ఏప్రిల్‌ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవం

ఏప్రిల్‌ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవం

SHYAMPRASAD +91 8099099083
0
📕📕📕📒📔📕📗📘
పుస్తకం మంచి నేస్తం.. పుస్తకం చద వడం వల్ల ఒత్తిడిని జయించవ చ్చు.. పుస్తకం ప్రపంచాన్ని పరి చయం చేస్తుంది. ఉన్న చోటు నుంచే ఇతర ప్రాంతాల పరి స్థితులు, ఆచారాలు, వ్యవహా రాలు, చరిత్ర, వర్తమానం తెలుసుకునే వీలును కల్పి స్తుంది. మనిషి విజ్ఞానం పెం పొందించుకునేందుకు ఎంత గానో దోహదం చేస్తుంది. పుస్తకా లు చదవడం వల్ల భాష అభివృద్ధి చెందుతుంది. ఆలోచన విధానం, సృజ నాత్మకత పెరుగుతుంది. అందుకే పుస్తక పఠ నాన్ని ఒక అలవాటుగా సమాజంలో స్థిర పరిచేందుకు యునెస్కో ఏటా ఏప్రిల్‌ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
 📘📗📕📒📕📗📕📒
విఖ్యాత రచయిత మిగు యెల్‌డీ సెర్వాంటీస్‌ ఏప్రిల్‌ 23న మృతి చెందారు. ఆయన గౌరవార్థం పుస్తక దినోత్సవం నిర్వహించాలని పుస్తక రచయితల హక్కుల కోసం పోరాడిన స్పెయిన్‌ రచయిత వీసెంటే క్లావెల్‌ ఆండ్రెస్‌ 1923లో ప్రతిపాదించారు. ఆ మేరకు యునెస్కో మొదటిసారి 1995 ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక కాపీరైట్‌ దినోత్సవం జరిపింది. ప్రముఖ రచయిత గార్సిల్లా సోడిల్లా వేగ్‌ వర్ధంతి సైతం ఏప్రిల్‌ 23న కావడంతో ప్రపంచ పుస్తక దినోత్స వాన్ని జరపడానికి యునెస్కో మొగ్గు చూపింది. పుస్తకం గత చరిత్రను, వర్తమానాన్ని నిక్షిప్తం చేసుకొని భవిష్యత్తులోకి తీసుకెళ్లే విజ్ఞాన ఘని. అందుకే మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమంటారు. మంచి పుస్తకాలు దగ్గరుంటే మంచి మిత్రుడు దగ్గర లేనిలోటు తీరుస్తుందని గాంధీజీ అన్నారు. పుస్తకం వల్ల కాలక్షేపంతోపాటు వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఞాన దాహం. మనిషికి మరణం ఉండవచ్చు. కానీ పుస్తకానికి దాని ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి మరణం లేదు.
📘📗📕📕📒📕📒📗
 
కానీ నేడు పుస్తక స్థానంలో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. సామాజిక మాధ్యమాలతో తక్షణమే ఆనందిం చవచ్చు కానీ అది తాత్కాలిక అనుభూతి మాత్రమే. పుస్తకాలు చదవితే వచ్చే అనుభూ తి శాశ్వతమైంది. పుస్తకాలు మంచి పేరును మంచి పౌర సమాజాన్ని నిర్మించేందుకు దోహదపడతాయి. మనిషికి ఆకాశమంత విశ్వాసం ఇచ్చేది పుస్తకమే. అందుకే పుస్తకానికి మరణంలేదు. అజేయమై వర్థిల్లేది పుస్తకం మాత్రమే.
రోజూ పుస్తకాలు చదువుతా..
సాంకేతిక విజ్ఞానంతో నేడు పఠన సంస్కృతి తగ్గి చూసే సంస్కృతి వచ్చేసింది. నేను ప్రతిరోజూ పుస్తక పఠనం చేస్తాను. తల్లిదండ్రులు వారి పిల్లలను చిన్న ప్పటి నుంచే పాఠశాల పుస్తకాలతోపాటు నీతి కథలు, ఇతర పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. చద వడం ద్వారానే ఎందరో మేధావులు ఉన్నత శిఖరాలను అందుకోగలిగారు. మనం చదు వుతూ అందరూ చదివేలా చేద్దాం.                                                   📒📔📕📗📗📘📕📒

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!