కథ - నమ్మకము వలన కలిగే శక్తి

కథ - నమ్మకము వలన కలిగే శక్తి

SHYAMPRASAD +91 8099099083
0
నమ్మకము వలన కలిగే శక్తి 

#విలువ : #ఆశావాదము  

ఉపవిలువ :#ఆత్మవిశ్వాసము

ఒక వ్యాపారస్తుడు  తన వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అప్పులపాలు అయ్యాడు . బయిటకు పడే మార్గం లేక నిరాశవాది అయ్యాడు. పార్కుకు వచ్చి బెంచీ మీద దిగులుగా కూర్చున్నారు . తనను ఎవరైనా ఈ కష్టము నుంచి బైట పడేస్తారా అని విచారిస్తూ కూర్చున్నాడు .

ఇంతలోనే  ఒక ముసలాయన వచ్చి అతను దిగులుగా వుండటం చూసి విషయం ఏంటని అడిగి, సంగతి తెలుసుకున్నాడు . తరువాత ముసలాయన ఇలా  అన్నాడు .

“నేను  నీకు సహాయపడగలనని అనుకుంటున్నాను. ” వెంటనే  తన జేబు లో ఉన్న చెక్ బుక్ తీసి వ్యాపారి పేరు అడిగి కొంత పైకం చెక్ మీద వ్రాసి దాన్ని,  వ్యాపారి చేతిలో పెడుతూ ఇలా అన్నాడు .”ఈ డబ్బు తీసుకో! సరిగ్గా , ఏడాది తరువాత మనము ఇదే పార్కులో ఈ బెంచీ దగ్గరే  కలుసుకుందాం . అపుడు నా ధనం చెల్లించుదువు గాని ” అన్నాడు . వెంటనే ఆ పెద్దమనిషి అక్కడనుంచి వెళ్ళిపోయాడు . 

    ఆ చెక్ పై 5000,000 డాలర్స్ అమౌంట్ వేసివుంది. క్రింద సంతకం, ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడైన రాక్ ఫెల్లర్   అని ఉంది . వ్యాపారి “నా బాధలు ఇప్పుడీ నిమిషంలో తీరిపోతాయి “అని అతనికి ఆస కలిగింది.కానీ,అతడు ఆ చెక్ ని వాడదలుచుకోలేదు . తన పెట్టలో భద్రంగా దాచుకున్నాడు.”   “ఈ చెక్ నాకు అవసరం అయినప్పుడు వాడతాను . ” ఈ చెక్ వున్నదని నమ్మకమే నా ఆలోచనా ధోరణి మార్చివేసింది . నాకు ధైర్యము వచ్చింది .

    ” నా #శక్తి మీద నాకు నమ్మకంకలిగింది.”అని  అనుకున్నాడు. తన వ్యాపారం నిలుపుకునే మార్గాల గురించి  చేయవలసిన పనుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతో ఆశతో , ధృడ  సంకల్పంతో , ఆత్మవిశ్వాసంతో ,ఎన్నో కొత్త ప్రతిపాదనలు రూపొందించి ఆ దిశగా పని ప్రారంభించాడు . క్రమంగా కొన్ని నెలలు తిరగాక ముందే వ్యాపారంలో లాభాలు చవిచూశాడు. అప్పులు తీర్చాడు. రాబడి ఎంతో  పంచుకున్నాడు,స్థిరపడ్డాడు.   సరిగ్గా ఒక సంవత్సరం  తర్వాత , అదే రోజున తను ఉపయోగించకుండా  దాచిన చెక్ ను ఆ పెద్దమనిషికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పార్కులో ,ఆయనను కలవాలిసిన బెంచ్ మీద కూర్చొని అతని కోసం నిరీక్షించసాగాడు.  

        సరిగ్గా అక్కడకి  ఆ పెద్దమనిషి వచ్చాడు. వ్యాపారి చెక్ తిరిగి అతని చేతిలో పెడుతుండగా, వెనుక నుంచి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా  పట్టుకుంది . ” హమ్మయ్యా దొరికాడు,మిమ్మల్ని ఏమి కష్టపెట్టలేదు కదా? ఈయన హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చాడు.తాను ప్రపంచంలో గొప్ప ధనవంతుడైన జాన్ రాక్ ఫెల్లర్  అనే భ్రమ లో ఉంటాడు.”అంటూ ఆ పెద్దమనిషి చెయ్యి పట్టి లాకెళ్తున్నట్టు వడివడిగా అక్కడినుండి వెళ్ళిపొయంది .

వ్యాపారి ఒక్కసారిగా దిగ్భ్రాంతి  చెందాడు. ఆ చెక్ డబ్బులు ఉన్నాయిలే అనే ధైర్యంతో ఎన్నో ప్రతిపాదనలు చేశాడు. కొన్ని కొన్నాడు ,అమ్మాడుకూడా . క్రొత్త పద్ధతులు ప్రెవేశపెట్టాడు. దివాలా  తీసిన పరిస్థితులనుంచి బైట పడి పూర్వం కంటే గొప్ప ధనవంతుడయ్యాడు. తరువాత ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు. నిజానికి, ఆ చెక్ చెల్లదు .తన పురోగమనవృద్ధికి ఆ డబ్బు కారణం కాదు. ఆతను ఆ చెక్కు ని ఉపయోగించి విజయవంతుడు అవ్వలేదు. ఆ చెక్కు మీద నమ్మకంతో వచ్చిన ఆత్మవిశ్వాసము వల్లనే  విజయాన్ని సాధించగలిగారు. తనకు ఆ సామర్ధ్యము ముందునుంచే ఉంది. కానీ, కృంగిపోయిన మనస్సుతో ఏ ప్రయత్నము చేయలేదు. తనమీద తనకున్న నమ్మకమే తన ఆత్మవిశ్వసాన్ని పెంచి వ్యాపారం లో తిరిగి ధనవంతుడిని చేసింది. తనపై తనకు నమ్మకామూ మరియు శక్తే దీనికి కారణం అనుకున్నాడు.

 నేర్చుకోవలసిన విషయము:  ఎవరికైనా వారిపై వారికి విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యము కలది. మనమీద మనకి నమ్మకం లేకపోతే ఎవరూ మనకేమీ  చేయలేరు. చాలా  సార్లు, మనం మానని  మన స్నేహితులతో పోల్చుకుంటాం. అందమైన వారిని ,పేరుప్రఖ్యాతలున్న వారిని చూసి వారిని అనుకరించటానికి ప్రయత్నిస్తాం .ఎందుకంటే మనమీద మనకు నమ్మకం ఉండదు. మనకంటే అవతలి వారు గొప్పవారనుకుంటాము. మనలని మనం తక్కువగా భావిస్తాము’. బైట కనపడేదంతా నిజం అనుకుంటాం. అది అన్ని సార్లు కరెక్ట్ కాదు. చిన్నప్పటినుంచీ మనమీద మనకి నమ్మకం ఉండాలి.            

#ఆత్మవిశ్వాసం, #ఆత్మగౌరవం మనలో మంచి లక్షణాలను పెంచుకుంటూ ఉండాలి . ఎంతో మనోనిబ్బరంగా, గట్టిగా  ఉండాలి. బాహ్య ఆకృతి వయసు పెరిగే కొద్దీ మార్పు చెందుతుంది.

 కానీ మనలో ఉన్న  ఆత్మవిశ్వాసం ,ఆత్మగౌరవం మన మానసిక శక్తి వయసుతో పాటు వృద్ధి చెందుతాయి. క్రమంగా అంతరంగ పరివర్తన లో మార్పుకలిగి “#నేను” అనేది ఏమిటో తెలిసుకొంటాం .

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!