంచి వేరొకరికి వినడం ద్వారా అందుతుంది. వేదం సనాతన ధర్మానికి పట్టుగొమ్మ. దానికదే ప్రమాణం.
వేదమే సకలం
ప్రాచీన కాలం నుంచి వేదమంత్రాల ద్వారా యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. యజ్ఞ నిర్వహణలో నల్గురు రుత్విక్కులు భాగస్వాములవుతారు.
హోత
అధ్వరుడు
ఉద్గాత
బ్రహ్మ
ఇందులో హోత అంటే ఆహ్వానకర్త. యజ్ఞంలో ఆయన మంత్రపూర్వకంగా దేవతలను ఆహ్వానిస్తాడు. ఈ మంత్రాలే ఋక్కులు. ఋగ్వేద పండితుడు. విధి ప్రకారం యజ్ఞం నడిపించేవాడు అధ్వరుడు. అతడు యజుర్వేద మంత్రాలు పఠిస్తాడు. వేదమంత్రాలను ఉచ్చస్వరంతో గానం చేసేవాడు ఉద్గాత. స్వరబద్దమైన సామవేదాన్ని ఇతడు గానం చేస్తాడు. ఇక నాలుగో ఋత్విక్కు పేరు బ్రహ్మ. సర్వవిధ మంత్రవేత్త. యజ్ఞాన్ని సంపూర్ణం చేసేవాడే బ్రహ్మ. ఆయన చదివే మంత్రాలతో కూడినదే అథర్వవేదం. దానికే బ్రహ్మవేదం అని పేరు. ఈవిధంగా నాలుగు వేదాలకూ యజ్ఞంలో ప్రాముఖ్యం ఉంది.
ప్రతి వేదమంత్రానికి నాలుగు అంగాలు ఉంటాయి. ఋషి, దేవత, ఛందస్సు, స్వరం అనేవే ఈ అంగాలు. మననం చేయదగింది మంత్రం. ఋషి మంత్రద్రష్ట అవుతాడే కానీ మంత్రకర్త కాదు. ఋషయో మంత్రద్రష్టారః – వేదమంత్రార్ధాన్ని దర్శించినవారే ఋషులు. కనుక వేదమంత్రాలకు ఋషుల పేర్లు ఉన్నాయి. ఆ ఋషులు ఆయా మంత్రాల అర్థాన్ని శిష్యులకు ఉపదేశించినవారు. లోకంలో ప్రచారం చేసినవారు కూడా.
మంత్రార్థమే దేవత. సర్వజ్ఞదేవత పరమేశ్వరుడు. ముప్పది మూడు దేవతలలో అగ్ని ముఖ్యదేవత. అంతరిక్షంలో వాయువు లేదా విద్యుత్తు ముఖ్యదేవత. ఆకాశదేవతలలో సూర్యుడు ముఖ్యుడు. ప్రతి మంత్రానికి ఋషి, దేవతలతో పాటుగా ఛందస్సు కూడా ఉంటుంది. ఛందోపరిజ్ఞానం వల్ల మంత్రపఠనం తేలికవుతుంది. వేదమంత్రాలలో అచ్చులకు ఉచ్చారణకు బట్టి ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే మూడు విధాలైన స్వరాలున్నాయి. వీటిని ఋత్విక్కులు గుర్తిస్తారు. వేదాలను చదువుట, చదివించుట, వినుట, వినిపించుట మానవులకు పరమధర్మం.
వేద విశేషం
నాలుగు వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో సృష్టి ఆవిర్భావం, జీవుల సముత్పత్తి, బంధమోక్షాలు, ప్రకృతి రహస్యాలు, ఆశ్రమ వ్యవస్థ, ఆయుర్వేదం, ఆకాశయానం మొదలైన వైజ్ఞానికాంశాలు ఉన్నాయి. ఇది జ్ఞానకాండగా చెప్పబడింది.
యజుర్వేదంలో మానవ ధర్మాలు, రాజ్యాంగవిధానం, గణిత విద్య, శారీరక విద్య కనిపిస్తాయి. వీటితోపాటు వివిధ యజ్నకర్మలకు సంబంధిచిన అంశాలు ఇందిలో ఉన్నాయి. దీనికి కర్మకాండ అని పేరు.
సామవేదం పరమేశ్వరుని స్తుతి. ప్రార్ధనా విశేషాల సంకలనం. దీనిలో ప్రత్యేకంగా గానవిద్య ప్రస్తావించబడింది. దీనికి ఉపాసనాకాండ అని పేరు.
అధర్వవేదంలో బ్రహ్మవిద్య పేర్కొనబడింది. భగవద్భక్తి, రాజ్యపరిపాలనా విధానం, పంచమహాయజ్ఞాల స్వరూపం వివరింపబడింది. ఇదే మోక్షకాండ.

అణువణువూ వేదనాదమే!
మానవాళికి పరమాత్ముడు ప్రసాదించిన తొట్టితోలి గ్రంథం వేదం. భారదేశంలో ఉదయించిన ఆ వెలుగు లోకమంతా ప్రవాశాన్ని చిమ్ముతోంది. ఇంతకీ వేదాలు ఎవరు రాశారు? వేదం ఏం చెబుతోంది? వేదకాలం ఏది?….వీటి గురించి మనకు తెలిసింది కొంతే. తెలియనిది కొండంత. వేదం జీవనాదాన్ని వినిపిస్తోంది. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకం…
దృశ్యేన శరదాంశతం
సున్యామ శరదాంశతం
ప్రబ్రవామ శరదాంశతం
అదీనాశ్యామ శరదః శతం
భూయామ శరదః శతం
మనిషి నూరేళ్ళు బట్టలుకాలంటే ‘చక్కాగా చూస్తూ, చక్కగా వింటూ, మంచి మాట్లాడుతూ, ఎవరికీ అధీనుడు కాకుండా బతకాలి’ అని అర్థం. నిజంగా ప్రతి మనిషి ఇలా బతకగలిగితే మరో వందేళ్ళు బతుకుతావని కూడా అర్థం. ఎంత బాగా చెప్పబడింది కదా! వేద సూక్తులు జీవన విధానాన్ని బోధిస్తున్నాయి. దంత ధావనం దగ్గర నుంచి వస్త్రం, కుటుంబం, బంధుత్వం, గ్రామం రాజ్యం…ఇలా అన్నింటినీ ఇది స్మ్రుశించింది. వేదం అనేది రామాయణం, భాగవతాల వంటిది కాదు. ఎవరో ఒకరే కవి రాసినది కాదు. అది నిరంతర ప్రవాహ ధార. అది శాంతి, సౌభాగ్యాలను బోధిస్తుంది. వేదానికి అపౌరుషేయం అని పేరు. అంటే మానవమాత్రుడు చెప్పింది కాదు. యుగయుగాలుగా మహారుషులు తమ దివ్యదృష్టితో దర్శించిన కావ్యాలు వేదాలు.
వేదాలు నాలుగు…
1. ఋగ్వేదం: దేవతల గుణగణాలు ఇందిలో ప్రత్యేకం. అగ్నిదేవుడి ప్రార్ధనతో ఈ వేదం ప్రారంభమవుతుంది. ఇందులో 1017 సూక్లా, 10,580 మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 43,200 అక్షరాలు ఉన్నాయి. ఋగ్వేదంలొ ఉండే మంత్రాలను రుక్కులు అని కూడా అంటారు. ఇవి ఛందోబద్ధాలు.
2. యజుర్వేదం: ఇది యజ్ఞయాగాదులు గురించి వివరిస్తుంది. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. అవి 1. శుక్ల యజుర్వేదం (యాజ్ఞ వల్క్య మహర్షి). ఇందులో 1975 పద్యగద్యాలున్నాయి. 2. యజుర్వేదం (త్తెత్తరీయ మహర్షి). ఇందులో 2198 మంత్రాలు, 19,200 పదాలు ఉన్నాయి.
3. సామవేదం: ఇది అతి చిన్నది. సమం అంటె గ్రామం. ఇందుల్రో మంత్రాలు 1875 ఉన్నాయి. వీతిలో 1504 ఋగ్వేద మంత్రాలే. 99 మాత్రమే కొత్తవి. 272 పునరుక్తాలు. భారతీయ సంగీత శాస్త్రానికి సామవేదమే మూలం. ఇది శాంతి వేదం.
4. అధర్వణ వేదం: లౌకిక విష్యాలను ఇది వర్ణిస్తుంది. 5977 మంత్రాలు ఉన్నాయి. అనేక చికిత్సావిధానాలు ఉన్నాయి. మూలికా చికిత్స కొడా ఇందులో వర్ణించి ఉంది. రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థల గురించి వివరంగా వర్ణనలు ఉన్నాయి. దీనినే బ్రహ్మ వేదమని కూడా అంటారు. రాజ్యం, రాజకీయాల గురించి వివరించినందుకు క్షత్ర వెదమని, చికితల గురించి వివరిస్తుంది కాబట్టి భిషగ్వేదమని కూడా పిలుస్తారు. వేదాలను అర్థం చేసుకోవడం సామాన్యులకు ఒకింత కష్టమే. అందుకే వీటిని చదివి అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పద్ధతిని ఏర్పరిచారు. దీని ప్రకారమే ఆరు వేదాంగాలు, నాలుగు ఉపవేదాలు ఉన్నాయి.
వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, కల్పం.
ఉపవేదాలు 4: గాంధర్వ వేదం, ఆయుర్వెదం, ధనుర్వేదం, అర్థవేదం.
అథర్వణ వేదమే ఈ నాలుగు ఉప వేదాలకు మూలమని భావిస్తారు.

వేదాలు నాలుగు కదా! ఆయుర్వేదం ఏమిటి?
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు.
కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగర మధనం. ఆ సాగరమధనం నుండి శ్రీమహాలక్ష్మీ, కౌస్తుభామణి, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, దివ్యరత్నరాశులు. ఉచ్చైశ్శ్రవము, అమృతము పుట్టాయి. అన్నికంటే ముందుగా పుట్టింది హాలాహలం. అమృతంతో తరువాత ‘ధన్వంతరి’ జన్మించాడు. ఈయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి జన్మిస్తూనే ఒక చేతిలో అమృతభాండాన్ని మరొక చేత ఆయుర్వేదాన్ని, పట్టుకొని ప్రత్యక్షమై వచ్చారు. ఈ ఆయుర్వేదమే సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవనవేదం. ఈ ఆయుర్వేదాన్ని అధర్వణవేదానికి ఉపవేదంగా చెబుతారు.
శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధర్వంతిరియే రోగ మరణభయంలేని అమృతాన్ని దేవతలకు యిచ్చి అజరామరులుగా చేసాడు. పంచమవేదంగా ఆయుర్వేద భండారాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీధన్వంతరి.
ఈ ఆయుర్వేదం బ్రహ్మదేవుని నుండి దక్షప్రజాపతికి లభించింది. దక్ష ప్రజాపతినుండి సురలోక వైద్యులైన అశ్వినీ కుమారులకు సంక్రమించింది.
ఈ ఆయుర్వేదం భూలోకానికి ఎలా వచ్చిందంటే:
ఒకసారి వసిష్ఠ, భరద్వాజ, అంగీరస, అత్రి, దుర్వాస, భృగు, విశ్వామిత్రాది మహర్షులందరూ హిమవత్పర్వతంమీద సమావేశమైనపుడు, మానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది. దేవలోకంనుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకొన్నారు. భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్ళి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ‘ఆత్రేయుడు’ అనే మహర్షికి బోధించాడు. ఈ మహర్షి తదనంతరం అగ్నివేశ మహర్షికి ఉపదేశం చేసాడు. ఆత్రేయునివద్ద నేర్చుకొన్న ఆయుర్వేద రహస్యాలను మహా శాస్త్రంగా రచించాడు అగ్నివేశుడు. దీనినే “అగ్నివేశతంత్రం” అంటారు. ఈ అగ్నివేశతంత్రం క్రీపు.2000-1000 “చరకసంహిత” గా రూపుదిద్దుకొంది. ఈ చరకుదినే మన ఆయుర్వేదానికి ఆదిగురువుగా ఇపుడు పూజిస్తున్నాం.
శ్లో|| నమామి ధన్వంతిరి మాదిదేవం, సురాసురైర్వందిత పాదపద్మం
లోకేజరారుగ్భయ మృత్యునాశం, ధాతారమీశం వివిధౌషదీనాం

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!