Responsive Advertisement

మొదటి వాహనప్రమాదం

which was first vehicle accident.
Where it was recorded.
----------------------------------------
Accident అనే ఆంగ్లపదానికి ప్రమాదమని తెలుగులో అర్థం. ప్రమాదమంటే అనుకోకుండా జరిగే హానికలిగించే ఘటన.

Vehicle అంటే  బైకు, కారు, బస్సు లారీ వగైరా అనుకోవద్దు.ఇవేమి లేని రోజులలో రథం ప్రయాణ సాధనంగా వుండేది. రథమంటే ఎద్దులబండి కావచ్చు లేదా గుర్రాలు లాగేది కావచ్చు. 

మన పూర్వీకులు రథాలను ప్రయాణసాధనంగానే కాకుండా యుద్ధాలలో కూడా ఉపయోగించేవారు. మహాభారత (కురుక్షేత్ర) యుద్ధంలో ఈ తేరులపై జరిగే యుద్ధం గురించి చాలా బాగా వ్రాయడం జరిగింది. అభిమన్యుడి, కర్ణుడి రథాలను కురుక్షేత్ర సంగ్రామంలో కూల్చివేయడం జరిగింది. అలాగని ఈ రథాల విచ్చిన్నం ప్రమాదం కాదు. ప్రత్యర్థులు వీరిని ఓడించాలని రథాలను విరగ్గొట్టడం జరిగింది.

మరి మొదటి వాహనప్రమాదం ఎక్కడ జరిగింది ఎక్కడ రికార్డుచేసారో ఒకసారి పున:పరిశీలన చేసుకొందాం.

సువిశాల దక్షిణాపథాన్ని విష్ణుకుండీనులు 420 నుండి 620 వరకు పాలించారు. వీరు ఆంధ్ర బ్రాహ్మణులు. వీరి పూర్వీకులది వినుకొండ.వినుకొండ పేరుతో విష్ణుకుండీనులైనారు. వినుకొండను ప్రాకృతంలో  వెన్హుకొండ.వీరిలో మొదటిరాజు మొదటి మాధవవర్మ.
రెండోవాడు దేవవర్మ
మూడవరాజు రెండో మాధవవర్మ.ఇతను రాజధానిని అమరపురం నుండి పెదవేగి సమీపంలోని దెందలూరుకు మార్చాడు.
వీళ్ళ తరువాత విక్రమేంద్రవర్మ, ఇంద్రభట్టారకవర్మ, రెండో విక్రమేంద్రవర్మ, గోవిందవర్మలు పాలించారు.

తరువాత మూడవ విక్రమేంద్రవర్మ (546 - 611) రాజ్యానికి వచ్చాడు. 65 సం॥పాటు సుదీర్ఘపాలన చేశాడు.

ఈ మూడవమాధవవర్మ కాలంలో జరిగిందీ సంఘటన. విజయవాడలోని  మల్లేశ్వరస్వామి  ఆలయంలోని 12 వ శతాబ్ది శాసనం మేరకు
మాధవవర్మ సత్యపాలకుడు, సత్యనిరతుడు జనాశ్రయుడు, ధర్మరక్షకుడనే ప్రశంసవుంది.

విజయవాడ వీధులలో ఒకసారి రాకుమారుడు రథంలో వ్యాహ్యాలికి వెళ్ళాడు. అదే సమయంలో చింతకాయలు అమ్ముకొనే స్త్రీ కుమారుడు వేగంగా వస్తున్న రాకుమారుడి రథం క్రిందపడి చనిపోయాడు.

అపుడా మాతృమూర్తి కన్నకొడుకు మరణాన్ని తట్టుకోలేక మృతబాలుడిని తీసుకొని న్యాయం చేయాల్సిందిగా ధర్మగంట మోగిస్తుంది. మాధవవర్మ ధర్మమూర్తులు ధర్మాధికారులు న్యాయకోవిదులు ఎదుట విచారణ జరిపి రాకుమారుడు నిర్లక్షంగా బండితోలడం వలననే బాలుడు మరణించడం జరిగిందని, అందువలన నిందితునికి మరణశిక్ష విధించి వెంటనే అమలు పరచాడు.

మాధవవర్మ సత్యనిరతికి ధర్మ సంరక్షణకు మెచ్చి ధర్మ దేవత ప్రత్యక్షమై హతుడైన బాలుడిని , చంపబడిన యువరాజును బ్రతికించి కనకవర్షం కురిపిస్తుంది.

ఈ కథలో అతిశయోక్తి (Exaggeration ) ఉండవచ్చు. కవుల కల్పన చేత మృతులు పునర్జీవులై వుండవచ్చు, కనకవర్షం కురిసి ఉండవచ్చు.

అయితే వ  రాజు ధర్మరక్షణపట్ల అంకితుడై యువరాజు బాలుడి మరణానికి కారణమైనందున కన్న కుమారుడిని సహితం శిక్షించివుండటం వాస్తవం.

మీరెపుడైనా లేపాక్షిలోని Fresco చిత్రలేఖనాలను చూశారా!

Fresco చిత్రలేఖనాలు అంటే దేవాలయ పైకప్పుకు గీసిన చిత్రాలు. Mural paintings అంటే గోడలపై చిత్రీకరించిన చిత్రాలు.

లేపాక్షి ముఖమండపంలో అనగా మనం వెళ్ళగానే దర్శించే మంటపం పైభాగంలో కూడా మాధవవర్మ కథను అందంగా చిత్రీకరించారు.

ఈ కథలో రాకుమారుడు రథం మీద వేగంగా వెళుతున్నపుడు ఆవుదూడ బండి కిందపడి చనిపోతుంది. ఆవు చచ్చిన దూడను  రథంమీద రాజాస్థానానికి తీసుకు వెళ్ళి ధర్మగంట మ్రోగించి మాధవవర్మతో న్యాయం కోరుతుంది.

ధర్మసభలో మాధవవర్మ విచారణ జరిపి దోషిగా తేలిన రాకుమారిడికి మరణశిక్ష విధిస్తాడు. ధర్మరక్షణా కంకణబద్ధుడైన మాధవవర్మ సత్యశీలతకు మెచ్చి ధర్మదేవత ప్రత్యక్షమై మృతులిద్దరిని బ్రతికించి బంగారువర్షం కురిపిస్తుంది.

కరోనా దుర్ఘటనా కాలం ముగిసిన తరువాత లేపాక్షి శిల్పసంపద చూచి తరించండి.
----------------------------------------------------------------------- 

Post a Comment

0 Comments