ఇద్దరు స్నేహితుల కథ

ఇద్దరు స్నేహితుల కథ

SHYAMPRASAD +91 8099099083
0

◆◆◆◆◆◆( ఇద్దరు స్నేహితుల కథ)◆◆◆◆◆◆

ఒక ఊరిలో భూషయ్య అనే ఒక కార్మికుడు ఉండే వాడు. అతనికి కొన్ని ఈత కాయల తోటలు ఉండేవి.

ఆ ఈత తోటలలో కల్లు తీసుకొని వాటిని అమ్మి వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగించే వాడు. నిత్యం ఆ ఈత చెట్లకి కల్లు కుండ లను కట్టి ప్రతి రోజూ ఉదయాన్నే ఆ కుండలను తీసి కల్లు దుకాణం లో అమ్మేవాడు. కానీ అతని తోటలో చాలా చెట్లు వున్న ఒక పది చెట్ల కుండ లు మాత్రం ఎప్పుడూ ఖాళీ గా ఉండేవి. మిగితా చెట్ల కుండలు బాగా కల్లు వస్తోంది కానీ ఆ పది చెట్ల కుండ లు మాత్రం ఎందుకు ఖాళీ గా వున్నాయి ఎందుకు అని అనుమానం కలిగింది. ఆ కల్లు ఎవరు దొంగతనం చేస్తున్నారో ఎలాగైనా కనిపెట్టలని భూషయ్య అనుకున్నాడు. దొంగలని ఎలాగైనా పట్టుకోవాలని భూషయ్య ఆరోజు రాత్రి చెట్ల మద్యలో నిండా గొంగళి కప్పుకొని కూర్చున్నాడు.

రాత్రి అంతా తోటలో వున్న తోటలోకి ఎవరు రాలేదు. అప్పుడు భూషయ్య కి ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఎలాగైనా ఆ దొంగలని పట్టుకోవాలని, ఆ దొంగలు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ అయ్యింది. కానీ భూషయ్య కు ఎల్లయ్య అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఎల్లయ్య భూషయ్య ఇద్దరూ కళ్ళు అమ్ముకొనే బతికేవారు. ఎల్లయ్య తోట భూషయ్య తోట పక్కనే ఉండేది. ఎల్లయ్య భూషయ్య ఎదురుపడితే ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు ఒకరినొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ భూషయ్య ఎదుగుదలను చూసి ఎల్లయ్య ఓర్వ లేక పోయేవాడు. అతని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకున్నాడు. ఒకరోజు తోటలో కలిసిన ఎల్లయ్య భూషయ్య తో ఇలా అన్నాడు. ఏమిటి మిత్రమా వ్యాపారం ఎలా సాగుతోంది. ఏం చెప్పమంటావు మిత్రమా ఎవరో నా కళ్ళు ఉట్టిలు దొంగతనం చేస్తున్నారు. దానికి ఎల్లయ్య భూషయ్య తో రాత్రి కాపలా కాయ లేక పోయావా అన్నాడు. నేను కాపలా కాసా ను కానీ అక్కడికి ఎవరూ రాలేదు. ఎప్పటికైనా ఆ దొంగలను కచ్చితంగా పట్టుకుని తీరుతాను అని భూషయ్య ఎల్లయ్య తో అన్నాడు. ఈ మాటలు విన్న ఎల్లయ్య విషయం కళ్ళలోకి సూటిగా చూడలేక పోయాడు. అయితే భూషయ్య ఒక నాగుపాము ని పెంచుకోసాగాడు.

ఆ పాము భూషయ్య దగ్గర ఎంతో ఆప్యాయంగా ఉండేది. భూషయ్య ఆ పామును చాలా చిన్నగా ఉన్నప్పుడే తెచ్చుకున్నాడు ఇప్పుడు అది చాలా పెద్దగా అయింది. దానికి ఫనీ అనే పేరు కూడా పెట్టాడు. ఎల్లయ్య తో మాట్లాడి ఇంటికి వచ్చాక ఫణి తో భూషయ్య ఇలా అన్నాడు. ఇందాక ఎల్లయ్య తో మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చింది ఫణి మన తోటలో జరుగుతున్న కుట్టిల దొంగతనం అతనే చేస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. దానికి పాము అలా చేస్తే అతనికి ఏంటి లాభం అన్నట్లుగా సైగ చేసింది. దానికి భూషయ్య అతనికి నాకు వ్యాపారపరమైన పోటీ చాలా ఉంది నన్ను అనగ దొక్క డానికి ఇలా చేస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. దానికి పాము అతనికి బుద్ధి ఎలా చెబుతావు అన్నట్లుగా సైగ చేసింది. భూషయ్య పాముతో దానికి నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను అన్నాడు. ఎల్లయ్య కూడా తన దగ్గర ఒక ఎలుగుబంటిని పెంచుకోసాగాడు.

ప్రతిరోజు ఎల్లయ్య ఎలుగుబంటిని తనతోపాటు తోట కి తీసుకెళ్ళే వాడు. ఎలుగుబంటి కూడా యజమాని చెప్పినట్లే వింటూ ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉండేది. అయితే భూషయ్య తోటలో ఉండే కళ్ళు కుండలను ఎలుగుబంటి సాయంతోనే వాటిని దొంగతనం చేసేవాడు. ప్రతిరోజు మనం ఆ భూషయ్య కంటపడకుండా ఈ కళ్ళు కుండలను దొంగతనం చేసి సొమ్ము చేసుకుంటున్నాం. 

ఈ దెబ్బతో భూషయ్య వ్యాపారంలో నా కంటే తక్కువ అయినట్లే అనుకున్నాడు ఎల్లయ్య. ఇలా ఎల్లయ్య ప్రతిరోజు కళ్ళు కుండలను దొంగతనం చేస్తున్నాడు. ఎలుగుబంటి ఎల్లయ్య తో భూషయ్య మనల్ని పట్టుకుంటాడు ఏమో అన్నట్టుగా సైగ చేస్తే దానికి మనల్ని పట్టుకొని మొనగాడు ఎవడు లేడు అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న భూషయ్య తన పాము తో కలిసి ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. మర్నాడు ఉదయం భూషయ్య ఎల్లయ్య ను కలిసి ఈ విధంగా అన్నాడు మిత్రమా నీకు ఒక విషయం తెలుసా ఉదయాన్నే పరగడుపున పాము తాగిన ఎంగిలి కళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా అన్నాడు. దానికి ఎల్లయ్య ఓహో అలాగా ఈ విషయం నాకు ఇంతవరకు తెలియనే తెలియదు అన్నాడు. భూషయ్య మాటలు నమ్మిన ఎల్లయ్య ఆ రాత్రి తోటలోకి చొరబడ్డాడు. భూషయ్య పథకం ప్రకారం ఎల్లయ్య ఎప్పుడూ దొంగతనం చేసే చెట్టుపైకి పామును ముందే ఎక్కించాడు. 

అది కుండ అంచున నొక్కి కూర్చుంది. అనుకున్నట్లుగానే ఎల్లయ్య వచ్చి చిమ్మచీకట్లో చెట్టెక్కి కుండ లోకి తొంగి చూస్తూ ఉండగానే పాము ఒక్కసారిగా అతనిని కాటు వేసినట్లుగా బుస కొట్టింది. పాము చూడగానే ఎల్లయ్య భయంతో వణికి పోయి కాలు జారి కింద పడిపోయాడు అతని పాము కాటేసింది ఏమో అనుకొని పాము కరిచింది ఎవరైనా వచ్చి రక్షించండి అంటూ అరవడం మొదలు పెట్టాడు. చాలాసేపు అరిచినా ఎవరూ రాకపోవడంతో అతనే నెమ్మదిగా లేచి ఎలాగోలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూషయ్య ఇదంతా పక్క ఒక చెట్టు చాటున దాక్కుని చూస్తూ తనలో తాను నవ్వుకున్నాడు. ఎల్లయ్య కి ఇప్పుడు బాగా తిక్క కుదిరింది లేదంటే నా తోట లో దొంగతనం చేస్తాడా స్నేహితుడు అని కూడా చూడకుండా నన్ను మోసం చేస్తాడా అనుకున్నాడు భూషయ్య. చెట్టు మీద నుంచి కింద పడిన ఎల్లయ్య కి దెబ్బలు

తగిలి నడుము వీరిగి దెబ్బలతో మూలుగుతూ పడుకున్నాడు. భూషయ్య అదేమీ తెలియనట్టుగా ఎల్లయ్య ఇంటికి వెళ్లి మొసలికన్నీరు కారుస్తూ అయ్యో ఎన్ని దెబ్బలు ఎలా తగిలించు కొన్నావు మిత్రమా అన్నాడు. దానికి ఎల్లయ్య ఏం చెప్పమంటావు మిత్రమా మా తోటలోని ఈత చెట్టు ఎక్కి కళ్ళు కుండ తీస్తుంటే కాలు జారి కింద పడ్డాను. దానికి భూషయ్య అయ్యో అలాగా కాస్త చూసుకొని పని చేయొచ్చుగా మిత్రమా అన్నాడు. అంతా నా కర్మ మిత్రమా ఏం చేయమంటావు అన్నాడు ఎల్లయ్య. వారం రోజుల పాటు ఎల్లయ్య మంచందిగి లేక పోయాడు మంచం మీదే మూలుగుతున్నాడు. కానీ ఎల్లయ్య కు దెబ్బలు తగలడానికి కారణం భూషయ్య అని ఎల్లయ్య పెట్టేశాడు. ఎల్లయ్య అప్పటికే మారకపోగా భూషయ్య మీద ఇంకా పగ పెంచుకున్నాడు. ఆ పగ తోనే మళ్లీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. దొంగతనం చేస్తున్న అతనికి తృప్తి తీరడం లేదు ఏదో ఒకటి చేసి భూషయ్య ను దెబ్బతీయాలని కొన్నాడు దానికి ఎల్లయ్య ఒక పన్నాగం పన్నాడు. ఈత చెట్ల మొదలు లో చెట్లు ఎండిపోవడానికి వాడే మందులను చల్లాడు. పాపం భూషయ్య తోటలోని చాలా చెట్లు ఎండిపోయాయి. పాపం భూషయ్య చాలా బాధపడ్డాడు తోటలోని చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి అర్థం కాలేదు బంగారం లాంటి తోట మొత్తం ఎండిపోయింది అని దిగులుపడ్డాడు. ఈ విషయాన్ని ఎల్లయ్య తో చెప్పాడు భూషయ్య. మిత్రమా నా తోటలోని చెట్ల అన్ని ఎందుకో ఎండిపోతున్నాయి అవి ఎందుకు అలా ఎండిపోతున్నాయని నాకు అర్థం కావడం లేదు. మిగిలిన చెట్లు కూడా ఎండిపోతే నా వ్యాపారం అంతా దెబ్బతింటుంది నా కుటుంబం అంతా ఆహారం లేక పస్తులు ఉండాల్సి వస్తుంది. నాకేం చేయాలో తోచడం లేదు అన్నాడు భూషయ్య ఎల్లయ్య తో. దానికి ఎల్లయ్య నువ్వేం బాధపడకు మిత్రమా అంతా సవ్యంగానే జరుగుతుంది లే అని పైకి అంటున్నా మనసులో మాత్రం విషయం మీద కుట్ర కుతంత్రాలు పెట్టుకున్నాడు. భూషయ్య సర్వనాశనం అయిపోతే చూడాలనుకుంటు న్నాడు. భూషయ్య తోటలోని చెట్లు ఎండిపోవడానికి కారణం ఎల్లయ్య అనే అని భూషయ్య కి అర్థం అయింది. పాముతో బెదిరించిన ఎల్లయ్య కి బుద్ధి రాలేదు ఎల్లయ్య కు బుద్ధి రావాలంటే దెబ్బకు దెబ్బ తీయాలని అనుకున్నాడు భూషయ్య. ఆ రోజు రాత్రి నుండి భూషయ్య ఎల్లయ్య తోట లోకి చొరబడి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత భూషయ్య దొంగతనం చేస్తున్న విషయం ఎల్లయ్య కనిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లయ్య భూషయ్య ను నమ్మకద్రోహి అనుకున్నాడు నేను నిన్ను మోసం చేశాను అని నువ్వు కూడా నన్ను మోసం చేయాలనుకున్నావా అనుకున్నాడు. భూషయ్య మీద ఇంకా పగను పెంచుకొని నా తోటలోని దొంగతనం చేస్తావా నీకు బుద్ధి చెప్తాను దెబ్బకు దెబ్బ తీయడం లో నీ కంటే రెండాకులు ఎక్కువే చదివాను అనుకున్నాడు ఎల్లయ్య. ఎల్లయ్య ఒక పథకం ఆలోచించి ఆ పథకాన్ని తన ఎలుగుబంటికి వివరించాడు. ఆ రోజు రాత్రి ఎల్లయ్య ఎవరికీ తెలియకుండా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రోజు లాగానే భూషయ్య వచ్చి కల్లుకుండ కోసం ఒక చెట్టు ఎక్కాడు. అప్పుడు ఎల్లయ్య ఎలుగుబంటి కూడా భూషయ్య వెనకాలే చెట్టు ఎక్కబోయింది. ఎల్లయ్య పథకం తెలుసుకున్న భూషయ్య ఆ ఎలుగుబంటి తో ఎల్లయ్య లా గొంతు మార్చి ఇలా అన్నాడు. భూషయ్య గొంగలి కప్పు కోవడంతో ఎలుగుబంటి భూషయ్య ను కనిపెట్ట లేక పోయింది. పిచ్చి ఎలుగుబంటి నేను నీ యజమానిని ఆ భూషయ్య తోట చివరన ఉన్న చెట్టు మీద ఉన్నాడు వెళ్లి కాళ్లు పట్టుకొని లాగి కిందపడేసై అన్నాడు భూషయ్య. అలా అనగానే ఎలుగుబంటి నమ్మి తోట చివర చెట్టుపైన ఎల్లయ్య ఉన్నాడని తెలియక అతని చెట్టు పైనుండి కిందకి లాగేసింది. 

ఎలుగుబంటి కాలు లాగానే ఎల్లయ్య కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. అది చూసిన ఎలుగుబంటి కింద పడింది యజమాని గుర్తించింది. వెంటనే భూషయ్య ను చంపేయాలి అనుకొని భూషయ్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్క బోయింది. భూషయ్య అప్పటికే చేతిలో ఒక కర్ర పట్టుకుని కాచుకొని కూర్చున్నాడు. ఎలుగుబంటి చెట్టు ఎక్కి తన కాలు పట్టుకో బోతుంటే భూషయ్య తన చేతిలోని కర్రతో ఎలుగుబంటి ముఖం మీద గట్టిగా రెండు పోట్లు పొడిచాడు ఆ తరువాత ఎలుగుబంటి చాతిమీద గట్టిగా ఒక్క దెబ్బ వేసాడు. అక్కడ దెబ్బ తగిలితే ఎలుగుబంటి బతకడం చాలా కష్టం భూషయ్య దెబ్బకి ఎలుగుబంటి కిందపడి గిలగిలా కొట్టుకుని కాసేపటికి చనిపోయింది. ఎల్లయ్య కు ఒక కాలు విరిగి ఇంటివాడయ్యాడు ఇక ఏ పనీ చేయలేక ఇంట్లోనే ఉంటున్నాడు తర్వాత ఎల్లయ్య తన తప్పును తెలుసుకొని భూషయ్య కు క్షమాపణలు కూడా చెప్పాడు. 

నీతి: ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ నమ్మిన వారిని మోసం చేయకూడదు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!