మనకు తెలిసిందల్లా ఉప్పును సముద్రపు నీటి నుండి తయారు చేస్తారని.కాని ఉప్పును మట్టి నుండి కూడా తీసేవారు.

మనకు తెలిసిందల్లా ఉప్పును సముద్రపు నీటి నుండి తయారు చేస్తారని.కాని ఉప్పును మట్టి నుండి కూడా తీసేవారు.

SHYAMPRASAD +91 8099099083
0
ఉప్పు కథ ఉప్పరుల వ్యథ
-----------------------------------------------------
ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. నిజమే కాని ఒకప్పుడు ఉప్పు రెండు రకాలు.
మనకు తెలిసిందల్లా ఉప్పును సముద్రపు నీటి నుండి తయారు చేస్తారని.

కాని ఉప్పును మట్టి నుండి కూడా తీసేవారు. ఉపయోగించేవారు. ఇలా మట్టి నుండి ఉప్పును ఉప్పర కులస్తులు రాయలసీమలో తయారు చేసేవారు. సముద్రపు ఉప్పుపై ఆధిపత్యం సంపాదించిన బ్రిటిష్ వారి కన్ను దీనిపైన కూడా పడింది. దీని గురించి చివరలో వివరిస్తాను.

మట్టి అంటే (చౌడుమట్టి) నుండి తీసే ఉప్పు కేంద్రాన్ని మోద అనేవారు. చౌడు మట్టిని దాదాపు ఐదారు మీటర్ల ఎత్తున రెండు మూడు మీటర్ల వెడల్పున శంఖాకారంలో కుప్పగా పోసేవారు.పైభాగంలో ఒక మీటరు వెడల్పు అర మీటరు లోతును తీసేవారు.ఆ గుంత నుండి దిగువకు సున్నం తో కట్టిన చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేసేవారు. భూమి మీద చిన్న చిన్న సున్నపు తొట్టెలు ఏర్పాటు చేసేవారు.పైభాగంలోని గుంటలో నీరు పోస్తే చౌడులో ఉన్న ఉప్పు నీరు రోజు రోజుకు ఊరి, కారి క్రింది సున్నపు తొట్టెలలో చేరేది.అలా చేరిన ఉప్పు, నీరు గాలికి, సూర్యరశ్మికి ఆవిరై ఉప్పు అవశేషాలు మిగిలేవి.అలా మిగిలిన అవశేషాలను సేకరించి శుభ్రపరచి గొనె సంచులలో నింపి ఎనుములపై (గెదెలు ) ఎత్తి సంతలలో ఉప్పరులు అమ్ముకొని జీవనం చేసేవారు.

మట్టి నుండి తీసిన ఉప్పును పేదలు మాత్రమే వాడేవారు. పశువులకు కూడా మట్టి ఉప్పును వాడేవారు.

ఆ రోజులలో ఎరుకలు, లంబాడీలు సముద్రపు ఉప్పును పశ్చిమ ప్రాంతం నుండి తెచ్చి అమ్మేవారు. ధనవంతులు మెరైన్ ఉప్పును
వాడేవారు.

1805 వరకు రాయలసీమ ఉప్పుపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉండేది కాదు.
మోదలో చేసిన మట్టి ఉప్పు వలన  సముద్రపు ఉప్పు అమ్మకం చాలా తక్కువగా ఉండేది. అందువలన బ్రిటిష్ అధికారులు మట్టి ఉప్పును ఉప్పరులు తయారీ చేయరాదని అంక్షలు విధించారు.అయితే మట్టి ఉప్పు తయారీ రాయలసీమ అంతటా అన్ని గ్రామాలలోనూ ఉండేది. బలవంతంగా ఆపటం వలన రహస్యంగా తయారు చేసేవారు. బ్రిటిష్ అధికారులు తీవ్ర ప్రయత్నాల వలన మోద ఉప్పు తయారీ అగి పోయింది.

అనేక మంది ఉప్పరులు కుల వృత్తి కోల్పోయి వీధిన పడ్డారు.ఇలా కొన్ని దశాబ్దాలు జరిగిన పిమ్మట ఉప్పరుల గోడు బ్రిటిష్ వారి చెవిన పడింది.

1873 లో బ్రిటిష్ రెవెన్యూ బోర్డ్ సభ్యుడైన G. Thornhill ను పరిస్థితిని పరిశీలించటానికి నియమించారు.ఉప్పరుల మట్టి ఉప్పు తయారీ ఆపటానికంటే ఆ ఉప్పుపై ఎక్సైజ్ ట్యాక్స్ వేసి తయారీదారులకు లైసెన్స్ ఇవ్వాలని G. థారన్ హిల్ సిఫారసు చేశాడు.

బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు తయారీ ఉప్పరులకు లైసెన్స్ ఇచ్చింది కాని ఇక మీదట ఏ ఉప్పరి కూడా కొత్తగా మోద నిర్మించరాదని ఆంక్షలు పెట్టింది. ఇలా ఆంక్షలు విధించడం వలన, సముద్రపు ఉప్పు విశేషంగా అందుబాటులోకి రావటం వలన, చౌడు నుండి చేసిన ఉప్పులో నాణ్యత చాలా తక్కువ ఉండటం వలన ఉప్పరులు కుల వృత్తి కోల్పోయారు.మోదలు కనుమరుగైనాయి.

అయితే ఉప్పు తయారీ కార్ఖానా అయిన మోద మీదుగా మోద అనే ఊరుFC ఉంది. అనంతపురం జిల్లాలో హిందూపురం తాలూకాలో పరిగి (ప్రాచీన నామం -- పరివి) మండలంలో మోద ఇపుడోక మంచి  గ్రామపంచాయితి.
...................................................................................................... జి.బి.విశ్వనా,9441245857,అనంతపురం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!