కథ - ...ఆ సొమ్ము వద్దు

కథ - ...ఆ సొమ్ము వద్దు

ShyamPrasad +91 8099099083
0
*...ఆ సొమ్ము వద్దు*!
 🌹🍃🌸🌹🍃🌸🌹

*ఒక మహారాజు సకల భోగాలు అనుభవిస్తున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుండేది.* 

 *ఏదో వెలితి బాధ పెడుతుండేది. అదే వ్యాకులతతో రోజూ సాయంకాలం తన ప్రాసాదంపై ఒంటరిగా పచార్లు చేస్తుండేవాడు.* 

 *అలా నడుస్తూ దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని గమనిస్తుండేవాడు.* 

 *పైకి సామాన్యంగా సాగిపోతున్నా ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించింది.* 

 *ఎలాగైనా ఆ ఆనందం రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడాయన.* 

 *మరుసటి రోజు చీకటి పడుతున్న వేళ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు.*

 *అనుకోని అతిథి వచ్చినా, ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. సపర్యలు చేశారు. ఉన్నదాంట్లోనే మంచి ఆతిథ్యమిచ్చారు.* 

 *అప్పుడా మహారాజు ఇంటి యజమానితో, ‘నేనెవరో తెలియకపోయినా ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో శ్రీమంతుణ్ణి. నా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఇదిగో ఈ కానుక తీసుకోండి’ అంటూ వజ్రాల హారాన్ని బహూకరించబోయాడు.* 

 *వెంటనే ఆ కుమ్మరి చిరునవ్వుతో ‘మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ రోజూ కష్టానికి తగ్గట్టుగా సంపాదించుకుంటూ, అందులోనే ఆనందాన్ని వెదుక్కుంటున్న మా జీవితాలను ఈ చిన్న బహుమతి కకావికలం చేస్తుంది. లేనిపోని ఆశలను ప్రేరేపిస్తుంది. కొత్త కోరికలవైపు పరిగెత్తిస్తుంది. కుండల అమ్మకంలో నా ఆదాయం పెరిగితే సంతోష పడతాం. తప్ప ఇలా కాదు. ఆకస్మికంగా వచ్చిపడే సంపద తృప్తి కన్నా అపరిమిత దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది.’ అని చెప్పాడు.* 

 *మహారాజుకు కొత్త పాఠాన్ని నేర్పాడా కుమ్మరి.* 

🌹🍃🌸🌹🍃🌸🌹

Post a Comment

0 Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!