Responsive Advertisement

చరిత్రలో ఈ రోజు 25 జనవరి


<><><><><><><><><><>
🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *25 జనవరి, 2020*
👉 *శనివారం*
👉 *సంవత్సరములో 25వ రోజు 4వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 341 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *జాతీయ పర్యాటక దినోత్సవం*
[ఈ రోజు యొక్క ఉద్దేశం పర్యాటక పాత్ర మీద అవగాహన పెంచడం మరియు అది దేశ వ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలను ఎలా ప్రభావితం చేసిందో చూపటం. ప్రపంచ పర్యాటక దినోత్సవంను సెప్టెంబరు 27 న జరుపుకుంటారు.]
🚩 *ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం*
🚩 *అంతర్జాతీయ ఉత్పాదకత దినోత్సవం*
🚩 *జాతీయ ఓటర్ల దినోత్సవం*
[తరతరాలుగా తాను ఓడిపోతూ ఎప్పటికైనా గెలుస్తానన్న భ్రమలో బతుకుతున్న ఆశాజీవి ఓటరు]
[భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.]
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది

✴️1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.

✴️1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు

✴️1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.

✴️1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.

✴️1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.

✴️1980: విశ్వమాత మదర్ థెరీసా ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
['మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ  పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో,
✴️1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.]

✴️1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.

✴️2004: అమెరికా ప్రయోగించిన ఆపర్చ్యూనిటీ వ్యోమ నౌక అంగారక గ్రహం మీద క్షేమంగా దిగింది.

✴️2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🌐 *జననాలు*

❇️1736: సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు *జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్* జననం.
[జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ (జనవరి 25, 1736 - ఏప్రిల్ 10,1813) ఒక సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు. రెండు ఖగోళ వస్తువుల వ్యవస్థలో సాపేక్షికంగా స్థిరంగా ఉండే బిందువులైన L4, L5 లను కనుగొన్నాడు. ఆ బిందువులకు ఇతని పేరు మీదనే లాగ్రాంజియన్ బిందువులు అనే పేరు వచ్చింది.]

❇️1874: *సోమర్ సెట్ మామ్,* బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.

❇️1882: ఇంగ్లీష్ రచయిత, ప్రచురణకర్త, కథానికల రచయిత *వర్జీనియా వూల్ఫ్*  జననం

❇️1918: *కొండవీటి వెంకటకవి,*  ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (మ.1991)

❇️1925: *కాకర్ల సుబ్బారావు,*  రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.

❇️1925: *పి. అచ్యుతరాం,*  ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)

❇️1952: *సంపత్ కుమార్,*  ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (మ.1999)

❇️1968: *నర్సింగ్ యాదవ్,*  ప్రముఖ తెలుగు సినీ నటుడు.

❇️1980:  *క్జేవీ,*  బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.

❇️1981:  *అలీసియా కీస్,*  న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు నటీమణి.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

⚫️ *మరణాలు*

◾️1953: *పింగళి వెంకట రామారెడ్డి,*  నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)

◾️1954: ప్రముఖ హేతువాది, మానవవాది  *ఎం.ఎన్.రాయ్*  మరణం. (జ. మార్చి 21, 1887 )
[రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. . బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. రాయ్ బహుభాషా ప్రావీణ్యం కలవారు. 17 భాషలు వారికి తెలుసు. ఆంగ్లము, జర్మన్,ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ మొదలగు భాషలలో వ్రాయడం, మాట్లాడడం, చదవడం వారికి వచ్చు.]

◾️1991: *పెనుపాత్రుని ఆదినారాయణరావు,*  ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)
[ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.]

◾️1994: *సంధ్యావందనం శ్రీనివాసరావు,*  దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)

◾️2016: *కల్పనా రంజని,*  ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965).🙏🏻

*చరిత్రలో నేటి తెలుగు వ్యక్తి*

*డా|| కాకర్ల సుబ్బారావు*
(జ.జనవరి 25 1925) ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. ( FRCR, FACR, FICP, FSASMA, FCCP, FICR, FCGP) రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదులో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్*

*బాల్యం*

*కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో కాకర్ల సుబ్బారావు వ్యవసాయ కుటుంబంలో జనవరి 25 1925 సంవత్సరంలో జన్మించాడు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య జరిపాడు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టాని 1950 సంవత్సరంలో సంపాదించాడు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు.*

*అమెరికాలో సుబ్బారావు జీవితం*

*అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్ మరియు బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశాడు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందాడు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా ప్రయాణం కట్టాడు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు ('Fellow of Royal College of Radiologists (UK) అనే పట్టా సంపాదించుకొన్నాడు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశాడు.*

*సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు.*

*భారతదేశానికి తిరిగి రాక*

*1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరాడు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థ.*

*సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందాడు.*

*అవార్డులు*

*సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు "I pass through this life only once, let me do the maximum good to the largest number of people."*

Post a Comment

0 Comments