తెలుసుకుందాం -స్పీడ్ బ్రేకర్స్


“స్పీడ్ బ్రేకర్స్”

ఇన్ని స్పీడ్ బ్రేకర్లా.... ఎందుకో ... ఈ వేసిన వాడికి బుద్ది లేదు .. ప్రయాణం సాగటలేదు”

చూడండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవటం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో. ఎవడూ పట్టించుకోడు....

నైపుణ్యం లేని వానికి ఆ స్పీడ్లో ఒకటవ గేర్ లోకి బండిని తీసుకు వచ్చి మెల్లగా పోలేక ఆగిపోతే .. మళ్ళీ స్టార్ట్ చేసి గేర్ వేస్తే అటు ముందుకి వెళ్ళక, వెనుకకు పోతూ వుంటే.... వెనకతలవారి  వాళ్ళ గోల .... కంగారు ...

జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి విశ్లేషణ ......

జీవితంలో వచ్చే అవాంతరాలే ఈ స్పీడ్ బ్రేకర్.... కొన్ని ముందుగానే ఆ దారిలో వెళ్లిన పెద్దలు, విజ్ఞులు అనుభవపూర్వకంగా చెపుతూనే వుంటారు ......

కానీ అంత సేరియస్ గా నేను పట్టించుకొను.... అప్పుడు చూద్దామూలే అనే ఒక ధీమా....

సమస్యలు కొన్ని యుగాల నుంచి అవే... కానీ కాలక్రమేణా వాటిని పరిష్కరించే విధానంలో భిన్నత్వం...

 నేటి ఆధునిక విధానాలలో మనుషులు కన్నా యంత్రాల మేధస్సు రీత్యా .... నాకు స్వతః సిద్దంగా వున్న విజ్ఞత, నైపుణ్యాలు మరుగున పడిపోయి .... అవసరమైతే కంగారు, అదృష్టం బాగుంటే ఎవరో లిఫ్ట్... అలా తుఫాన్ గాలివాటంలో జీవితం సాగిపోతోందేమో తెలీట్లేదు....  

చిట్టి చిన్నారి టెక్నిక్

1.ఎల్లప్పుడూ ఉల్లాసంగా వుండాలి, ఉత్సాహంగా వుండాలి అని పెద్దలు చెప్పే మాట ... అవాంతరాలు వచ్చినా చాకచక్యంగా దాటుకుంటూ వెళ్ళాలని గాని... తప్పించుకొని అడ్డదారిలో వెళ్ళమని కాదు...

2. సమస్య ముందుగా ఊహించి .. అటువైపుకు పోకుండా వుంటే మరీ మంచిది. అది అనుభవజ్ఞులకు, జీవితం మీద అత్యంత భక్తి భావం వున్నవారికే సాధ్యం. 

3. అనుకోని సమస్య వచ్చినప్పుడు, దుష్ట, దుర్మార్గపు, అనాలోచిత ఆలోచనలకు స్పీడ్ బ్రేక్ వేస్తే.... తలకు బొప్పి కట్టి వాస్తవం ఎరిగి .... పరిస్థితులే బయట పడేస్తాయి... కొంచం ఓరిమి అవసరం అపుడే.

4. అవాంతరం వచ్చింది.  గమనించలేదు. జరగవలసిన డెమేజ్ జరిగింది. దాని గురించే ఆలోచించకుండా భవిష్యత్ ప్రణాళిక మనో ధైర్యం, ఆత్మ విశ్వాసంతో త్వరితంగా బయటపడి జన జీవన స్రవంతిలో కలసి ఉన్నత స్థితికి చేరుకున్న వారు జీవితాన్ని వడబోసిన వారు....

మరి ఇప్పుడు చెప్పండి ....

 అనుభవజ్ఞుల  మాటలు కొంత వినే పరిస్థితి వుంటే..... నా జీవితంలో అవాంతరాలు వుండవు కదా.... సాఫీగా సాగిపోతుంది కదా... 

విజ్ఞులు వారి జీవిత అనుభవాలు యువతరానికి తెలియజేయాలనే  కదా గత రెండు సంవత్సరాల నుండి  మన జ్ఞాన కేంద్ర కుటుంబ నిర్వహణ...... 
 
సర్వే జనా సుఖినోభవంతు

Post a Comment

0 Comments