Responsive Advertisement

లోకం తీరు మారాలి

లోకం తీరు మారాలి 🤔
....................................✍️

డబ్బుంటే కోరిన సౌకర్యాలన్నీ సమకూర్చుకోవచ్చు. కానీ, అభిమానాలు, ఆప్యాయతలు - డబ్బులు ధారపోసినా లభ్యం కావు.మన సంపద ఏడేడు తరాలకు అందివ్వకపోయినా సద్గుణాలు ఒక్క తరానికి అందిస్తే అది ఏడేడు తరాల దాకా నిలిచి ఉంటుంది.కాబట్టి ‘సంతృప్తిని మించిన’ సంపద లేనే లేదు.

మానవ సేవ మానేసి మాధవ సేవ చెయ్యమని ఏ మతము చెప్పలేదె,విధి ని మానేసి విదాతను కొలవమని ఏ పుస్తకంలోను రాయలేదె,చిత్తశుద్ధి లేని పూజలు ఎన్ని చేసిన అవి వృధానే !! చిత్తశుద్ధితో మానవసేవ చేసే ప్రతి మనిషి మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది,మాట మంచిదవుతుంది. మర్యాద కాపాడుతుంది..మన్నన సంప్రాతప్తినిస్తుంది..కాబట్టి ప్రతి ఒక్కరు మాధవసేవ కంటే మానవసేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి.

సంపాదన ద్వారా సాధించిన వస్తువులకి మనం యజమానులం అవుతున్నామని అనుకుంటాం.కానీ నిజానికి మనం బానిసలం అవుతున్నాం.సంపద వల్ల మనకి సేవా బలం పెరగాలేగాని లోపలి శత్రువులు (అంటే అహంకారం) పెరగకూడదు .అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలను సృష్టిస్తాయి. సద్వినియోగం చేసే సామర్ద్యం లేనప్పుడు ఎంత సంపద వున్నా అది వృధానే!!

వ్యక్తులు రంగు కాగితాలకిచ్చే విలువలతో పోలిస్తే , అంతకంటే వేయిరెట్లు విలువ ఉన్న మానవ జీవితానికి ఇవ్వకపోవడం దురదృష్టకరం. మనిషి బ్రతకడం కోసం సంపాదించడం సరైనదేకానీ ,మనిషికి మనిషికి మధ్య ఉన్న ఆత్మీయత,అనుబంధాలనూ విస్మరింవాడు జీవితంలో పైకి ఎదగలేడు.

ప్రపంచంలో ఎవడూ డబ్బు పెట్టి కొనలేనిది శాంతి. దాన్ని సాధనచేసి సంపాదించుకోవాలేగాని ఊరికే లభించదు. లోకంలో ఉన్న పదార్థాలలో అతివిలువైనది కూడా శాంతి ఒక్కటే. అహంకారం, కోపం ఉన్నంతవరకు ఎవ్వరికీ శాంతిలభించదు. ఆ రెండు పోతేనే శాంతి లభించేది

Post a Comment

0 Comments