Responsive Advertisement

కథలు - కరోనాకి కబంధహస్తాలకు తేడా ఏంలేదు

కరోనాకి కబంధహస్తాలకు తేడా ఏంలేదు.
---------------------------------------------

పూర్వం ధనువు అనే గంధర్వుడుండేవాడు. అతని తండ్రిపేరు శ్రీ. ధనువు ఇంద్రునిలా చంద్రునివలే అందగాడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి  ధీర్ఘాయుష్షును పొందాడు. దానికితోడు కామరూపవిద్య  కూడా ఇతనికి తెలుసు.

అతిశయించిన గర్వంతో ధీర్ఘాయుష్షుడున్న అహంకారంతో ధనువు ఇంద్రలోకంపై దాడిచేస్తాడు.
ఇంద్రుడు ధనువును ఓడించి తల, కాళ్ళుచేతులు ఖండించి ఆ గంధర్వుడి కడుపులోవుంచి కుట్టేస్తాడు.

ధీర్ఘాయుష్షుడన్న వరం పొందినప్పటికి ఇలాంటి కురూపి జీవితం గడపాల్సొస్తుందని గంధర్వరాజు ధనువు విచారిస్తాడు.

ఇలాంటి రూపంతో ఎలా భూమిపై జీవించాలన రోధిస్తూ తన ఆకలితీరే విధానం శాపవిమోజనం ఎలాగంటూ ఇంద్రుని అర్థిస్తాడు.

ఇంద్రుడు బాధపడి నీది ఇకనుండి రాక్షసజన్మ. నీకు చూడటానికి ఒక కన్నును అహారం పట్టుకోటానికి ఒక యోజనం (12 మైళ్ళు) పొడవుగల రెండు చేతులను ప్రసాదిస్తున్నాను. ఈ రెండు చేతులను యోజనదూరం పంపి అడ్డువచ్చిన ప్రాణిని భక్షిస్తూవుండు రఘురాముడు సీతాన్వేషీయై దండకారణ్యం వచ్చి నీ హస్తాలు ఖండించి శాపవిముక్తిన్ని చేస్తాడని చెప్పాడు.

రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ అరణ్యంలో తిరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ఎడమకన్ను అదురుతుంది. అన్నా రామా ఎందుకో నా ఎడమ భుజం కంపించడం జరుగుతోంది ఇదేదో అపశకునంలా ఉందని చెపుతున్న సమయంలో చెట్టుమీద వంచులకం అనే పిట్ట  కూస్తుంది.

వంచులకం అరుపు విన్నవారు ఆపద ఎదుర్కొంటారని, అయితే ఆపదను వారు ఎదుర్కొని విజయం సాధిస్తారని శ్రీరామచంద్రుడు చెబుతూవుండగా

వారికి ఒక భీకరశబ్దం వినబడింది.ఏనుగంత అకారం కనబడింది. అ ఆ కారణానికి తలలేదు. బాగా ఉబ్బివుండి విశాలంగావుండి జుగుప్స కలిగించేవిధంగా వున్న ఉదరం కనబడింది.ఆ ఉదరానికి మధ్యలో జీవులను తినటం వలన గారపట్టి అసహ్యంగా వున్న దంతాలు కలిగిన నోరు, ఆ నోటిపై ఎర్రని కనుగుండ్లు ఆ కంటిపై పొడుగాటి నీలి వెంట్రుకలు ఉన్నాయి.

ఆ భయంకరాకారాం కుడిచేత్తో రాముడిని ఎడమచేత్తో లక్ష్మణుడిని పట్టి మింగటానికి ప్రయత్నం చేసింది. అంతట రాముడు దాని కుడిచేతిని, లక్ష్మణుడు ఎడమచేతిని నరికేశారు.

పెద్దగా అరుస్తూ ఆ భీకరాకారం కిందపడిపోయింది. ఆ ఆకారంనుండి దివ్యతేజస్సుతో గంధర్వుడు వెలికి వచ్చి రెండుచేతులు జోడించి తన శాపవృత్తాన్ని ఇలా చెప్పాడు.

ధనువు అనే నేను కామరూప విద్యనభ్యసించి వివిధ భయంకారాలతో మునులను బుుషులను ఆటపట్టించి భయపెట్టేవాడిని. ఒకసారి ఈ ఆకారంతో స్థూలశిరష్కుడనే బుుషిని భయపెట్ట ప్రయత్నించాను. ఆ ముని భయపడకపోగా ఇప్పుడున్న రూపం నీకు నచ్చినట్టుంది. ఈ రూపం నీకు శాశ్వితమైపోతుందని శపించాడు. తరువాత నేను దేవేంద్రుడి మీదకు యుద్ధానికి వెళ్ళడం, దేవేంద్రుడు నన్ను ఓడించి నా సుందరశరీరాన్ని ఈ కబంధరూపంగా మార్చడం జరిగింది. 

అప్పటి నుండి నేను కబంధుడనే పేరుమీదుగా ప్రాణులను జీవులను హింసించి తినసాగాను. 
నా చేతులకు చిక్కిన ప్రాణితప్పించుకోలేక  నాకు ఆహారం కావాల్సిందే. అందుకే నాపేరున కంబంధహస్తమని ప్రచారంలోనికి వచ్చింది.

నాకు శాపవిమోజన వుపకారం చేసిన మీకు ప్రత్యుపకారంగా మీకు నాదో విన్నపం ఇక్కడికి దగ్గరలో బుుష్యమూకపర్వతం మీద సుగ్రీవుడనే వానరయోధుడున్నాడు. అతని మంత్రి హనుమంతుడు. వారితో స్నేహం చేయి సీతాన్వేహణలో సాయపడగలరని చెప్పి అంతర్ధానమైనాడు.

కరోనాకి కబంధహస్తాలకు తేడా ఏంలేదు.కబంధహస్తాలు ఒక యోజనదూరంలోనికి వచ్చిన ప్రాణులను భక్షిస్తే కరోనా ప్రపంచం మొత్తాన్ని కబళించివేస్తుంది.

అందుకే self isolation self quarantine  లో బుద్ధిగా వుంటేనే మేలు.
-------------------------------------------------------------------------------------------- 

Post a Comment

0 Comments