పోలీస్- మిత్రులు

పోలీస్- మిత్రులు

SHYAMPRASAD +91 8099099083
0
మన పోలీసు మిత్రుల పై ఈరోజు  సంచికలో ప్రేమ తో ఒక్క చిన్న కధనం రాసిన సీనియర్ జర్నలిస్ట్*


*పోలీసులు అంటే అసలు మనలో చాలా మంది ఇష్టపడరు ఎందుకని ...?*

*విశ్వసించరు దేనికని ..?*

*వాళ్ళు లేనిదే మనం రోడ్డు పైకి రాగలమా ...?*

*పోనీ కనీసం మన ఇంట్లో ప్రశాంతం గా నిదురించగలమా ...?*

*మన ఇంట్లో ఆడాళ్ళను బజారుకు సరుకులకు పంపించగలమా ...?*

*మన పిల్లలను పాఠశాలలకు పంపించగలమా ....?*

*మరి పోలీస్ అంటే ఎందుకీ వివక్ష ....? ఎందుకంత భయం ....? మన ప్రియమిత్రుడు పోలీస్ ....!!*

*పాఠశాలనుంచీ సమయానికి రావాల్సిన పిల్లలు ఇంటికి రాకపోతే ' పోలీస్ ' ...!*

*వయసుకొచ్చిన అమ్మాయి తన సహచర స్నేహితురాలి ఇంటికి వెళ్లి రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఇంటికి రావడం కాసేపు ఆలస్యమయితే ' పోలీస్ '...!*

*ఇంటి బయట మన బైక్ గానీ / పెంపుడు కుక్క గానీ కనబడక పోతే ' పోలీస్ ' ....!*

*అత్యధిక వడ్డీలకు ఆశపడి మోసపూరిత చిట్ ఫండ్ కంపెనీ ల లో డబ్బు జమా చేసిన తరువాత వాళ్ళు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తే ' పోలీస్* 

*మనకి రోడ్డు పైన ప్రమాదం జరిగితే ' పోలీస్ ' ....!*

*మనకి అసౌకర్యం గా ఉంటే ' పోలీస్ ' ....!*

*మనకి అన్యాయం జరిగితే ' పోలీస్ '...!*

*మనకు భయమేస్తే ' పోలీస్*

*కానీ మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఏనాడైనా మనం స్థానిక ' పోలీస్ ' గారికి ఆహ్వాన పత్రిక ఇస్తున్నామా ...?*

*మనం ఇంట్లో దసరా పండుగ కు నాటు కోడి కోసుకుని / ఆ కూరను చిల్లి గారెలతో నంచు కుంటున్నప్పుడు గానీ / కొత్త సినిమా టిక్కెట్లలో ఒకటి మిగిలిపోతప్పుడు గానీ అదే పోలీస్ ని మన దగ్గరకు పిలిచి వారితో స్నేహపూర్వకం గా సమయాన్ని పంచుకుంటున్నామా ...?*

*మరి ఆ పోలిసాయనకు మన ఇంటికి పిలిచి ఇస్తరాకేసి భోజనం పెడుతున్నామా ....? మన పక్కనే ఆయనను కూర్చోబెట్టుకుని సరదా గా ఆయనతో చలనచిత్రాన్ని వీక్షిస్తూ స్నేహభావాన్ని పంచుకుంటున్నామా ...?*

*మరి పోలీస్ అంటే ఎందుకీ వివక్ష ....?*
*ఎందుకంత భయం ....?*

*మన ప్రియమిత్రుడు పోలీస్ ...!*
*__________________*

*వ్యవస్థలో ఎక్కడో ఎవరో ఏదో చిన్నపాటి పొరపాటు చేశారని యావ త్ పోలీస్ వ్యవస్థనే తప్పుగా అర్ధం చేసుకుని మనం కోల్పోతున్నది ఇంతా - అంతా కాదు మిత్రమా ...!*

*మీరూ - నేను మంచివారంటే టక్కున నమ్మేది ఎంత మంది ...? అదే ‘ చెడ్డవారిమి ‘ అంటే వెంటనే …. అవునా ...?అయ్యుండొచ్చులే అని తలూపే సమాజం లో బ్రతుకుతున్నాం మనం . ఒక అధికారి మంచివాడూ అంటే నమ్మడానికి చాలా సమయం తీసుకుంటూ ఆలోచిస్తున్న మనం / అదే అధికారి చెడ్డవాడూ అంటే వెంటనే అయిఉండొచ్చు అని పరోక్ష అంగీకారాన్ని మద్దతుగా ప్రకటించేస్తున్నాం . ఇది మన తప్పిదం అని ఎంత మంది నిజాయితీగా ఒప్పుకోగలరు*

*ఏ దేశానికైనా... పోలీసే దేవుడు*

*సరిహద్దు లు మొద లు కొని ఇంటి గడపవరకు …!*

*సామాన్యుడి కనురెప్ప... ‘ పోలీస్‌ ‘ ….!*

*అసలు పోలీస్ అంటే ఏంటోఎంతమందికి తెలుసు ...?*

*వారు పడే భాధ ఏంటో / మానసిక క్షోభఎలా ఉంటుందో ఎందరికి తెలుసు ...?*

*’ పోలీస్ ‘’ …!*

*అంటే కొత్తగా* *పరిచయంఅక్కర్లేని* *ప్రియమిత్రుడి హోదా అది*
*సమాజంలోని ప్రతి ఇంటి* *చుట్టూపాతుకుపోయి ఉండే*
*కనబడని కంచె ... ‘పోలీసే‘ ..! అలాంటి పోలీస్‌* *గురించిఇప్పుడు కొంచెం భిన్నం గా చెప్పా లనేది మాకోరిక*

*కానీ ఎలా చెప్పగలమన్న సందిగ్ధం.నిత్యమూ కళ్ల ముందు కనిపించే ఖాకీ డ్రెస్‌గురించి కొత్తగా* *వివరించడానికి ఏంఉంటుంది …?*
*కానీ ఉంది చెప్పేస్తున్నాం ….!*

*కొన్ని బాధాకరమైన జ్ఞాపకాల్ని, గర్వపడేగుర్తుల్ని ఇప్పుడు చెప్పుకుందాం . తరువాత రొమ్ము విరుచుకున్న పొగరైన ఘట్టాల్నికూడా చెప్పేసుకుందాం* *అవసరంకాకపోయినా ఇక్కడో సినిమా సన్నివేశాన్నిఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి*
*తమకు ఎదురవుతున్న* *అవమానభారాన్నితట్టుకోలేని*
*స్థితిలో*

*మేం మూకుమ్మడిగా సె లవుపెడుతున్నాం...’ అంటూ….*

*ఆ నగరం లోనిపోలీసు లంతా జనమ్మీద నిరసనప్రకటిస్తారు. నిజం గానే కొన్ని గంటల పాటువిధుల కు దూరం గా ఉండిపోతారు.*

*ఊరంతా ఆరాచకం* *ప్రబలిపోతుంది. ఆతర్వాత ఏదో జరుగుతుంది... మళ్లీ ఖాకీ లు ప్రజారక్షణ నిమిత్తం డ్యూటీ లకుహాజరవుతారు. సినిమా కదా …?*
*అందులోఇదో సన్నివేశం*

*కానీ నిజ జీవితం లో అలా జరిగితే..?*

*స్కూళ్లకు దసరా సెలవు లు ఇచ్చినట్లుపోలీస్‌ స్టేషన్ల మెయిన్‌ గేట్ల కు ఓ పది రోజు లు పాటు తాళా లు పడితే …? రోడ్డు మీదఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ కూడా తెల్ల డ్రెస్సు లోకనిపించ కుండా ఉంటే..?*

*యూనిఫారాలు పక్కన పెట్టేసి పోలీసు లందరూ* *తమకుటుంబాల తో ఇళ్లలోనే కూర్చుండిపోతే…?*

*వాళ్ల కు మాత్రం ఉండదా...?*
*ఇంటి ఇల్లాలి తో వేడి వేడిగా పకోడీలు* *వేయించుకుని ,వాటిని ఆరగిస్తూ కూతుర్ని ఒళ్లోకూర్చోబెట్టుకుని టీ వీ లో మంచి కార్టూన్‌మూవీ చూడాలన్న కోరిక ఉండదా…? భార్య తో వైజాగ్ రుషికొండ బీచ్‌ ఇసుకలో నో / హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ గట్టుపై నో నడుస్తూ కాల్చిన మొక్కజొన్నకండి లను తింటూ కబుర్లు చెప్పుకోవా లని…? కానీ మనల్ని విడిచి అలాచేస్తున్నారా …? పూర్తి గా ఇంటి* *కేఅంకితమైపోగలుగుతున్నారా…? పొద్దున్నఇంటి నుంచి బయటకు* *వచ్చేటపుడునిద్రలేవని తమ మూడేళ్ల బుడ్డోడు రాత్రిపొద్దుపోయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్లాకకూడా తనతో* *ఊసులాడకుండానిద్రపోతున్నాడన్న ఆవేదన బయటకుపోలీస్ లో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా...?*

*పోలీస్ అనేవాడు తన బాధనుకనిపించనివ్వడు . ఎందుకంటే ….*

*పోలీస్ కంట్లో చెమ్మ కనబడితే అదిసమాజానికి అరిష్టం కాబట్టి*

*ఆ బాధనంతాతన గుండెల్లోనే దాచుకుంటూ , లోకకళ్యాణం కోసం పరమ శివుడు తన కంఠం లోవిషం దాచుకుని ఎలా '' ఘరళకంఠుడు* *''అయ్యాడో ...అదే కోవలో తమ వ్యక్తిగతబాధనంతా తమ ఖాకీ యూనిఫామ్ వెనుకఉన్న తన ' గుండె నరాల్లో ' దాచుకునిసమాజానికి సరదా గా కన బడుతుంటాడు*

*ఇలాంటి ఎన్నెన్నో భావోద్వేగాలూ ,రాగధ్వేషాలను బలవంతం గా పక్కనపెట్టక తప్పని ఏకైక ఉద్యోగం... పోలీస్‌.*

*ఖాకీ యూనిఫారం అత్యంతగౌరవప్రదమైనది. ఇదే యూనిఫారాన్ని ఆర్టీసీకార్మికులే కాకుండా మరో ఇతర ప్రభుత్వసంస్థలలో పనిచేస్తున్న వారూ ధరించవచ్చు.కానీ పోలీస్‌ యూనిఫారం లెక్క వేరు*

*అది సమాజానికి ఇనుప కవచం. దేశసరిహద్దుల కు పెట్టని కోట గోడ*

*చివరిగా ఒక మాట మిత్రమా .... పోలీసులు లేనిదే మనం బ్రతకలేం* *క్రూరమృగాలు ఆధునికం గా తిరుగుతున్న ఈ హైఫై యుగం లో మనం పోలీస్ లను* *విస్మరిస్తే చాలా ఇబ్బంది పడిపోతాం . అందుకని వారిని ప్రేమిద్దాం . మనసులో మాటలను పంచుకుందాం . మన కుటుంబం లో ఒక* *సభ్యునికా కాకపోయినా మన ప్రియా మిత్రునిగా చేసుకుందాం . మనకోసం ప్రాణాలు అర్పించడానికి సహితం మన తల్లిదండ్రులు కానీయండి / పిల్లలు కానీయండి లేక జీవితం* *పంచుకున్న భాగస్వాములు కానివ్వండి ఒక్క నిమిషం ఆలోచిస్తారు . కానీ మనతో ఏ బంధమూ లేకపోయినా ప్రాణాలు మాత్రం* *అర్పించాలంటే ముందువరుస లోనికి వచ్చి నేనున్నానంటూ రొమ్ము విరిచేదే ' పోలీస్ ' . అటువంటి ' పోలీస్ ' ని* *ప్రేమిద్దాం మిత్రమా ... మహా* *అయితే పోయేదేముంది కాస్త సమయం తప్పా ......*
*మీ పోలీస్ అభిమాని*
*శ్యా మ్ ప్రసాద్*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!