అక్కదేవతల చరిత్ర

🌹🌹🌹 అక్కదేవతల చరిత్ర🌹🌹🌹 అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం వీరవోబనపల్లి గ్రామంలో కొండపై వెలసిన అక్కదేవతలు ఒక పురాతనమైన దేవాలయం ఒక మహిమగల  ఆలయం ఈ ఆలయం లో సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు వీరవోబనపల్లి గ్రామానికి సంబంధించి దొన్నికోట వారి పల్లి పాలేనీవారిపల్లి బండకిందపల్లి ఈ నాలుగు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరవుతారు తమకు ఏ సమస్య వచ్చినా అక్క దేవతలకు ముక్కుతారు తమ గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా అక్కదేవతలు చూసుకుంటారని నమ్మకం       🌹🌹ఆలయ చరిత్ర🌹🌹 ఈ ఆలయం వీరవోబనపల్లి లో పక్కనే ఉన్నా కనికల కొండపైన అక్క దేవతలు వెలసి ఉన్నారు ఈ ఆలయం సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినారు ఈరోజు కూడా గుడి చెక్కుచెదర లేదు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఒక బావి మాదిరిగా ఉంది ( తేప్పా)  ఇక్కడ ఈ బావి లో ఎంత మంది ఉన్నా మనుషులు మునిగి పోరు ఎంత ఎండ కాలం వచ్చినా ఈ బావిలో నీళ్లు ఎండిన చరిత్ర లేదని ఇక్కడ పెద్ద వారు చెబుతారు ఈరోజు కూడా ఈ బావిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అక్క దేవతలు మహిమ గల వారిని అందుకే బోర్లలో నీళ్లు లేకున్నా ఒక కొండపై నీళ్లు ఉన్నాయి అంటే ఇది అక్కదేవతల మహిమే అని ఇక్కడి ప్రజల నమ్మకం 🌹🌹మహిమ గల దేవతలు🌹🌹 అక్కదేవతలు   వీరవోబనపల్లి సంబంధించిన ప్రజలు తమకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా అక్క దేవతలకు ముక్కు ఉంటారు తమకు పాడిపంటలు కుటుంబ సమస్యలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కదేవతల ముక్కు ఉంటే అందరికీ సమస్యలు పరిష్కారం అయ్యాయని మహిమ  అక్కదేవతల ని చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ ముక్కు తీర్చు కుంటారు🌹🌹 ఆలయ సమస్యలు🌹🌹  కొండపైన ఉన్న ఆలయంలో భక్తులు పోవడానికి దారి లేదు  కొందరు సహాయంతో దారిని ఏర్పాటు చేశారు  దారిని ఏర్పాటు చేసి మరియు కరెంటు గుడి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు  ఇట్లు వీరవోబనపల్లి రెవెన్యూ గ్రామ ప్రజలు  🌹      ప్రతి ఒక్కరు    అక్కదేవతల దర్శించండి  -  తమ సమస్యలను తీర్చుకోండి🌹  

Post a Comment

0 Comments