కథ - పేర్లతో ...

కథ - పేర్లతో ...

SHYAMPRASAD +91 8099099083
0
ఒక తల్లికి నలుగురు కూతుళ్లు ఉండేవారు
మొదటి అమ్మాయి పేరు : విరిగిన.
రెండవ అమ్మాయి పేరు : చిరిగిన.
మూడవ అమ్మాయి పేరు : పాడైపోయిన
నాలుగవ అమ్మాయి పేరు : చనిపోయిన.
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది
ఒక రోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
అతనితో తల్లి ఇలా అడుగుతుంది :"మీరు కుర్చీలో
కూర్చుంటారా..? లేకా చాప మీద కూర్చుంటారా
అతిథి: " కుర్చీ మీద కూర్చుంటాను ".
తల్లి :- "విరిగిన ! కుర్చీ తీసుకోనిరా.
అతిథి: " వద్దులేండి.! నేను చాప మీద కూర్చుంటాను".
తల్లి- " చిరిగిన. ! చాప తీసుకోని రా"
అతిథి : " ఉండనివ్వండి.. నేను నేలపైనే కింద కుర్చుంటాను.
అలా ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తర్వాత....
తల్లి: * మీరు టీ తీసుకుంటారా.? లేక పాలు తీసుకుంటారా "
అతిథి:- " టీ
తల్లి:- " పాడయిపొయిన! టీ తీసుకోని రామ్మా
అతిథి : " వద్దు, వద్దులేండి...నేను పాలు తీసుకుంటాను.
తల్లి:- " చనిపోయిన , ఆవు పాలు తీసుకుని రామ్మా..
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుండి
పారిపోయాడు .

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!