ఆరోగ్యం - బీట్ రూట్ జ్యూస్

ఆరోగ్యం - బీట్ రూట్ జ్యూస్

SHYAMPRASAD +91 8099099083
0
ఆరోగ్యం - బీట్ రూట్ జ్యూస్


సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

 బరువు తగ్గడానికీ, లివర్ ను కాపాడేందుకు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇప్పుడు డాక్టర్లు సూచిస్తున్న జ్యూస్ బీట్ రూట్ జ్యూస్.


మనం పెద్దగా పట్టించుకోం గానీ బీట్ రూట్ జ్యూస్‌ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు తెలుసా... మద్యం తాగడం వల్ల పాడైపోయే లివర్‌ను కాపాడేందుకు బీట్ రూట్ జ్యూస్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఈ జ్యూస్ మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) కలిగివుంది. అంతే కాదు... విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి ఈ జ్యూస్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే సూపర్ ఫూడ్‌గా పిలిచే వాటిలో బీట్ రూట్ జ్యూస్‌ని కూడా చేర్చారు. మీకు తెలుసో, తెలీదో గానీ మన శరీరంలో లివర్ దాదాపు 700 రకాల పనులు చేసి పెడుతుంది. మన శరీరంలోకి ప్రవేశించే విష వ్యర్థాల్ని బయటకు పంపిస్తుంది. అందుకే లివర్ చక్కగా పనిచెయ్యాలంటే దానికి బీట్ రూట్ జ్యూస్ ఇవ్వాలన్నమాట. బీట్ రూట్ జ్యూస్ లివర్ లో మంటను తగ్గిస్తుంది. శక్తిని కలిగిస్తుంది.


బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


బీట్ రూట్ జ్యూస్‌లో ప్రోటీన్లు (మాంసకృత్తులు), కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు), ఫైబర్ (పీచు), ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి. మన శరీరానికీ, చర్మానికీ, రక్తానికీ, వ్యాధి నిరోధక శక్తికీ అన్నింటికీ ఎంతో మేలు చేస్తుంది బీట్ రూట్ జ్యూస్.


1.రక్త హీనత తగ్గిస్తుంది : మన శరీరానికి రక్తం చాలా అవసరం కదా. రక్తాన్ని కృత్రిమంగా తయారుచెయ్యలేకపోతున్నారు. అందుకే రక్తదానానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి అలాంటి రక్తాన్ని మనం కాపాడుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ లోని ఐరన్... మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. రక్త హీనత, అనీమియా వంటి సమస్యలు దూరమవుతాయి. ఐరన్ లోపం నుంచీ బయటపడొచ్చు.

2. బీపీని తగ్గిస్తుంది : బ్లడ్ ప్రెషర్ (బీపీ)ని తగ్గించే సామర్ధ్యం బీట్ రూట్ జ్యూస్‌కి ఉంది. ఇందులోని రకరకాల పోషకాలు, ఫైబర్ బీపీని కంట్రోల్ చేస్తాయి. ఈ జ్యూస్ తాగితే 100 శాతం ఫైటోన్యూ్ట్రియంట్స్ (ఫైటో పోషకాలు) బాడీకి అందుతాయి. ఇవి బీపీ ఎంత ఉండాలో అంతే ఉండేలా చేస్తుంటాయి.

3. చర్మానికి రక్షణ : తీవ్రమైన ఎండ, ఇతరత్ర కాలుష్యాల నుంచీ చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. బీట్ రూట్ జ్యూస్ లోపలి నుంచీ చర్మాన్ని కాపాడుతుంది. చర్మంలోకి వచ్చే ఫ్రీ రాడికల్స్ చర్మ కణాల్ని నాశనం చేస్తుంటాయి. సరిగ్గా అలాంటప్పుడు ఈ జ్యూస్ ఎంటరై... ఫ్రీ రాడికల్స్ అంతు చూస్తుంది. ఈ జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. అది సూర్యుడి తీవ్రమైన ఎండల నుంచీ మన చర్మాన్ని కాపాడుతుంది.

4.లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది : ఇప్పుడంటే వయాగ్రా పేరుతో చాలా ఐటెమ్స్, మందులూ వచ్చాయి గానీ... పూర్వం పిల్లలు పుట్టని వారికి బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేవాళ్లు పెద్దలు. కారణం బీట్ రూట్‌లో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. అలాగే బీట్ రూట్ జ్యూస్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. బోరాన్, నైట్రిక్ ఆక్సైడ్ రెండూ కూడా సెక్స్ హార్మోన్లను ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.

5.అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది : బరువు తగ్గాలి, బాగా ఎక్సర్ సైజ్‌లు చెయ్యాలనుకునేవారు... వారానికి నాలుగు సార్లైనా బీట్ రూట్ జ్యూస్ తాగేయాలి. ఎందుకంటే ఇందులో నైట్రేట్లు, బెటాలైన్స్ మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. కండరాల్లో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఫలితంగ మన బాడీ చురుగ్గా తయారై, ఎక్సర్ సైజ్ చెయ్యడానికీ, అథ్లెట్లలా దూసుకుపోయేందుకూ వీలవుతుంది. అదే సమయంలో ఈ జ్యూస్ ఎంత తాగినా బరువు పెరగరు కాబట్టి... ఇది చాలా మేలు చేస్తుంది.

బీట్ రూట్ ని మన ఇళ్లలో వంటల్లో కూడా వాడుతారు. ఐతే, ఇలా వండితే, వాటిలో పోషకాలు తగ్గిపోయి, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా కలగవు. అందుకే ఆరోగ్య నిపుణులు బీట్ రూట్ జ్యూస్ ని తాగమని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!