రోకలితో కొట్టి చంపేసింది
...................................................
18 వ శతాబ్దం ప్రథమార్థంలో హైదర్ అలీ మైసూరు ఒడయారు రాజ్యంలో ఓ సాధారణ సైనికుడు. శక్తియుక్తులు ధైర్యసాహసాలు ప్రదర్శించడం వలన ఒడయారు రాజులు ఇతని చేరదీసి సర్వసైన్యాధ్యక్షున్ని చేశారు. హైదర్ అలీ చేసిన మేలును మరచిన కృతఘ్నుడు, మైసూరు రాజుల బలహీనతలను బాగుపరచాల్సిందిపోయి, ఆ రాజ్యాన్నే కబళించిన విశ్వాసఘాతకుడు.
హిందూరాజ్యాలను కబళించడం, హిందూదేవాలయాలను కూలదోయడం, హిందువులను బలవంతంగా మతంలోనికి మార్చడంలో ఔరంగజేబుకు తీసిపోలేది హైదర్ అలీ. 1782 లో శ్రీరంగపట్టణ రాజ్యానికి వచ్చిన టిప్పు తండ్రిని మించిన నరరూప రాక్షసుడు.
హిందూక్రిష్టియన్లపైన తండ్రిని మించిన ఘోరకృత్యాలుచేసి నేను వేలమంది హిందువులను క్రిష్టియన్లను మతంమార్పించి దేవాలయాలు ధ్వంసంచేశాను, మీరు కూడా అలాగే చేయండని తన కమాండర్లకు ఉత్తరాలు వ్రాసిన రక్తపిశాచి, హిందూ బద్ధవ్యతిరేకి హైదర్.
కర్ణాటకలోని చిత్రదుర్గం కోట బలిష్టమైంది. ప్రజారంజకంగా పాలిస్తున్న మదకరికరి నాయకుడు ఆ దుర్గపాలకుడు.1777 ప్రాంతంలో చిత్రదుర్గం కోటపైకి అశేషసైన్యంతో హైదరాలీ దండు పంపాడు.
చిత్రదుర్గం కోట శత్రు దుర్భేధ్యమైంది.మదకరి సైనికులు కోటను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.కాబట్టి హైదర్ సైనికులకు కోటలోనికి ప్రవేశించడం దుస్సహమైంది.
కోటలో ఒకబురుజు వద్ద రక్షణగా ముద్ద హనుమప్ప కాపాలాగా వున్నాడు. ఆ బురుజు సమీపంలో కోటకు ఒక రహస్య సొరంగముంది. ఈ సొరంగమార్గం ఒకరు పట్టడానికి మాత్రమే సరిపోతుంది.అంతకుమించి దూరటానికి కష్టం. ఈ రహస్యం కొంతమందికి మాత్రమే తెలుసు. బయటినుండి సమాచారాన్ని తెచ్చుకోటానికి దళనాయకులు ఉపయోగించేవారు.
ఒకరోజు మధ్యాహ్నం ముద్ద హనుమప్ప భోజనం చేయటానికి ఇంటికి వెళ్లాడు.ఇతని భార్యపేరు ఓబవ్వ.హనుమప్ప భోజనానికి కూర్చున్న తరువాత ఇంటిలో తాగునీరు పూర్తిగా అయిపోయిన సంగతి ఓబవ్వ .గుర్తించి కోటలోని చెరువులో నీళ్ళు తీసుకురావటానికి కుండ తీసుకొని వెళ్లింది.అలా వెళుతున్న ఓబవ్వకు రహస్య సొరంగమార్గంనుండి ఎవరో పాకుతూ కోటలోనికి రావడం గమనించింది. వారి వేషాధారణబట్టి వారు హైదర్ సైనికుడని గుర్తించింది.ఈ రహస్యమార్గం నుండి శత్రుసైనికులు కోటలో ప్రవేశించి కోట తలుపులు బార్లతెరిస్తే ఓటమితప్పదని వెంటనే ఏం చేయాలో ఎవరి పిలవాలో తోచక అక్కడే ధాన్యపుకల్లంలో వున్న రోకలిని తీసుకొని, పాక్కుంటు వస్తున్న హైదర్ సైనికుడి తలపై బలంగా మోది వాడిని పక్కకు లాగేసింది.
ఇలా హైదర్ ఒక్కక్కరే సైనికులు పాక్కుంటూ ఓబవ్వ రోకలితో వారి తల పగలగొట్టడం శవాన్ని పక్కకు లాగడం జరుగుతూనేవుంది. రహస్యమార్గం వద్ద శవాలగుట్ట ఏర్పడింది. భార్య ఎంతసేపటికి నీళ్ళు తీసుకురాకపోయేసరికి హనుమప్ప వెతుక్కుంటూ పోయాడు. రహస్యమార్గం వద్ద అపరకాళిలా ఓబవ్వ రోకలిని చేత పట్టుకొని వీరంగంచేస్తూ కనబడింది. ఈ దృశ్యం చూడగానే హనుమప్ప ఇతర సైనికులను అప్రమత్తం చేశాడు.
ఓబవ్వ చాకచక్యం, సమయస్ఫూర్తి వీరత్వం వలన చిత్రదుర్గం కోట రక్షింపబడింది. విషాదమేమిటంటే ఎంతోమంది హైదర్ సైనికులను మట్టుబెట్టిన ఓబవ్వ షాక్ కు గురై అదే రోజు స్వర్గసీమను చేరింది.
మరుసటి సంవత్సరమే హైదర్ చిత్రదుర్గ కోటను జయించి మధుకరినాయకుడిని బంధించి శ్రీరంగపట్నం పట్టుకుపోయాడు.
ఓబవ్వ వీరగాథ కన్నడ పాఠ్య పుస్తకాలలో చోటు చేసుకొంది.
........................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
Hi Please, Do not Spam in Comments