🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🍁ఒక రకంగా భయం..🍁
ఓ అడవి పక్కగా కొందరు యువ సాధువులు ఆశ్రమం కట్టుకుని నివసిస్తున్నారు.
సాయంత్రం వేళ అడవిలోనుంచి అందమైన జింకలు వచ్చి వారి ఆశ్రమం పరిసరాల్లో తిరిగేవి. వాటిని చూసి ముచ్చటపడిన సాధువులు వాటికి తిండి పెట్టేవారు.
అలా కొన్ని రోజులకే జింకలు సాధువులకు బాగా దగ్గర అయ్యాయి. అది గమనించిన ఆశ్రమ పెద్ద, జింకలను భయపెట్టి తరిమేశాడు. ఎవరూ వాటికి తిండి పెట్టవద్దని ఆదేశించాడు.
‘మనం సాధువులం. తోటి ప్రాణులపట్ల ప్రేమ చూపాలి. అలాంటిది వాటికి తిండి పెట్టవద్దనడం భావ్యమా’ అని అడిగారు సాధువులు. ‘నిజమే.
👉కానీ ఈ అడవిలో బతికే జింకలకు ఉన్న ఏకైక ఆయుధం భయం. దానివల్లే అవి తమని తాము కాపాడుకుంటున్నాయి.
👉👉మిమ్మల్ని చూసి భయపడనట్టే రేపు వేటగాళ్లని చూసి కూడా అవి భయపడకపోతే అప్పుడు వాటి పరిస్థితి ఏమవుతుందో ఊహించండి’ అని ఆశ్రమ పెద్ద చెప్పిన మాటలు ఆ యువ సాధువుల్లో ఆలోచన రేకెత్తించాయి.
👉జింకలే కాదు, మనమైనా అసలు భయం అంటూ లేకపోతే ప్రమాదంలో పడతాం.
🌿ఒక స్థాయి వరకూ భయమే మన బలం.
🌿పరీక్షలో ఫెయిలవుతామేమోనన్న భయం కష్టపడి చదివేలా చేస్తుంది.
🌿ఉద్యోగం పోతుందేమోనన్న భయం శ్రద్ధగా పనిచేసేలా చేస్తుంది.
🌿అనారోగ్యం గురించిన భయం వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది.
🌿అప్పుల్లో పడతామేమోనన్న భయం పొదుపుగా ఖర్చుచేసేలా చేస్తుంది.
👉ఒకరకంగా భయం మనని, ఒళ్లు దగ్గరుంచుకుని పనిచేసేలా చేస్తుంది.
మనలోని శక్తి సామర్థ్యాల్ని సరిగ్గా వినియోగించుకునేలా చేస్తుంది.🍁
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Hi Please, Do not Spam in Comments