తెలుసుకుందాం -శ్రీ కాళహస్తీశ్వరా శతకం

తెలుసుకుందాం -శ్రీ కాళహస్తీశ్వరా శతకం

SHYAMPRASAD +91 8099099083
0
🕉🕉🕉🕉🕉🕉
*ఓమ్ నమః శివాయ*
*శ్రీ కాళహస్తీశ్వరా శతకం*
*శ్రీ మహా కవి ధూర్జటి విరచితం*
🕉🕉🕉🕉🕉🕉
  

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో
🔱🔱🔱🔱🔱
*పద్యం 1*

*శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁగోల్పోయితిన్ దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా సేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!||1||*

*భావం*
------------
సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!