వాక్సిన్ గురించి క్లుప్తంగా:

వాక్సిన్ గురించి క్లుప్తంగా:

SHYAMPRASAD +91 8099099083
0
వాక్సిన్ గురించి క్లుప్తంగా:

మనకు సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. ఎపుడైనా బయటినుంచి శరీరంలోకి ఏదైనా క్రిమి ప్రవేశిస్తే ఒక రకమైన కణజాలం యాక్టివేట్ అయి ఆ క్రిములతో పోరాడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి ముందు.

బయటినుంచి ప్రవేశించే క్రిములు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారసైట్స్...ఏవైనా కావచ్చు. అవి అసాంఘిక శక్తులన్నమాట. వాటినెదుర్కొనే తెల్లరక్తకణాల్ని పోలీసులుగా భావించొచ్చు. ఆ యుద్ధంలో తెల్లరక్తకణాలకు ‘యాంటీబాడీస్’ అనే పేరును ఆపాదిస్తారు. శరీరంలో యాంటీబాడీస్ పుట్టేలా చేసిన ఆ క్రిములకి యాంటిజెన్స్ అని పేరు పెట్టారు. (Gen: To generate)

ఒకసారి మన శరీరంలో పుట్టిన యాంటీబాడీస్ ఆ క్రిములతో పోరాడి, కొన్ని మరణించి, ఆఖరికి విజయం సాధిస్తాయి. ఎవరిలోనైనా అది జరగడంలేదూ అంటే వారిలో రోగనిరోధకశక్తి తగ్గిందనో, లోపించిందనో చెప్తారు. ఈ యాంటిబాడీస్ ముఖ్యంగా ప్రత్యేకత కలిగి ఉంటాయి. మరొకసారి ఆ క్రిమి మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇవి దానిని గుర్తుపట్టి లక్షల్లో పుట్టుకొచ్చి పోరాడతాయి. ఇదీ ప్రధానంగా వ్యాక్సిన్ తయారీకి వాడే మూలసూత్రం.

ఉదాహరణకు పోలియో వైరస్ చాలామంది చిన్నారుల శరీరాల్లో ఎన్నో అవకరాలు కలిగించింది. శాస్త్రవేత్తలు ఏంచేస్తారంటే కొన్ని పోలియో వైరస్‌లను తీసుకుని వాటి పొటెన్సీని తగ్గిపోయేలా చేస్తారు. అంటే అవి శరీరంలో ప్రవేశించినా రోగాన్ని కలుగజేసే శక్తిని కలిగి ఉండవన్నమాట. ఈ సందర్భంలో మంచి పోలికొకటి చెప్పనా? విషంలేని పాముతో కాటు వేయించుకున్నట్టన్నమాట! 

ఇప్పుడు ఆ శక్తి కోల్పోయిన వైరస్‌లు రోగాన్ని కలుగజెయ్యలేవుగానీ... యాంటీబాడీస్ మాత్రం పుట్టించగలవు. ఎంత అద్భుతమైన విజయం!

ఆ రకంగా ఒక చిన్నారికి పుట్టిన వెంటనే నోట్లో పోలియో చుక్కలు రెండు పడేస్తే పోలియో రోగం రాదు సరికదా ఒకవేళ ప్రమాదకరమైన మోతాదులో పోలియో వైరస్ శరీరంలోకి రావాలని ప్రయత్నిస్తే ఈ వ్యాక్సిన్ వల్ల ఇంతకుముందే పుట్టిన యాంటీబాడీస్ టీమ్(స్పెషల్ రిజర్వ్ పోలీస్) ఒక్కసారిగా యాక్టివేట్ అయి, లక్షల్లో బయటికొచ్చి ఆ క్రిమిని దుంపతెంపి పడేస్తాయి.

అదే వ్యాక్సిన్ చేసే పని!

ఈ కథలో నీతేంటంటే:

బయటినుండి వచ్చిన వ్యాక్సిన్ మన రోగాన్ని తగ్గించదు. మన శరీరంలో ఆ భగవత్ప్రసాదమైన రోగనిరోధక శక్తిని పునరుజ్జీవనం చేస్తుంది. తద్వారా మనకు ఆ రోగం రాకుండా కాపాడుతుంది.

సిగరెట్టు, మద్యం, మాదకద్రవ్యాలు మనిషి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి. వ్యభిచారం వల్ల హెచ్.ఐ.వి. వచ్చే అవకాశం ఉంది. దానిపేరే.. Human Immunodeficiency Virus. అంటే రోగనిరోధక వ్యవస్థ మీదనే దాని మెయిన్ ఎటాక్!

చివరగా: 

శరీరాన్ని కాపాడుకోండి. రోగనిరోధక శక్తి పెరిగేలా మంచి అలవాట్లు, క్రమబద్ధమైన జీవనవిధానం, లక్షణమైన ఆహారనియమాలు మనకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!