ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారట

🌻శుభోదయం🌻
         సుందరకాండలో సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే రావణుడు వచ్చి అన్న మాటలకు ఆమెకు చచ్చిపోవాలన్నంత బాధ కలిగించింది.
అందువలన రావణాసురుడు చేసుకున్న తపస్సు అంతా తనను రక్షించలేనంతగా  తన మృత్యువును తానే మూటగట్టుకున్నాడు.
           కొంతమంది మగవాళ్లు స్త్రీలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు. దానికి వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేక ఊరుకున్నా...
వాళ్లు మనసులో ఎంత బాధ పడుతున్నారో అన్నవారికి తప్పకుండా తగులుతుంది.
అందుకనే ఎవరితో పడితే వాళ్లతో...
ఏది పడితే అది మాట్లాడేయకూడదు.
అవకాశం ఉంది కదా ఏది మాట్లాడినా పర్వాలేదు అనుకుంటే...
తర్వాత పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది.
గాంధీగారు చెప్పారు ఏనాడైతే ఆడది అర్ధరాత్రి స్వతంత్రంగా రోడ్డుపైన తిరగగలుగుతుందో అప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని...
ఆయన చెప్పినట్లుగానే ఆయన పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో అందరూ ఆడవాళ్ళని సిస్టర్ అనే పిలుస్తారు.
అదేవిధంగా ప్రతీ ఒక్కరూ ఉంటే ఎలాంటి సమస్యలూ రావు.
ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారట.
అంటే దానికి అర్థం అక్కడ ఎలాంటి కష్టాలు ఉండవని.
స్త్రీని కంటతడి పెట్టకుండా చూసుకునే బాధ్యత అందరికీ ఉంది.
ఎందుకంటే...
ఏ విధమైన పొరపాటు జరిగినా కూడా సరిదిద్దుకో లేనివిధంగా తయారవుతుంది ఆమె జీవితం.
స్త్రీల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో...
సమాజం యొక్క భవిష్యత్తు అలానే ఉంటుంది.
సర్వేజనా సుఖినోభవంతుః...

Post a Comment

0 Comments