Responsive Advertisement

katha-తాత- మామిడి చెట్టు

అనగా  అనగా  ఒకవూరిలో  ఒక తాత ఉండేవాడు.    ఆ తాత  ప్రతీ  రోజు  కొన్ని  మామిడి  టెంకలను  ఊరి చివరి మార్గానికి  ఇరువైపులా  నాటుతుండేవాడు.  ఒక రోజు ఆ మార్గంలో నుంచి  వెళుతున్న  యువ  రాజు గారు తాత చేసే పనిని చూసి  నవ్వారు . తాత  ఎందుకు నవ్వు  తున్నారు  అని అడుగగా   ,  దానికి యువ  రాజు గారు ఏమిటీ  తాత నువ్వు  చేస్తున్న పని ఈ మామిడి  మొక్కలు  పెంచి  వాటి పండ్ల ను కూడా తిందామనేనా  నీ  ఆ శ .   అని తాతను, తాత చేస్తున్న  పనిని  మరొకసారి ఎగతాళి చేసాడు.  దానికి  తాత  నాయనా  నేను  కొన్ని ప్రశ్నలు  వేస్తాను  దానికి కొంచెం  సమాధానం చెప్పగలవా నాయనా  అని అడిగాడు తాత   దానికి యువరాజు ఆ అదెంత పని  అడుగు చిటికెలో  సమాధానమిస్తాను  అని అన్నాడు.   తాత చాలా మంచి వాడవు  నాయనా  నీవు  సరే మొదటి  ప్రశ్న    నీవు నేడు  తింటున్న  పళ్ళన్నీ  నీవు నాటిన చెట్లనుండి  పొందు తున్నావా?   దానికి  యువరాజు  లేదు   మా పూ ర్వీ కులు వేసిన చెట్లనుండి లభించినవి.  నేను ఆ చెట్ల నుండి లభించినవే తింటున్నాను.  అయితే  ఏమిటి?   చూడు నాయనా   నీవేకాదు అందరమూ మన పూర్వీ కులు  వేసిన చెట్లనుండి  లభించినవే  తింటున్నాము .  మరి మన తర్వాత తరం వారికీ మనము అలాంటి ఫలితాలను  అందించాల్సిన  బాధ్యత  మనందరిమీద  వుంది కదా! అవునా  ! కాదా !  యువరాజు తాను చేసిన పొరపాటును గ్రహించి  తాత ముందు చూపుకు ధన్యవాదాలు తెలిపాడు   అంతే కాదు  తమ రాజ్యం లో మొక్కలు నాటువారికి ఎన్నో  బహుమానాలు ప్రకటించాడు .                                            
నీతి :  మనందరమూ వున్న వనరులను   వాడుకోవడమే కాకుండా రాబోవు  తరాలకు  లోటు లేకుండా  చూడాల్సిన బాధ్యత  మనదరిమీద వుంది

Post a Comment

0 Comments