తెలుగు భాషా ప్రేమికుడు

తెలుగు భాషా ప్రేమికుడు

SHYAMPRASAD +91 8099099083
0


*అమ్మ చిక్కిపోతోంది.*

*తెలుగు భాషకు 56 అక్షరాలు ఉన్నాయంటే అవునా!  అని ఆశ్చర్య పడేవారూ, అవును గాబోలు! అని సర్ధుకుపోయేవారూ, కాదేమో! అని అనుమాన పడేవారూ, కానే కాదు! అని ఖచ్చితంగా చెప్పేవారూ, చాలా మందే ఉన్నారు ఈ మధ్య.*

*మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. అమ్మా! బాగున్నావా? అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా, ఎందుకా కన్నీరు?  అంటే ఇలా చెప్పుకొచ్చింది.*

*కామేశం!*

*అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసేసేరు.ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ* *తెలియక దాని అర్ధమూ తెలియక  ఌ, ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది.*
*ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది*

*"చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.*

*ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా!  బండి  "ఱ" వాడకమే లేదు. అందరూ 'ర' తో* *సరిపెట్టుకుంటున్నారు.*

*పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!*
*'ళ' బదులు 'ల', 'ణ'* *బదులు 'న' వాడేస్తున్నార్రా!*
*కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు.* *కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ*.

*ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.*

*ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు! అంటూ వాపోయింది.*

*పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!*

*ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌  మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో*

*మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో* *తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం.* 

*జై తెలుగు తల్లీ!* 🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!