కథ - నాన్నా ! నా కోరిక

కథ - నాన్నా ! నా కోరిక

SHYAMPRASAD +91 8099099083
0

ఏమండీ ! ఆ పేపరు చదవడం ఆపి ఇక్కడ మీ కూతురు చేస్తున్న పని చూస్తారా ? ... అరుస్తోంది రాధిక .
.
చదువుతున్న పేపరు పక్కన పడేసి లోపలికి వెళ్ళాడు ప్రదీప్ 
“ఏమిటీ ? ఏమయ్యిందీ ?” 
.
“దీనిచేత ఆ పెరుగన్నం తినిపించండి” 
.
గిన్నె నిండా చక్కని పెరుగన్నం . 
.
“మా పిల్ల ఎంత మంచిదో ! నాన్నకోసం నాలుగు ముద్దలు తినేయ్యమ్మా!” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్తున్నాడు ప్రదీప్ 
.
.
సింధు ఏడుస్తూ కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళని చేతుల వెనుక భాగం తో తుడుచుకుంటోంది . ఏదో నిర్ణయానికి వచ్చింది . 
.
“సరే నాన్న గారూ !” 
.
“నాలుగు ముద్దలు కాదు . అమ్మ పెట్టిన మొత్తం అన్నం తినేస్తాను . మరి నేను కోరింది ఇస్తారా ?” 
ఒట్టు వెయ్యమన్నట్టుగా చేతిని ముందుకు చాపింది .
.
“ఒట్టు “ అంటూ ఆ లేత గులాబీ చేతులలో తన చేతిని వేస్తూ అన్నాడు ప్రదీప్ 
“నాన్నా ! నువ్వు నా డబ్బులు గురించి దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్ లాంటి పెద్ద కోరికలు కోరకూడదు మరి. సరేనా ?” తన షరతు బయట పెట్టాడు 
.
“సరే ! నాన్నా ! నా కోరికకు పెద్దగా డబ్బులు ఖర్చు ఏమీ కావులే .”
అంటూ నెమ్మదిగా అయిష్టంగా పెరుగు అన్నం కష్ట పడి ముద్ద ముద్ద మింగ లేక మింగ లేక మింగుతూ ఉంటె రాధిక వేపూ ప్రదీప్ తన అమ్మ వేపూ కోపంగా చూస్తున్నాడు 
.
ఎలాగో కష్టపడి మొత్తం గిన్నె ఖాళీ చేసేసింది సింధు . 
.
ప్రదీప్ దగ్గరకి చేరింది . ఆమె ఏమి చెబుతుందా అని ప్రదీప్ ఆత్రుతగా చూస్తున్నాడు . ఏదో గొంతెమ్మ కోరిక కోరుతుంది అనుకుంటూ రాధిక , ప్రదీప్ అమ్మగారూ కూడా సింధు కేసి చూస్తున్నారు . 
“నాన్నగారూ ! ఈ ఆదివారం నాకు గుండు చేయించాలి” 
.
“హవ్వ ! హవ్వ ! నీకిదేం పోయేకాలమే ?” బుగ్గల్లో పొడిచెయ్యబోయింది ప్రదీప్ అమ్మగారు . 
.
“చంపేస్తాను ముష్టిపీనుగా !” అరిచింది రాధిక 
.
“మీ నాన్న గారాబం చేసి తలకి ఎక్కించుకుంటూ ఉంటె ఇలాంటి ఛండాలపు బుద్ధులే పుడతాయి. ఈ దరిద్రగొట్టు లక్షణాలు ఎక్కడ నేర్చుకున్నావు. ఏ వెధవ టి వి చానెల్ లోనో ఇది కొత్త ఫాషన్ అని చెప్పి చచ్చారా . గుండు కొట్టించుకోవడం అంటే అర్ధం తెలుసుటే నీకు ?” బామ్మ గారి సన్నాయి నొక్కులు .
.
“నాన్నా సింధూ ! ఇది కాకుండా ఇంకేమైనా కోరుకోవచ్చు కదా ! నిన్ను జుట్టులేకుండా మేము చూడలేము నాన్నా ! ” బ్రతిమాలుతున్నట్టు అడిగాడు ప్రదీప్ 
.
అడ్డంగా తల ఊపింది సింధు 
.
“నాన్నా ! ఆ పెరుగన్నం తినడం నాకు ఎంత అసహ్యమో మీకు తెలుసుకదా ! మీరు మాట ఇచ్చారని కదా నేను తినేశాను . ఇపుడు అలా అంటారేమిటి నాన్నా ? నువ్వే చెప్పావు హరిశ్చంద్రుడి కధ . ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆడిన మాట ఆయన తప్పలేదు . నువ్వు తప్పుతావా నాన్నా ?”
.
.
ఒక్కసారి షాక్ తిన్నట్టు అనిపించింది ప్రదీప్ కి 
.
“ఇచ్చిన మాట తప్పకూడదు” తను చెప్పిన మాటే ! 
.
నీకేదో పిచ్చెక్కింది . దీని మాట లేక్కేమిటండీ !” రాధిక అంటోంది
.
.
“ఆగండి . మనం ఇచ్చిన మాట మనమే తప్పితే ఆమెకు మనం చెప్పిన మాట మీద విశ్వాసం ఉండదు . తను ఇచ్చిన మాట మీద తాను నిలబడదు” 
.
.
“ఓకే నాన్నా ! నీ కోరిక తీరుస్తాను .” 
.
రాధిక ఎంత బ్రతిమాలినా సింధూ తన నిర్ణయం మార్చుకోలేదు . 
.
ఆదివారం సెలూన్ కి తీసుకువెళ్ళి గుండు చేయించి తీసుకువచ్చాడు . గుండ్రటి మొహం . గుండ్రటి బొట్టు , పెద్ద కళ్ళు చాలా అందంగా కనబడుతోంది . 
.
స్కూల్ కి తీసుకువెళ్ళడం ఎలా ?
.
సోమవారం 
.
.
స్కూల్ కి తీసుకువెళ్ళాడు ప్రదీప్ 
.
గుండు తో ఉన్న సింధు క్లాస్ లోకి వెడుతూ ఉంది . లోపలికి వెడుతున్న సింధూ వెనక్కి తిరిగి చేయి ఊపుతోంది . ప్రదీప్ కూడా చేయి ఊపుతున్నాడు 
.
అప్పుడే వచ్చిన కార్ లో నుండి ఒక అబ్బాయి దిగుతూ “సింధూ ! సింధూ ! ఆగు ఆగు” అంటున్నాడు . అటువేపు తిరిగాడు ప్రదీప్ . 
.
ఆ పిల్లడు కూడా గుండుతో ఉన్నాడు . 
.
ప్రదీప్ కి అర్ధం అయ్యింది “ఇదా కారణం !”
.
.
కారులోనుండి ఒకామె దిగింది . 
.
ప్రదీప్ ని సమీపించింది “ సర్ ! మీ అమ్మాయి సింధూజ గొప్ప వ్యక్తిత్వం ఉన్న పిల్లండీ ! మీ పిల్లతో పాటు నడుస్తున్న పిల్లాడు మా అబ్బాయి . వాడికి ‘లుకేమియా’ ఆమె కన్నీళ్లను అదిమి పెట్టుకుంటోంది . పెదాలు వణుకుతున్నాయి . 
.
“వాడు తాను తీసుకుంటున్న ట్రీట్మెంట్ వలన వెంట్రుకలు రాలిపోయాయి . అందుకని గుండుతో స్కూల్ కి వెళ్ళను అని ఇంట్లోనే ఉండిపోయాడు . మీ సింధూజ కిందటి వారం మా పిల్లడు స్కూల్ కి ఎందుకు రావడం లేదు అంటూ అడిగింది . వాడితో వాడు స్కూల్ కి వచ్చి తీరాలని పట్టుపట్టింది . ఎవరూ తనని చూసి నవ్వకుండా చేస్తాను అని వాడిని ఒప్పించింది . తన చేతిలో వాడి చెయ్యి వేయించుకుని ఒప్పించింది . మా వాడు ఈ రోజు నుంచి స్కూల్ కి వెళ్తాను అన్నాడు . అందుకే ఈ రోజు తీసుకు వచ్చాను . కానీ వాడు స్కూల్ కి రావడం కోసం అందమైన జుట్టు ఇలా త్యాగం చేస్తుందని కలలో కూడా ఊహించలేదు సర్ ! 
.
.
మీ పెంపకం చాలా గొప్పది సర్ . మీరూ , మీ భార్యా ఆమెను చాల గొప్ప వ్యక్తిగా తీర్చి దిద్దారు సర్ !
.
ప్రదీప్ కళ్ళల్లో నీళ్ళు జలపాతం లా కారిపోతున్నాయి . 
.
ప్రదీప్ మనసులో అనుకుంటున్నాడు .” సింధూ ! నువ్వు నేర్పావమ్మా నిస్వార్ధ ప్రేమ ఏమిటో ?”
.
“ఈ ప్రపంచం లో మనం సాధించవలసినది మన కోసం మనం జీవించడం కాదు . ఇతరుల కోసం జీవించడం”

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!