నాన్నా ..
నువ్వు జాగ్రత్త ...
ఎప్పుడూ ఎండలో ఉంటావు
ఎక్కువగా నీళ్లు తాగు .
ఎప్పుడో వస్తావు తినటానికి
మరి..
నీ ఆకలి ఎలా తీరుతుంది ?
ఏదన్నా తిను ..
నీవు వాళ్ళ మంచికోసం కొట్టినా
నిన్ను కఠినంగా చూపిస్తారు.
ఎన్ని సార్లు బతిమిలాడావో
ఎన్ని సార్లు దండాలు పెట్టావో
వినని వాళ్ళకి నీవు చేసేది మంచికే
అది వాళ్ళకి తెలుస్తుంది
ఎవరు నాన్న ఆ రోగం వచ్చిన
వాళ్ళని పలకరించేది ?
పట్టించుకునేది ?
వాళ్ళ ఇంట్లోవాళ్లే పలకరించరు
దగ్గరకెళ్ళారు వాళ్ళకొస్తుందని ..
ఎవరు నాన్న
ఎంత డబ్బులిచ్చినా
నీలా సమాజం కోసం
కాలాన్ని వెచ్చిస్తారు ?
కుటుంబానికి దూరంగా ఉంటారు ?
నీవు ఆలా కాదు నాన్న
వాళ్ళు బాగుండాలని ఎంతో
ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నావు
మాకన్నా ఎక్కువగా వారి
మేలు కోరుకుంటున్నావని వారికి తెలీదా ?
లేకపోతె సెలవు పెట్టుకొని
మమ్మల్ని ప్రేమగా చూసుకోవా ??
నాన్నా
నీ కోసం మేము ఎదురు చూస్తుంటాము
రోజులో ఎప్పుడో ఒక సారి వచ్చి కనపడు
ఎన్ని రోజులైందో
మమ్మల్ని ఎత్తుకొని
దగ్గరకి తీసుకొని
బుగ్గలమీద ముద్దు పెట్టుకొని
ఎదో బెంగగా ఉండి నాన్నా .
నీ ఆరోగ్యం జాగ్రత్త
మా మాకోసమైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో...
మళ్ళీ వచ్చినపుడు
మమ్మల్ని దగ్గరకి తీసుకో
ప్రేమగా ముద్దు పెట్టు <3
ఎంత బాగుంటుందో నాన్నా
నీతో గడిపే సమయము
నిన్ను చూసి మేము గర్వపడుతున్నాము ..
**** తమని తాము తమ కుటుంబాలని మరచి
మనకోసం శ్రమిస్తున్న
Police, Doctors, Servicing organizations వారందరికీ నమస్సులు _/\_ ***
Hi Please, Do not Spam in Comments