కథ -ధనవంతుడు కొత్త ఇల్లు

కథ -ధనవంతుడు కొత్త ఇల్లు

SHYAMPRASAD +91 8099099083
0
ఒక రోజు ఊరిలో ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. 

‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. 

వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. 

కానీ, అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు. ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. 

అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు. తెలియదని తల ఊపాడు యజమాని. 

ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. 

అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. ఆత్మ, అందులోని భగవంతుడు మాత్రమే శాశ్వతం. ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. 

మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ 

అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు కబీరు

ఎవరు చూడటం లేదు కదా అని అక్రమాలకు దిగిన వారు వాళ్ళు చేసేంది ఎవరు చూడటం లేదు అని అన్యాయం గా కూడపెట్టుకుంటారు.. వారిని చూసే సాక్షులు ఉన్నారని మర్చేపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది.. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది. అలాగే చేసిన పాపం అనుభవించడానికి దాని సమయం అదే తీసుకుంటుంటుంది.

ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మనల్ని కాపాడుతుంది🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!