Responsive Advertisement

రక్త సంబంధానికి పూర్తి విలువ ఇవ్వండి 🙏🏻

రక్త సంబంధానికి పూర్తి విలువ ఇవ్వండి 🙏🏻

“రోజులు మారుతున్న కొద్ది మనిషి లైప్ స్టైల్ కూడా మారుతోంది..” మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. అప్పట్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా కష్టం వస్తే దానిని తీర్చడానికి అందరూ కలిసి తమవంతుగా సహాయం చేసేవారు. అప్పటి మనుషులు మనము, మనది అనే భావన ఎక్కువగా ఉంటుంది. వారి దగ్గర ధనం ఉన్నప్పటికీ, అది కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. అయితే రానురాను నెలలు కాలం మారుతున్న కొద్ది మనుషుల్లో మార్పులు వస్తున్నాయి.

1. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వారు ఊపిరి ఆగిపోయినంత వరకు కలిసి ఉండండి. 

👉 ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా చేసుకొని పగలు ప్రతీకారాలు పెంచుకుని మాటలు లేకుండా దూరంగా ఉండకండి. "నాకు దక్కక పోయినా పర్వాలేదు వాడికి దక్కకూడదనే" అనే ఒక రకమైన ఈర్ష్య అసూయలు బంధాలను నాశనం చేస్తున్నాయి. 

2. పోయేటప్పుడు ఆస్తి, డబ్బు మనతో రాదని తెలిసి కూడా వాటి కోసమే ఇంకా ప్రాకులాడటం  ముర్కత్వమే. 

👉 అభం శుభం తెలియని పసి వయసులో ఉన్న ప్రేమ ఆప్యాయత... వయసు, అనుభవం, (అ)జ్ఞానం వచ్చాక కనుమరుగై పోతోంది. 

3. ఈ జన్మలో అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా పుట్టినవాళ్ళు మరుజన్మలో ఎవరు ఎక్కడ పుడతారు ఎవరికీ తెలియదు. 
ఒక తల్లి కడుపులో, ఒక ఇంటిలో, ఒక కంచంలో... జీవితం మొదలుపెట్టిన తోబుట్టువులు అవసాన దశలో పాడి కట్టే నాటికి పక్కన లేకపోవటం అత్యంత బాధాకరం. 

👉 అందుకే దయచేసి రక్త సంబంధాలుకు విలువ ఇవ్వండి. 
ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు అనురాగంతో ఆత్మీయతతో మెలగండి. 

4. మీ తోబుట్టువుల ఆత్మీయతానురాగాలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల బంధాలే... మీ పిల్లలకు ఆదర్శం కావాలి. 

👉 మీరే సరిగ్గా లేకపోతె మీ పిల్లలు కూడా భవిష్యత్తులో వారి బంధుత్వాలకు విలువనివ్వరు. వారి బంధుత్వాలకు కూడా విలువ లేకుండా పోతుంది.

కాబట్టి...✍🏻

“దయచేసి బంధాలను బలపరచండి.”

అంతులేని బంధాల సమూహకార్యాలాపన,
అందమైన మానవ సంభంధాల సమారాధన, 
ఎంతోమంది మనచుట్టూ ఉన్నా,
మనకంటూ చెప్పుకునే వారు ఎందరున్నా,
అయినవారు మన బంధం కోరుకోకపోయినా,
కానివారు మనస్సుకు  చేరువై బరువుగా మారినా, 
గుండెల్ని పిండేసేలాగా బంధాలు మారినా, 
తట్టుకోలేని జీవన విధానం మానవ చక్రం, 
మనిషి ఎక్కడున్నా , ఏ మూలానున్నా, 
తన చుట్టూ ఎదో ఒక బంధం పెనవేసుకునే ఉంటుంది 
అదే రక్త సంబంధం..

🍂 తోబుట్టువుల మధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయో గుర్తుకు తెచ్చుకోండి. వాటిని నివారించడానికి కుటుంబం అంతా కలిసి చర్చించుకోండి. *తప్పు మీదైనా, వారిదైనా సర్దుకు పోతే ఏ సమస్యావుండదు..* అప్పుడుగాని వారు జీవితాంతం మీకు తోడు-నీడై వుంటారు.

🍃 *ఎంతటి అఘాతం ఏర్పడిన మీ మధ్య సఖ్యత ఏర్పడటానికి ఏదో ఒక ఉపాయం ఉండే తీరుతుంది.* ఆ ఉపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దాంతో మీ కుటుంబ దూరం మటుమాయమై ప్రేమబాటకు మార్గం సుగమం చేయగలుగుతుంది.

🍂 ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా చేసుకొని పగలు ప్రతీకారాలు పెంచుకుని మాటలు లేకుండా దూరంగా ఉండకండి. "నాకు దక్కక పోయినా పర్వాలేదు వాడికి దక్కకూడదనే" అనే ఒక రకమైన *ఈర్ష్య అసూయలు బంధాలను నాశనం చేస్తున్నాయి..*

🍃 ఈ జన్మలో అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా పుట్టినవాళ్ళు *మరుజన్మలో ఎవరు ఎక్కడ పుడతారు ఎవరికీ తెలియదు..* 

🍂 ఓకే తల్లి ఎదపై చెరోపక్క పడుకుని ఆప్యాయత అనుభవించిన వారు..

🍃 తండ్రి భుజంపై రెండుపక్కల ఎగురుతూ ఉల్లాసం పొందినవారు.

🍂  కలిసి కథలు విని, చెప్పుకున్న ప్రేమలు, కలిసి పంచుకున్న ఆనందాలు, ఒకరినొకరు ఓదార్చుకున్న సందర్భాలు, కష్టాలల్లో కన్నీరు పంచుకున్నవారు.

🍃 ఒక తల్లి కడుపులో, ఒక ఇంటిలో, ఒక కంచంలో జీవితం మొదలుపెట్టిన తోబుట్టువులు అవసాన దశలో పాడి కట్టే నాటికి పక్కన లేకపోవటం అత్యంత బాధాకరం. 
అందుకే దయచేసి రక్త సంబంధాలుకు విలువ ఇవ్వండి. 
*ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు అనురాగంతో ఆత్మీయతతో మెలగండి.* 

🍂 మీ తోబుట్టువుల ఆత్మీయతానురాగాలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల బంధాలే మీ పిల్లలకు ఆదర్శం కావాలి. మీరే సరిగ్గా లేకపోతె మీ పిల్లలు కూడా భవిష్యత్తులో వారి బంధుత్వాలకు విలువనివ్వరు. వారి బంధుత్వాలకు కూడా విలువ లేకుండా పోతుంది.

👉 పరిస్థితులు, పట్టింపులు, పరువులు, పంతాలు, పగలు ఇవన్ని ఏవీ మనతో రావు.. ఇది అందరూ చెప్పేమాటేనండీ..

👉 కాకపోతే..👇

📌మన ప్రాణం పోయిన రోజు..
మట్టి గుంతలో మనం పడిపోయే రోజు..
చితిపై మనం శరీరం కలిపోయే రోజు..
మనకోసం మనసులోతుల్లోంచి, హృదయస్పర్శతో  కన్నీరు కార్చేది ఒకే కన్నపేగుతో పుట్టిన మన తోబుట్టువులే...

ఆ రోజు, ఆ సమయం, ఆ సందర్భం, ఆ క్షణంలో
ఏ పంతాలు, పట్టింపులు మనతో రావు...🙁😓😥

ఇది వాస్తవం, ఇదే నిజం.. ఇదే ..
అదే చివరి “యదార్థ జీవితసత్యం..”

Post a Comment

0 Comments