జగదీష్ చంద్ర బోస్, 1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23)

జగదీష్ చంద్ర బోస్, 1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23)

SHYAMPRASAD +91 8099099083
0
జగదీశ్ చంద్ర బోస్

భారతీయ భౌతిక, జీవ, వృక్ష, మరియు పురాతత్వ శాస్త్రవేత్త.

జగదీష్ చంద్ర బోస్, 1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.[ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.[ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి

జగదీష్ చంద్ర బోస్ అతని పరిశోధనాలయంలో...

జననం1858 నవంబరు 30
మైమెన్‌సింగ్, తూర్పు బెంగాల్ (ప్రస్తుతము బంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియామరణం1937 నవంబరు 23 (వయసు 78) 

ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సులో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.

పరిశోధనలు

జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు.

బోసు వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి వివిధ రకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల, వృక్షాల కణజాలాలలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినప్పటికీ, ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కూడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.

బోసు కు చెందిన 60 GHz ల మైక్రోవేవ్ సాధనం, బోసు ఇంస్టిట్యూట్ లో గలదు.

బోసు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!