కథ - ఉప్పు ప్యాకెట్టు

*మీ లిటిల్ సోల్జర్స్ కోసం ఒక చిన్న కథ* మీ చిన్నారులకు చెప్పండి.

లక్ష్మి అనే  అమ్మాయి కిరాణా షాప్ నడుపుతూ ఉంటుంది. వాళ్ళ కొడుకు చిన్నబాబు పక్కన కూర్చోనీ చదువుకుంటూ  ఉన్నాడు. అప్పుడే ఒక ఆవిడ షాప్ లోకి వచ్చి ఉప్పు ప్యాకెట్టు ఎంత అని అడిగితే లక్ష్మి 10 రూపాయలు అంటుంది‌. ఆవిడ 8 రూపాయలు ఇవ్వండి అని అడిగితే రాదమ్మా.. అంటే
నా దగ్గర 8 రూపాయలు మాత్రమే ఉన్నాయి కొంచెం ఇవ్వండి pls అంటే 10 రూపాయలు నీ ఇష్టం ఉంటే కొను లేకుంటే  లేదు అనేసరికి.. ఆమె వెనక్కి వెళుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే లక్ష్మి లేచి కూర్చోబెట్టి ఏమైంది అడిగితే ఏం లేదు అమ్మ మా ఆయన కూలి పనికి పోయి ఇప్పుడే 2kgs బియ్యం తెచ్చాడు. కూర వండుదామని ఉప్పు కోసం వచ్చాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి అంతే..😰 అనేసరికి
అప్పుడు లక్ష్మీ వెంటనే అయ్యో పాపం ఉదయం నుంచి ఏమీ తినలేదా ఒక్క నిమిషం ఉండు అని ఇంట్లోకి వెళ్లి వాళ్ళు ఉదయం చేసుకున్న 4 ఇడ్లీలు తెచ్చి ఇచ్చి తినమంటుంది.ఆవిడ నాకు వద్దు అమ్మ అంటే....
 ఏం కాదు తిను ఈ ఇడ్లీలకు డబ్బులు వద్దులే తిను.. అంటే అప్పుడు ఆవిడ అది కాదమ్మా పిల్లలు కూడా ఉదయం నుండి ఏమి తినలేదు. పిల్లలు ఆకలి తో ఉన్నారు. నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వద్దు అమ్మ అనేసరికి... లక్ష్మి కళ్ళలో నీళ్ళు తిరిగాయి😰😰
వెంటనే  అయ్యో పాపం ఉదయం నుండి మీ పిల్లలు కూడా తినలేదా? ఇగో  మీ పిల్లలకు  కూడా 4 ఇడ్లీలు అని ఇచ్చింది. ఆప్పుడు
ఆవిడ పిల్లలు ఆకలితో ఉండగా 'ఏ కన్న తల్లి తినలేదుగా' మా ఇంటికెళ్ళి మేమందరం తింటాం.. మీ దయ వల్ల  నా పిల్లలు ఇవ్వాళ అన్న కడుపు నిండా తింటారు అని కాళ్లకు దండం పెట్టి మీరు చల్లగా ఉండండి అని చెప్పి ఇడ్లీలు తీసుకొని సంతోషంతో వెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న లక్ష్మీ వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మతో అమ్మా..  ₹10 రూపాయల ఉప్పు ప్యాకెట్ రెండు రూపాయలు తగ్గించమని అడిగితే తగ్గించలేదు.  కానీ 8 ఇడ్లీలు అంటే 40 రూపాయలు అవుతుంది మరి ఇలా అయితే చాలా నష్టం కదా అని అడిగితే లక్ష్మీ సమాధానం ఇలా చెప్తుంది.
బాబు.. *వ్యాపారంలో దానధర్మాలు చూడొద్దు. మనం చేసే దాన ధర్మాలు లో  వ్యాపారం చూడొద్దు అంటుంది*

సూపర్ కదా ఫ్రెండ్స్?

విలువలతో కూడిన సమాజం కోసం...

Post a Comment

0 Comments