Safety Mstches అను అగ్గిపుల్ల కథ.

Safety Mstches అను అగ్గిపుల్ల కథ.

SHYAMPRASAD +91 8099099083
0
Safety Mstches అను అగ్గిపుల్ల కథ.
...............................................

 పాతరాతియుగం నాటికే మానవుడు నిప్పు ఉపయోగాన్ని తెలుసుకోవడం జరిగింది. పచ్చిమాంసం బదులుగా కాల్చిన మాంసం తినటాన్ని నేర్చుకొన్నాడు. తరువాత నిప్పు తయారీని నేర్చుకొనడం జరిగింది. రెండు రాళ్ళను బలంగా రాపాడించడం ద్వారా అగ్గి పుడుతుందని తెలుసుకొన్నాడు. తరువాత అరణి ని ఉపయోగించి నిప్పును తయారు చేయడం నేర్చుకొవడం జరిగింది. అరణి అంటే ఒక అడ్డ కర్రతో  ఒక నిలువు కర్రతో చిన్నతాడు సాయంతో నిప్పును తయారు చేయడం. 

నిప్పు తయారీని నేర్చుకొన్న మానవుడు నిప్పును నిలువ చేయటానికి వేల సంవత్సరాలే తీసుకొన్నాడు. గుహలలో నిప్పు ఆరిపోకుండా నిత్యం మండించడం నేర్చుకొన్నాడు. మన దేశంలో యజ్ఞయాగాలలో నిప్పును మండించి నిలువ వుంచుకొనేవారు. అంతేకాకుండా నిత్యం తమ ఇండ్లలో నిప్పు వెలుగుతూ ఉండేలా చూచుకోవడం, అవసరమైన వారికి అందించడం ఓ వర్గం చేపట్టింది. ఆ వర్గమే నిత్య అగ్ని హోత్రావధానులుగా మార్పు చెందడం జరిగింది. 

 1675 సంవత్సరంలో ఫ్రెంచిదేశానికి చెందిన లెమర్ అనే శాస్త్రవేత్త భాస్వరం 50C° వద్దనే మండుతుందని కాబట్టి దానిని నీళ్ళలోనే ఉంచాలని తెలియచేశాడు. ఈ భాస్వరం అగ్గిపుల్లలు తయారు చేయటానికి ఉపయోగపడింది.

 తన అవసరాలను తీర్చుకోటానికి నిప్పును ఒక ప్రదేశంనుండి మరొక ప్రదేశానికి మార్చడం ఇబ్బందిగా మారడంతో  దానిని సులభంగా తయారు చేయటానికి 19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన కమ్మరర్ ఓ ప్రయోగం చేశాడు.  తెల్ల భాస్వరాన్ని, పటాసును జిగురుతో కలిపి ఓ పుల్లకు కొసకు అతికించి ఆరబెట్టి గరుకైన రాయిపైన గీయడం ద్వారా మొదటిసారిగా అగ్గిపుల్లను తయారుచేశాడు.

 మరికొన్నాళ్ళకు సీసభస్మం (Red Lead) ను మాంగనీస్ అక్సైడ్ కలిపి ఇంకా తీవ్రంగా వెలిగే అగ్గిపుల్లను ఆస్ట్రియాకు చెందిన సీగెల్ పరిశోధకుడు కనిపెట్టాడు. అయితే తెల్లభాస్వరం చెడ్డ విషపదార్ధం, గ్రాములో 10 వ వంతు శరీరంలోనికి వెళ్లినా ప్రాణాలను హరిస్తుంది. 

అందువలన అగ్గిపుల్లలలో తెల్లభాస్వరవాడకాన్ని 1846 లో నిషేధించారు.ఇలోగా ఎర్ర భాస్వరం కనుక్కోవడం జరిగింది. ఎర్రభాస్వరం 240C° వద్ద వేడి చేస్తే తప్ప వెలగదు.తెల్లభాస్వరం బదులుగా ఎర్రభాస్వరాన్ని ఉపయోగించి అగ్గిపుల్లలు తయారు చేయడం జరిగింది. అయితే ఇలా చేసిన ఎర్రభాస్వరం ఒక్కోసారి, అగ్గిపుల్లలలోని ఇతర రసాయనాలతో కలిసి మండిపోయేది.

 మరికొంతకాలానికి స్వీడిష్ శాస్త్రవేత్త ఎర్రభాస్వరాన్ని అగ్గిపుల్లలతో కలపకుండా చిన్న పెట్టెను తయారుచేసి పెట్టె ఉపరితలం మీద గరుకు కాగితాన్ని అతికించి, ఆ కాగితం మీద ఎర్రభాస్వరాన్ని పూసి ఆరబెట్టడం జరిగింది. ఎర్రభాస్వరంలేని అగ్గిపుల్లలను ఆ చిన్న పెట్టెలో వేసి, అవసరమున్నపుడు అగ్గిపుల్లతో ఎర్రభాస్వరం పూసిన గరుకు కాగితం మీద రాపాడించాడు.ఇలా అగ్నిని పుట్టించాడు.

ఇబ్బందులులేని అగ్గిపుల్లలను ఇలా కనుక్కోవడం జరిగింది. వీటినే ప్రమాదరహిత అగ్గిపుల్లలు అంటే Safety Matches గా పిలవడం జరిగింది. ప్రస్తుతం ఎర్రభాస్వరం బదులుగా ఫాస్పరస్ సల్స్పైడును ఉపయోగిస్తున్నారు. 

 రోజుకు మనం సగటున 30 నుండి 50 కోట్ల వరకు అగ్గిపుల్లలను మనం వెలిగిస్తున్నాం.
 .............................................................................

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!