చరిత్రలో ఈ రోజు 27 జనవరి

చరిత్రలో ఈ రోజు 27 జనవరి

SHYAMPRASAD +91 8099099083
0

<><><><><><><><><><>
🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *27 జనవరి, 2020*
👉 *సోమవారం*
👉 *సంవత్సరములో 27వ రోజు 4వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 339 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 ......
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1926: మొట్టమొదటి సారి  *టెలివిజన్*  ను లండన్ లో ప్రదర్శించారు.
['"టెలివిజన్"' (దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య మరియు ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు మరియు రంగుల్లో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్ మరియు గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం, మరియు లాటిన్ పదం visio అనగా దృష్టి అని అర్థము.  సముద్ర గర్భంలోని దృశ్యాల్ని, వ్యోమ నౌకలో పయనించే అంతరిక్ష యాత్రీకుల్ని ఆకాశ వీధిలో ఉండే గ్రహాల్ని, నక్షత్రాల్నీ చూడడంలో టెలివిజన్ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.]

✴️1988: భారత్ లో  *హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణా* ను ప్రారంభించారు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1910: *విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి,*  రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.

❇️1928: *పోతుకూచి సాంబశివరావు,*  ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది. ఈయనది తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు. (మ. 2017, ఆగష్టు 6)

❇️1936: *కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవి,*  సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.

❇️1952:  *ఆస్మా జహంగీర్,*  పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)

❇️1974:  *చమిందా వాస్,*  శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.  ఫాస్ట్ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాడు.

❇️1979: *డానియెల్ వెట్టోరీ,*  ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.  న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1986: *అనగాని భగవంతరావు,*  ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)

◾️2008: *సుహార్తో,*  ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)

◾️2009: *ఆర్.వెంకట్రామన్,*  భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)

◾️2010: *దాసరి సుబ్రహ్మణ్యం,*  చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామలో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగాడు. (జ. 1922 అక్టోబర్ 25)🙏🏻


*చరిత్రలో నేటి మహిళ*

*కోడూరి కౌసల్యాదేవి*
(ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.

*జననం*

*ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 19యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారిన తర్వాత తనపేరును ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.*

*పురస్కారాలు*

1961 - *ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి*

1967 - *గృహలక్ష్మి స్వర్ణకంకణము*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!