సరదా చాటు పద్యాలతో కొట్లాట

సరదా చాటు పద్యాలతో కొట్లాట

SHYAMPRASAD +91 8099099083
0
*సరదా చాటు పద్యాలతో కొట్లాట*
          🌹  🌼 🌹    
ఒక రోజు ఒక తెలుగు భాషా పండితుడు భోజనానంతరము ఒక వీధిలో పోతూ బయట అరుగు పైన కూర్చొని ఉన్న అందమైన అతివను చూడటం జరిగింది. వెంటనే ఆ పండితుడు ఆమెను ఆటపట్టించాలని ఆమె దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు:-

*పర్వత శ్రేష్ట పుత్రికా పతి విరోధి*
*యన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి*
*పేర్మి మీరిన ముద్దుబిడ్డా*
*సున్న మించుక తేగదే సుందరాంగీ!*

         పర్వత శ్రేష్ట పుత్రికా అంటే పార్వతీ దేవి, ఆమె పతి శివుడు, అతని విరోధి మన్మధుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ పెండ్లాము సరస్వతి, ఆమె అత్త లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి కన్న తండ్రి సముద్రుడు, సముద్రుని ముద్దు పెద్ద బిడ్డ జ్యేష్టా దేవి. అంటే ఓ అందాల నిద్రమొద్దూ నాకు కొంచెము సున్నము తెస్తావా అని ఆపండితుడు ఆమెను అడుగుతాడు.  ఆమెకూడా అంతా విని ఏమీ తెలియనట్లు లోనికి వెళ్తుంది. 
ఆ పండితుడు ఆమెకు సున్నం తెమ్మన్నది మాత్రమే అర్థం అయివుంటుంది, మిగతాది ఆమెకు అర్ధం కాలేదనుకొని తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు.  అంతలో లోనికెళ్ళిన సుందరాంగి చిన్న సున్నం డబ్బాలో బయటకు వచ్చి అతనితో ఇలా అంటుంది:-

*శత పత్రంబుల మిత్రుని *
*సుతు జంపిన వాని బావ సూనుని మామన్*
*సతతము దాల్చెడు నాతని*
*సుతు వాహన వైరి వైరి సున్నంబిదుగో* 
     
అంటూ సున్నం డబ్బాను ఆ పండితుని చేతికి స్తుంది.  దీని భావమేమో చూద్దాము.  
శత పత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. సూర్యుని కుమారుడు కర్ణుడు. కర్ణుని చంపింది అర్జునుడు. వాని బావ శ్రీ కృష్ణుడు. కృష్ణుని పుత్రుడు మన్మధుడు. మన్మధుని మామ చంద్రుడు. చందమామను దాల్చెడు వాడు పరమ శివుడు. శివుని కుమారుడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుని వాహనం ఎలుక. ఎలుక వైరి పిల్లి. పిల్లి వైరి కుక్క.   అంటే ఓ కుక్కా సున్నమిదిగో అన్నదన్న మాట.  

    ‌‌.  దానితో ఆ పండితునికి నోటమాటరాక, సిగ్గు పడుతూ సున్నం తీసుకొని నోరు మూసుకొని అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు.

        ఇదండీ పండితుల సరదా చాటు పద్యాలు కొట్లాట.

*సర్వే జనాః సుఖినో భవంతు*

           ‌‌🌹🙏🌹
       ‌‌ ‌‌.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!