భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు

భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు

SHYAMPRASAD +91 8099099083
0
ఒక మిత్రుడు పంపాడు సరదాగా నవ్వుకోడానికి 😅😂🤣

*_భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....!-*

*‘లేలేత’భర్తలు:* 
భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం..
భార్య చూపు తగిలితే చాలనుకోవడం..,
”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”,అనుకోవడం..!
భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం..
అసలు సృష్టిలో భార్య,తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం...!
అన్నీ పనులూ వచ్చని చెప్పడం..!
తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు  భార్యకు చెప్పేసుకోవడం..!
కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం..

{“ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!”}

*‘దోర’భర్తలు:*
పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ ,
కొంత పచ్చి మిగిలుంటుంది....
“అన్నీ చెప్పేసామే..!
కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం..
పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుంది లే ,అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు”
అని నమ్మకంగా ఉండటం..
కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం.
భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం..
అడక్కపోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం..!
భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు..
కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం..
విలవిల్లాడిపోవడం..
భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం..
భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’అనడం..
తనని పని చేయనివ్వక పోవడం...

{“ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!”}

*‘వగరు’భర్తలు:*
అన్నీ అనవసరంగాచెప్పేసాం అని దిగులు పెరగడం..!
ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం..
“ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం..
అప్పుడప్పడూ మాట మాట పెరిగి,
మళ్ళీ సర్దుకు పోవడం..
కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..!
బైటకి తిప్పడం తగ్గించడం.భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..!
భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ఎంతసేపని అలా పనిచేస్తూఉంటావ్”అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి ..నిర్లిప్తతగా చెప్పడం..
కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త ,పాపం తను ఒక్కతే కష్టంకదా చేసుకోవడం..అని భావించడం..!

{“ఈదశ  పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!”}

*‘పండిన’భర్తలు:*
భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..!
భార్యతో కాస్త ముభావంగా ఉండడం ..ముక్తసరిగా మాట్లాడ్డం..!
భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి ..
లేకపోతే  కష్టం అని నిర్ణయించుకోవడం..
ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే,
“ఎందుకు లేటైంది?
ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?....”
లాంటి ప్రశ్నలు .. తట్టుకోలేక కోప్పడ్డం
(ఇది మొదటి స్వచ్ఛమైన  కోపం)
‘ఏమనుకుంటోందో నేనంటే??’
అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం..
ఇంట్లోపని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది...అయినా ఆడవాళ్ళపని మనం చేయడమేంటి..?అని నిశ్చయించుకోవడం..!

{“ఈదశ మొదటి సంత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..!”}

*‘పొగరు’భర్తలు:*
నేను మగాణ్ణి నా ఇష్టం ..
అనే భావనతో మెలగడం..భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా ,తన గతం ఎత్తి దెప్పుతూంటే 
చిరాకు పడ్డం ..కోపంగా అరవడం..ఇంట్లోంచి ఆవేశంగా వెళిపోవడం..
రాత్రికి చల్ల బడ్డం..తనే ముందుగా,భార్యతో మాట్లాడ్డం “అన్నం తిందామా”అని అడగడం..
మళ్ళీ ఉదయం మామూలే..

{“ఈదశ ఆర్నెల్లు ఉంటుంది..!అంటే పెళ్ళయ్యి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది..ఈ దశ దాటాక క్రొత్త కష్టాలు మొదలౌతాయి...!”}

*‘విసుగు’భర్తలు:*
పిల్లల ఏడ్పులతో విసుగు చెందడం..!
భార్య, ”పిల్లల్ని చూస్తూండండి”అని చెప్పినప్పుడు.
కోపం-చికాకు అణుచుకోవడం..
ఓర్పు క్షీణించడం..
“ఛ ఛ కొంపలో మనశ్శాంతి లేదు”
అని వీధుల్లో తిరగడం..
పాత మితృలను కలవడం..
పుట్టింటిని,అమ్మా నాన్న ను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం...
చదుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం..
ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు రావడం..
భార్యపై అరుస్తూ ఉండడం..
భార్యతో వాదనకు దిగడం..
భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే,
వస్తువులు పగలకొట్టడం..
ఆవేశంగా బైటకి వెళిపోవడం..
ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం..దెబ్బలు చూపిస్తూ,ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా..భర్త అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు..”ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్న పిల్లా??”అని మనసులో అనుకోవడం....
“ఇంకా పెళ్ళికాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను”అని సలహాలు చెప్తూండడు..
పెళ్ళి చేసుకున్న వాళ్ళపై జాలి ,సానుభూతి చూపడం..

{“ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకూ ఉంటుంది...!”}

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!