కథ -మన పిల్లలు చేస్తే

కథ -మన పిల్లలు చేస్తే

ShyamPrasad +91 8099099083
0
పెద్దలను  గౌరవించండి......

నాని : నాన్నా! ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి?
తల్లి: మీ నాన్న వెళ్ళి మీ తాతయ్యను తీసుకుని రాకపోయినా మీ పెద్దనాన్న ఇక్కడికి వచ్చి మీ తాతయ్యను దింపివెళతారులేరా!(అందిఎగతాళిగా)

అనుకున్నట్లుగానే ఫోను రింగ్ అయింది.
తల్లి: నేను చెప్పాను కదా! మీ అన్నయ్యగారే అయిఉంటారు, మీ నాన్నగారిని తీసుకెళ్ళమని చెప్పడానికే! (అంది భర్తను ఉద్దేశించి)
తండ్రి: అవును అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు, అంటూ ఫోను తీసుకుని ఇలా మాట్లాడాడు,
నాని పెద్దనాన్న: ఏరా! ఎలా ఉన్నారు,ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని వెళ్ళలేదు ప్రొద్ధుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు చిన్న కొడుకు రాలేదని! త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళు
నాని తండ్రి: ఇదుగో వచ్చేస్తున్నాను అన్నయ్యా! ఆఫీసులో కాస్త పని ఒత్తిడి వల్ల
సాయంకాలం తీసుకుని వొద్దామనుకుంటుండగా నీవు కాల్ చేశావు  అంటూ ఫోను పెట్టేసి నసుగుతూ బయలుదేరాడు
ఇదంతా గమనిస్తున్న నానీ (మనవడు) నాన్నగారిని ఇలా అడిగాడు.
నాని: నాన్నా! నాకో డౌటు తీరుస్తారా...?
తండ్రి: ఇప్పుడేం డౌటు రా! ముందు మీ తాతయ్యను తీసుకుని రానివ్వు తరువాత నీ డౌటు తీరుస్తాను.
నాని: ఇప్పుడే చెప్పండి నాన్నా! తాతయ్యకు మీరు ఇద్దరు కొడుకులు కదా.
ఒక నెల మన ఇంట్లో ఒక నెల పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో  ఇలా మార్చి మార్చి తాతయ్యను చూసుకుంటున్నారుకదా! మరి మీకు నేను ఒక్కడినే
కొడుకును కదా! నేను పెద్దయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు.
మరి ఇంకో నెలలో ఎక్కడ ఉంటారు నాన్నా!
ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి
కన్నవారిని పంచుకోకండి వారు మీకు ప్రేమను పంచినవారు వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిదికాదు 
దయచేసి తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా, భారంగా తలచకండి చివరిదశలో వారిని అలక్ష్యం చేయకండి.
రేపు మనమూ పెద్దవారము అవుతాము మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి
ఆలోచించిండి, 
"మన పిల్లలు చేస్తే" కాదు చేస్తారు ఎందుకంటే  వాళ్ళు మనలను అనుకరిస్తారు కదా...

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!