భువిపై తొలి విశ్వవిద్యాలయం నలంద

భువిపై తొలి విశ్వవిద్యాలయం నలంద

ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం నలంద. అది భారతదేశంలో ఉండటం మనందరికి గర్వకారణం. హర్షవర్ధనుడు క్రీ.శ.647లో మరణించాడు. ఇతని ఆస్థానంలో దీర్ఘకాలంగా ఉన్న చైనా యాత్రికుడు హ్యూనాంగ్ తొలుత పశ్చిమోత్తరంగుండా భారతదేశంలో ప్రవేశించాడు. కాశ్మీర్, నియాల్కోట్, జలంధర్ మీదుగా కనోజ్ చేరుకు న్నాడు. హరుని సన్మానాలు అందుకుని, ప్రయాగ, కాశీ, బుద్ధగయలు సందర్శించి, అస్సాం, బెంగాలు, ఒరిస్సా మీదుగా ఆంధ్రాలో నాగార్జునకొండను, శ్రీపర్వతాన్ని చూసి, కంచి వెళ్లి, మైసూరు మీదుగా మహారాష్ట్రావెళ్లి, చాళుక్యరాజధాని వాతాపి చూసి నలంద చేరుకున్నాడు. అతను భారతదేశం వదలివెళ్లే సమయంలో బుద్ధుని అస్తికలతో పాటు పలు విలువైన తాళపత్ర గ్రంధాలు ఇరవైగుర్రాలపై చైనాకు తీసుకు వెళ్లాడు. 

వోల్టేర్, ఏయరిడిసోన్నెరేట్, ఫైలింగ్, జాన్సోల్వెల్వంటి ఐరోపాలోని చాలామంది ప్రముఖ మేధావులు భారతదేశాన్ని “నాగరికత యొక్క ఊయల" గా పిలుస్తారు. భారతదేశం ప్రపంచంలోని దాదాపు ప్రతిపురాతన, మధ్యయుగ నాగరికతతో మేధో సంబంధాలను పంచుకుంటుంది అనేది నిజం. రాజకీయ కారణాల వలన భారతదేశ చరిత్ర, నాగరికత ప్రపంచంలో చాలా తక్కువగా అంచనా వేయబడింది. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం జ్ఞానరంగంలో ఎంతో దోహదపడింది. పశ్చిమాన మధ్యధర సముద్రం దగ్గర ఉన్న దేశాల నుండి తూర్పున చైనా సముద్రం వరకు ఎందరో విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వచ్చారు.

కానీ ఏ భారతీయ విద్యార్థి కూడా చదువుల కోసం ఈ దేశం నుండి వేరే దేశం వెళ్లినట్లు చెప్పలేదు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు అంతర్జాతీయ అభ్యాస ప్రదేశంగా భారతదేశం వెలుగొందింది. ఎందుకంటే తక్షశిల, నలందా, విక్రమశిల వంటి గొప్ప అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మనకు ఉండేవి. ప్రారంభ, మధ్యయుగ కాలంలో ఈ విశ్వవిద్యాలయాలు కుప్పకూలిన తరువాత కూడా భారతదేశం ముస్లిం ప్రపంచానికి గణితం, సంగీతం, చదరంగం, ఆయుర్వేదం, రసాయనశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వంచతంత్ర, కొన్ని హిందూ గ్రంథాలు వంటి అనేక ప్రత్యేకమైన విషయాలను నేర్పించినది. అందుకని
అల్-ఔరుని, అమీరు, ప్రో వంటి వారు కూడా మన దేశాన్ని అంతర్జాతీయ అభ్యాస దేశంగా స్పష్టపరిచారు.

ప్రాచీన ప్రపంచంలో అలెగ్జాండ్రియాలోని ఏథెన్స్, మ్యూజియంలో లైసియం వంటి అనేక అభ్యానస్థానాలు ఉన్నాయి. బైజాంటైన్ (క్రీ.శ. 843లో స్థాపించబడింది.), అల్-కరాయిన్ (క్రీ.శ. 859), ఆల్జా ర్ (క్రీ.శ.975), బోలోగ్నాక్రీ.శ.1088),
పారిస్ (క్రీ.శ. 1160), ఆక్స్ ఫర్డ్ (క్రీ.శ. 1167), కేంబ్రిడి (క్రీ.శ.1209), పలాన్సియా (క్రీ.శ.1212),  సలామాంతా(క్రీ.శ 1918),  పాడుగా (క్రీ.శ. 1222), టౌల్ (క్రీ.శ. 1229) మెదలైనవి మధ్యయుగకాలానికి చెందిన ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు కాని వీటిలో ఏదీ అభివృద్ధి చెందిన, మౌలిక సదుపాయాలు, పాఠ్యాంశాలు కలిగినటు వంటి తక్షశిల, నలంద, విక్రశిలావంటి పైన చెప్పిన వాటిలో లేవు. ఆనాటికే భారతదేశంలో పలువిశ్వవిద్యాలయాలు ఉండేవి.

అలెగ్జాండర్ దండెత్తే నాటికే తక్షశీల - ప్రసిద్ధిచెందింది. ఉజ్జయిని మరొకటి. దక్షిణాన - నాగార్జున కొండ విశ్వవిద్యాలయం క్రీ.శ.200 ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అన్నింటిలోకి నలంద విశ్వవిద్యాలయం శిఖరాన్నతం అంటే అతిశయోక్తికాదు. హర్షుని కాలంలో విలసిల్లిన ఈ విశ్వవిద్యాలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది.

నలం అంటే సంస్కృతంలో పద్మం అని అర్థం. ఇది జ్ఞానానికి గుర్తు, ద అంటే ఇవ్వడం. వెరసి.. జ్ఞానాన్ని అందించేది నలందా అని అర్ధం. గుప్తరాజులలో చివరివాడైన చాలాదిత్యుడు నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. ఉత్తరాదిని పాలించిన రాజులు అందరూ నలందను ఆదరిస్తూనే వచ్చారు. హర్షవర్థనుడు ఇట్టి దాతలలో అగ్రగణ్యుడు. ఈ విశ్వవిద్యాలయంలో పదివేలమంది చదువుకునే అవకాశం ఉండేది. దేశదేశాల విద్యార్థులు, పండితులు ఇక్కడకు వచ్చేవారు. అందుకే నలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా కీర్తికెక్కింది. బౌద్ధతత్వశాస్త్రంతో పాటు, సాంఖ్యా, వైశేషిక, యోగ, తర్కమీమాంసాది దర్శనశాస్త్రాలన్నింటికి ఇక్కడ ఆచార్యవీరాలు ఉండేవి. వ్యాకరణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. ఆ కాలంలో విద్యార్ధులు చాలా దూరం వెళ్లవిద్య అభ్యసించేవారు. అప్పట్లో విద్యలను “అష్టాదశవిద్యలుగా పిలిచేవారు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలు అనే నాలుగువేదాలు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్ప, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము మొదలగువానితో కలసి పదునాలుగు విద్యలు. వీటికి ఆయుర్వేదము,ధనుర్వేదము, గాంభీర్యము, అర్థశాస్త్రములను జోడించి అష్టాదశవిద్యలు అనేవారు.

నలందా విశ్వవిద్యాలయ ద్వారపాలకులు సైతం మహాపండితులు. విద్యార్థులను మొదట పరీక్షించేది వీరే. రేయింబవళ్లు వాదప్రతివాదాలతో, చర్చలతో నలందా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనిస్తుండేది. ఇక్కడ
ఆచార్యులుగా నిరమత, ధర్మపాల, వసుభంధు, శీలభద్ర వంటివారు ఉండేవారు. నాగార్జుని రచనలు ఎన్నో ఇక్కడ రక్షింపబడి పిమ్మట టిబెట్టు చేరుకున్నాయి. నలందాలో ఎనిమిది కళాశాలలు ఉండేవి.

నుమిత్రా

పాలకుడు, బలదేవుడు నిర్మించిన కళాశాలలో రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అనే మూడు గ్రంధాలయాలు ఉండేవి. చైనా, కొరియా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కి, సుమిత్రా, జావా, సింహళ, మధ్య ఆసియా నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడకు తరలివచ్చేవారు. లక్షాయాభైవేల చదరపు మీటర్లకు పైగా వ్యాపించి ఉన్న నలందాలో ఎనిమిది ప్రత్యేక ప్రాంగణాలు, పది ప్రార్ధనా మందిరాలు, ఉద్యానవనాలు, చెరువులు మరెన్నో అపురూప కట్టడాలు ఉండేవి. విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యం కలిగించిన తొలి విశ్వవిద్యాలయం నలంద. అలా ప్రపంచానికి తొలుత విద్యాదానం చేసింది మన భారతదేశమే!

వలు ముష్కరదాడుల్లో నలంద శిధిలమైయింది. 1197లో టర్కిరాజు ఖిల్జీ ఈ ప్రాంతంపై దాడిచేసి ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసాడు. ఇక్కడ మన విద్యా విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం! గెర్రి పెటో అనే చరిత్రకారుడు మనదేశం గురించి ఇలా అంటాడు. తూర్పు ఇరాన్లోని ఉన్నత వీరభూమి, టిబెట్ మరుభూములు మంగోలియా, మంచూరియాలు, ప్రాచీన చైనాజపాన్లు ప్రాథమిక నాగరిక దశలో జీవిస్తున్న ఇండో చైనాదీవులు, మలయాద్వీపం, ఇండోనేషియా-వీటన్నింటిలోనూ భారతదేశం తన శాశ్వతమైన ముద్రనువేసింది. ఆ దేశం మతం మాత్రమే గాక, కళా, భాషా, సంస్కారాలన్ని భారతీయ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.

గుప్తరాజులకాలంలో శాస్త్రీయ విజ్ఞానం గణనీయంగా వృద్ధిచెందడం ఆ కాలం ప్రత్యేకత. అన్ని శాస్త్రాలకు మూలం గణితం. వ్యాపార అభివృద్ధి అత్యవసరం బీజగణితం. రేఖాగణితం మరీముఖ్యం.

ఇవన్ని గుప్తరాజు కుమారగుప్తుని కాలంలో క్రీ.శ.427 మొదలై 450 నాటికి పూర్తిస్థాయి నిర్మితమై వృద్ధిచెందింది. పదివేలకు పైగా విద్యార్ధులు, రెండువేలమంది అధ్యాపకులతో కళకళలాడుతూ ఉండేది. గణితశాస్త్రంలో సున్నా భారతీయులు ఏనాడో కనుగొన్నారు.

భారతదేశం నుండి అరబ్ దేశాల మీదుగా ఆ విజ్ఞానం యూరప్ వెళ్లింది.

క్రీ.శ. 476లో పాటలీపుత్రం(నేటి పాట్నా)లో ఆర్యభట్టు జీవించాడు. ఇతను ప్రసిద్ధ ఖగోళశాస్త్రజ్ఞుడు. భూమి తన చుట్టు తను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని కనిపెట్టినవాడు .. గ్రహణాలను లెక్కగట్టాడు.
దశాంశ గణిత పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇదే కాలంలో మరో శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ప్రకృతి విజ్ఞానశాస్త్రాలను గురించి పరిశోధించి నూతన విషయాలు వెలికి తెచ్చాడు..

చరకుడు, శుశ్రుతుడు అంతకు ముందే ఉన్నారు. వైద్యశాస్త్రం, గుప్తరాజుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. రసాయన, భౌతిక, విజ్ఞాన శాస్త్రాలు లేనిదే వైద్యశాస్త్రం లేదు. వర్తకం కోసం వచ్చిన అరబ్బులు  భారతీయ సరుకులతో పాటు ఇక్కడి విజ్ఞానాన్ని తత్వశాస్త్రాన్ని బాగ్దాద్ కి చేరవేశారు. 

బీహార్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విశ్వవిద్యాలయం నలందాకి చేరువలో నిర్మించనుంది. ఈ విశ్వవిద్యాలయానికి తమ వద్ద ఉన్న అపురూప కళాఖండాలను ఇస్తామని దలైలామా 2007 లో ప్రకటించారు. ఈ
విశ్వవిద్యాలయ నిర్మాణానికి 400 కోట్లకు పైగా ఖర్చుచేయనున్నారు. అందుకుగాను నియమింపబడిన కమిటి సారధిగా నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఉంటారు. ఈ బృందంలో సగటాబోస్ (నేతాజి మేనల్లుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్), నింగపూర్ విదేశాంగ మంత్రి, చైనా, జపాన్ దేశాలకు చెందిన మంత్రులు పలువురు విద్యా ప్రముఖులు ఉన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిన తరువాత తొలిదశలో పి.జి. ఆ పైస్థాయి విద్యను అభ్యసించే వారికి ఏర్పాట్లుచేయనున్నారు. ప్రతి పదిమంది విద్యార్ధులకు ఒక అధ్యాపకుడు చొప్పున ఉంటారు. ఈ విశ్వవిద్యాలయంలో 46 మంది విదేశీ, 400 మంది భారతీయ అధ్యాపకులు ఉండేలా చూస్తారు. నలంద విశ్వవిద్యాలయ శిధిలాల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని భారత ప్రభుత్వం యునెస్కోకు విజ్ఞప్తి చేసింది.

పునః ప్రారంభము
భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం 2014 సెప్టెంబరు 1, సోమవారము నాడు తిరిగి ప్రారంభమైంది. దాదాపు 800 ఏళ్ల అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో తరగుతులు ప్రారంభం కావడం విశేషం. బీహార్ రాజధాని పాట్నాకు 100 కి.మీ. దూరంలో రాజ్‌గిర్ వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రాచీన విశ్వవిద్యాలయం కూడా రాజ్‌గిర్‌కు సమీపంలోనే వుండేదని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.భారత ప్రాచీన విజ్ఞానానికి కేంద్రబిందువైన ఈ విశ్వవిద్యాలయం 12వ శతాబ్దంలో విదేశీయుల దాడులతో పూర్తిగా ధ్వంసమైంది. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచనల మేరకు విశ్వవిద్యాలయాన్ని తిరిగి నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కోర్సులను మాత్రమే ఏర్పాటుచేసినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలో విస్తరణ వుంటుందని వారు వెల్లడించారు.

విశాలాంధ్ర సేకరణ   - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Post a Comment

0 Comments