దయచేసి ఓ విజ్ఞప్తిః- కష్ట కాలం లో అందరూ చదవాలి....

దయచేసి ఓ విజ్ఞప్తిః- కష్ట కాలం లో అందరూ చదవాలి....

SHYAMPRASAD +91 8099099083
0
కష్ట కాలం లో అందరూ చదవాలి....

దయచేసి ఓ విజ్ఞప్తిః
ఢిల్లీ మత సదస్సులో పాల్గొన్న వారి వలన వైరస్ సోకింది అనే కారణాన్ని కొందరు అడ్వాంటేజిగా తీసుకుని ఆ వర్గంపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. ఈ సమయంలో వారికి ఎవరిపైన అయినా ద్వేషం కలిగితే దాని ప్రభావం, సాంఘీక అశాంతి అనేది దీర్ఘకాలం కొనసాగుతుంది. వైరస్ పోయినా వైషమ్యాలు పోవు. ఆ వర్గం వారికి సంబంధించిన పాత వీడియోలు, వేర్వేరు సందర్భాల్లోని వీడియోలు పదేపదే సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేస్తూ కొంతమంది ద్వేషానికి ఆజ్యం పోస్తున్నారు. సగం కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి వల్ల వచ్చి ఉండవచ్చు. మరి మిగతా సగం? దానికి ఎవరిని బ్రాండింగ్ చేయాలి? ఏ మేడారం జాతర సమయంలో ఈ వైరస్ వచ్చి ఉంటే ఏమయ్యేది? యాథృచ్చికంగా జరిగిన దానికి అలాంటి ప్రచారం చేయటం భావ్యం కాదు. ఈ సున్నితమైన సమయంలో సోషల్ మీడియా చాలా భాధ్యతగా ఉండటం అవసరం. తమను మిగతా సమాజం వ్యతిరేక భావంతో వెలి వేసినట్టు చూస్తోంది అనేది ఆ వర్గం వారికి కలిగితే రెండు వర్గాల మధ్య ద్వేషభావాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. చెక్ చేయటానికి వచ్చిన వారిపై దాడి చేయటం వంటి సంఘటనలు జరిగితే దానికి ఆ ఇండివిడ్యువల్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప మొత్తం అందరికీ బ్రాండింగ్ వేయటం కరెక్టు కాదు అనేది నా అభిప్రాయం. నేనేమీ కుహనా లౌకికవాదిని కాదు. పరమ ఆస్తికుడిని. కానీ పరమత ద్వేషం పనికిరాదని బలంగా విశ్వసించేవాడిని. దాని వలన సమాజంలో అందరూ సమస్యల్లోకి నెట్టివేయబడతారనేది చరిత్రలో నిరూపితం అవుతూ వస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!