కథ-తరగతిపిల్లలకి ఒక కధ

కథ-తరగతిపిల్లలకి ఒక కధ

ShyamPrasad +91 8099099083
0
నా మనసుకు బాగా  హత్తుకున్న కధ... 

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. 
ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. 
అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు, 
ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, 
జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, 
భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. 
ఇద్దరూ ఆలోచిస్తున్నారు,
 ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు.
 వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది.
 తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది.
 పిల్లలూ,  ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్. 
 పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు.
 ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, 
టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని. 
ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు.
 టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది. 
బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు. 
ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 
ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్. 

ఇహ కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు. 
తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది. 
తండ్రి డైరీ కనపడింది, 
అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు,
నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ  ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మనమ్మాయికి ఎవరు తోడు. అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. 
మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది, అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు. 

పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు,  
ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో అందుకని
ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు.💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!