కథ-నెయ్యి అమ్మేవాడు

కథ-నెయ్యి అమ్మేవాడు

SHYAMPRASAD +91 8099099083
0
💐Story💐 
*ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు  పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన* *భార్యతో జీవితం* *సాగిస్తుండేవాడు.* *కొన్ని  పాలని ఊరిలో అమ్మి*
*ఇంకా కొన్ని పాలతో* *నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు. *
*భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్*
*సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది,ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని* *బయలుదేరాడు అప్పుడు కొట్టు* *యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆక్షర్యం* *వేసింది 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.*
*యజమాని అన్ని తూకం చేసి చూస్తే  అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు* *చాలా మనసుకు బాధ అనిపించింది*
*ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..*

 *మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి* *అమ్మటానికి వచ్చాడు*
*అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగడివి నమ్మకద్రోహివి నెయ్యి 1kg అని 900gm ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...*

*అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమాని తో ఇలా చెప్పాడు,* *అయ్యా నేను బీదవాడినే కానీ.* *మోసగాణ్ణి కాదు నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర  ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..*
*అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..*

    *స్నేహితులు మనం వేరేవారికి ఏం చేస్తామో*
*తిరిగి మనకు అదే మళ్ళీ మనకు జరుగుతుంది.* *అది మంచి కానీ చెడు కానీ.గౌరవం కాని దుఃఖం కానీ మోసం కానీ తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది...🌹☘🌹☘*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!