🙏*"వెర్రిబాగుల" దేవుడు!*
🌹దారిలో వెళ్తూంటే బాటసారికి గుమ్మడి తీగె కనిపించింది.
🌹బలహీనమైన కాండం, నేలమీద పాకుతూ ఉండే తీగె. దానికి భారీ గుమ్మడికాయ.
🌹"దేవుడు వెర్రిబాగుల వాడు. ఇంత లేత తీగకి మోయలేనంత బరువున్న కాయ." అంటూ నవ్వుకున్నాడు.
🌹కొంచెం దూరం వెళ్లాక ఒక మర్రిచెట్టుని చూశాడు.
🌹 హాయిగా చల్లగా ఉంది. చెట్టునీడన కాసేపు పడుకుందాం అనుకున్నాడు.
🌹అంత పెద్ద చెట్టుకి బుల్లి బుల్లి కాయలను చూశాడు. మళ్లీ నవ్వుకున్నాడు.
🌹*దేవుడు మహామూర్ఖుడు* కాకపోతే... ఇంత పెద్ద మర్రి చెట్టుకి అంత చిన్న కాయలు...
అంత చిన్న గుమ్మడి చెట్టుకి ఇంత పెద్ద కాయలు.
🌹ఒక లెక్కలేదు. ఒక పత్రం లేదు." అనుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు.
🌹ఒక గంట తరువాత మెలకువ వచ్చింది.
లేచి చూస్తే ఒంటి మీద మొత్తం మర్రి పళ్లు పడి ఉన్నాయి.
🌹ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు.
🌹తాను అనుకున్నట్టు మర్రిచెట్టుకి గుమ్మడికాయలంత పళ్లుండి ఉంటే.....
బాబోయ్... అనుకున్నాడు.......
😱😱😱😱😱
🌹*దేవుడికి తిక్కా ఉంది. దానికి ఒక లెక్కా ఉంది అనుకున్నాడు*
🏵🌸🍀🏵🌸🍀🏵🌸🍀🌸🏵
🙏ఓం నమో వేంకటేశాయ నమః🙏
🌹🌹శుభ మధ్యాహ్నం🌹🌹
Hi Please, Do not Spam in Comments