కథ-వంకరటింకరకాయలవి ? ఏం కాయలు మహరాజా

కథ-వంకరటింకరకాయలవి ? ఏం కాయలు మహరాజా

SHYAMPRASAD +91 8099099083
0
వంకరటింకరకాయలవి ? ఏం కాయలు మహరాజా !
--------------------------------------------

వంకరటింకరకాయలవి ?
 ఏం కాయలు మహరాజా ! అనే ఈ సామెత కొద్దిమందికి మాత్రమే గుర్తుంటుంది. జానపదుల జీవనవిధానాన్ని వారి సహజభావ వ్యక్తికరణ మరియు విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పేదే సామెతని చాలామంది విస్మరించడమే అందుకు ప్రధానకారణం.

వంకరటింకరకాయలవి ?
 ఏం కాయలు మహరాజా ! అనే సామెత పుట్టుక గురించి తెలుసుకుందాం.

ఒక్కపుడు ఓ యువ జానపదురాలు నగరంలో తింత్రిని కాయలు అమ్ము కొని జీవించేది. తింత్రినికాయలంటే ఏమిటో అనుకొనేరు. చింతకాయలండి బాబూ! 
ఈ పల్లెపడుచు బాగా అందమైంది కూడా.

ఆ నగరాన్ని ఏలే రాజు ఒకసారి అంత:పుర గవాక్షంలోనుండి చింతకాయలమ్ముకొనే చిన్న దానిని చూచి ఆమె అందానికి మోహించి, అంత:పురానికి రప్పించి పెండ్లిచేసుకొన్నాడు.
గవాక్షమంలోనుంచి ఏలా చూస్తారని అనుమానంగా ఉందా! గవాక్షమంటే కిటకి.

అలా చింతకాయలమ్ముకొనే దానికి సిరిమానం (సంపద) అబ్బింది. నడమంత్రపు సిరి కలుగగానే చాలామంది గతం మరచిపోతారు.గర్వంతో మిడిసిపడతారు.అలాగే ఈ రాణికి కూడా గర్వం నెత్తికెక్కింది.

ఒకరోజు మొగుడుపెళ్ళాలు ఇద్దరు గవాక్షంలోనుండి అదేనండి కిటికిలోనుండి రాచనగరును చూస్తున్నారు.
ఆ వీధిలో ఒక పల్లెటూరి వనిత గంపలో చింతకాయలుంచుకొని  చింతకాయలు చింతకాయలంటూ అరుస్తూ చింతకాయలు అమ్ముంకొంటోంది.

దానిని గవాక్షంలోనుండి చూస్తున్న రాణి గతం మరచిపోయి, చింతకాయలంటే తనకు తెలియనట్లుగా మోహం పెట్టి 
రాజా ! రాజా! 
ఆ వంకరటింకర కాయలేంకాయలు ?  
అంటూ అడిగింది.

రాజుకు చిర్రెత్తుకు వచ్చింది. కోపం నషాలానికి తాకింది. ఓర్నీయమ్మా చింతకాయలమ్ముకొనే నిన్ను తెచ్చి రాణినిచేస్తే గతం మరచి వంకరటింకర కాయలు అవేం కాయలంటూ నన్నే అడుగుతుందా ? నీకింత అహంకారమా అంటూ కోపగించుకొని అంత:పురం నుండి తరిమేశాడు.

అందుకే నడమంత్రపు సిరివచ్చినా, ఇతరత్రా సిరిసంపదలు కలిగినా గతాన్ని మరచిపోవద్దంటూ పెద్దలు చెపుతున్నారు.

నడమంత్రపు సిరి అంటే ఆకస్మికంగా అయాచితంగా సిరిసంపదలు కలగడం.
---------------------------------------------------------------------------------------- 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!