నరకంలో పడతారా ! సముద్రంలో దూకుతారా!

నరకంలో పడతారా ! సముద్రంలో దూకుతారా!
.....................................................

నరకమంటే దుర్గతి.పైనో కిందో ఎక్కడున్నాయో కాని నరకాలు ఇరవై ఒక్కటివున్నాయి.
అవి
(1) తామిస్రం (2)లోహశంఖువు (3) మహనిరయము (4) శాల్మలి (5) రౌరవము (6) కుంభము (7) పూతిమృతికము (8) కాల సూత్రము (9) సంఘాతము (10) లోహితోదము (11) సవిషము (12) సంప్రపాతనము (13) మహానరకము (14) కాకోలము (15) సంజీవనము (16) మహాపథము (17) అవీచి (18) అంధతామిశ్రము (19) కుంభీపాకము (20) అసిపత్రవనము (21) తాపనము

దశదానాలు అంటే (పది దానాలు ) చేస్తే మంచిది,అలాగని స్థాయికి మించి చెయొద్దు. ఇంతకు పది దానాలేమిటో చూద్దామా!

(1) గోదానం (2) భూదానం (3) తిలదానం (నువ్వులు) (4) హిరణ్యదానం (బంగారు) (5) అజ్యదానం ( నేయి) (6) వస్త్రదానం (7) గుడదానం (బెల్లం) (8) వస్త్రదానం (9) ధాన్యదానం (10) రౌప్యదానం (రూపాయలు)

ఇవికాక షోడశదానాలు కుడా వున్నాయి.మొదట ఈ పదిదానాలు చేయండి చాలు
తరువాత షోడష (16) దానాల సంగతి ఆలోచిద్దాం.

భారతీయ పురాణాల ప్రకారం మనకు ఏడు సముద్రాలున్నాయి.అవి (1) లవణసముద్రం (2)ఇక్షు సముద్రం (3) సురాసముద్రం (4) సర్పిస్సముద్రం (5) దధిసముద్రం (6) క్షీరసముద్రం (7) జలసముద్రం.
....................................................................................................

Post a Comment

0 Comments