కథ- నమ్మకం - A to Z 2512

HIGHLIGHTS

కథ- నమ్మకం

💐💐💐నమ్మకం💐💐💐
ఒక చిన్న గదిలో నాలుగు  మైనపు దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
ఇంతలో పెద్దగా గాలి రావడం  మొదలయింది.  

ప్రశాంతత అనే మైనం ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని  బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.

ప్రేమ అనే మైనం కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.   

తెలివి అనే దీపం కూడా నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.

నాలుగో దీపం మాత్రం నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి ఆరిపోకూడదు అని తన  వంతు ప్రయత్నం తాను చేసింది   ఆ గాలిని ఎదిరించి వెలిగింది.  

దీపాలు ఉన్న గదిలోకి  చిన్న పిల్లవాడు  వచ్చి అయ్యో మూడు  దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు

బాధ పడుతున్న అబ్బాయిని  చూసి దీపం ఇలా చెప్పింది
బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో  అన్నదట  

 సంతోషంతో  ఆ పిల్లవాడు  ఆ నాలుగో దీపాన్ని  నీ పేరేంటి  అని అడిగాడు
నా పేరు నమ్మకం అని చెప్పింది ఆ దీపం 

అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం.
💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏

2 comments:

  1. ThankU very much. My no,984840489 of kakinada resident..great work done by u..murty msn

    ReplyDelete